నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
హైకోర్టు న్యాయమూర్తులు
కరీంనగర్ క్రైం/సిరిసిల్ల/మంథని : న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయవ్యవస్థకు రెండు కళ్లలాంటి వారని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్‌రావు, జిల్లా ఫోర్టు పోలియో జస్టిస్ శేషసారుు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో మూడు జిల్లాలకు సంబంధించిన ఏసీబీ కోర్టును శనివారం ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ఏసీబీ కేసులు సత్వరంగా పరిష్కారమయ్యేందుకు ఈ కోర్టు ఉపయోగపడుతుందన్నారు.
సిరిసిల్లకు జిల్లా అదనపు కోర్టుకు కృషి
సిరిసిల్లలో జిల్లా అదనపు కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి పి.నవీన్‌రావు పేర్కొన్నారు. సిరిసిల్లలోఅదనపు మున్సిపల్ మెజి స్ట్రేట్ కోర్టును ప్రారంభించారు. న్యా యమూర్తి శేషసాయి మాట్లాడుతూ సిరిసిల్ల చేనేత మన జాతి ఖ్యాతి అని కొనియూడారు. మంథనిలో నూతన కోర్టు సముదాయ భవనాలు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు శనివారం ప్రారంభించారు.
జిల్లా జడ్జి నాగమారుతిశర్మ, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రావు, ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు, బార్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్‌కుమార్, ఎస్పీ శివకుమార్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంపెల్లి రవీందర్‌రావు, సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి టి.మురళీధర్, డీఎస్పీ దామెర నర్స య్య, సీఐ విజయ్‌కుమార్, మంథని, గోదావరిఖని జడ్జీలు కుమారస్వామి, వెంకటకృష్ణ. మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, ప్రధాన కార్యదర్శి సహేందర్‌రెడ్డి, కోశాధికారి రమణకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
రాజన్న ఆలయంలో పూజలు
వేములవాడ అర్బన్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు నవీన్‌రావు, శేషసాయి శనివారం దర్శించుకున్నారు. శ్రీలక్ష్మీగణపతి పూజ, స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.