ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: న్యాయవాదులు ధర్మపూరిత మార్గాన్ని ఎంచుకోవాలని, కష్టించి పని చేస్తే వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని హైకోర్టు జడ్జి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి అన్నారు. ‘న్యాయవాద వృత్తి నైపుణ్యం, సామర్ధ్య ఆవశ్యకత’ అనే అంశంపై అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) ఆధ్వర్యంలో శనివా రం ఖమ్మంనగరంలోని జిల్లా పరిషత్ మీటిం గ్ హాల్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ న్యా యశాస్త్ర పట్టా పొంది ఉంటే లాయర్ కారని, న్యాయవాది పూర్తి పరిశుద్ధంగా దేనినైనా అర్థం చేసుకునే స్వభావం, తెలివితేటలు కలిగి ఉండాలని, తమ వృత్తిని ఎప్పుడు అగౌరవ పరచరాదని అన్నారు. ఇంగ్లిష్ పరభాష అయినా దానిపై పట్టు సాధించాలని, న్యాయవాదులు వృత్తి విలువలకు కట్టుబడి ఉండాలని అన్నారు.
హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రముఖ న్యాయవాదులు రాచకొండ విశ్వనాధశాస్త్రి, దేవీ శ్రీనారాయణ, మరెందరో నిరాడంబర జీవితాన్ని గడిపి పేరు ప్రఖ్యాతులు గడించారని అన్నారు. న్యాయవాదులకు అనేక చట్టాలపై వృత్తి మెళకువలను ఆయన ఉద్బోధించారు. చిన కేసైనా, పెద్ద కేసైనా ఎంతో విషయ పరిజ్ఞానంతో వాదించాలని అన్నారు. వాద ప్రతివాదాల సమయంలో న్యాయవాదులు శ్రద్ధతో వ్యవహరించాలని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ హెచ్‌ఆర్ కన్నా చెప్పారని ఆయన గుర్తు చేశారు. న్యాయవాదులు తమ విధిని సక్రమంగా, చిత్తశుద్ధితో నిర్వహించడం, కక్షిదారుల పట్ల గౌరవంగా ఉండడం, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండడం అవసరమని అన్నారు.
అనంతరం జిల్లా జడ్జి ఐ. రమేష్ మాట్లాడుతూ న్యాయవాదులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. రాబోయే రోజుల్లో న్యాయవాద వృత్తి ఎంతో సవాల్‌గా మారుతుందని, న్యాయవాదులు నిత్య విద్యార్థిగా ఉండాలని అన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, ఐలు రాష్ట్ర కార్యదర్శి కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ కక్షిదారులకు మంచి సేవలు అందిస్తూ వృత్తి పట్ల నిబద్ధతతో ఉం డాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఐలు గౌరవాధ్యక్షులు కొండపల్లి ఉత్తమ్‌కుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఐలు జిల్లా కార్యదర్శి మీసాల వెంకటేశ్వర్లు, టౌన్ అధ్యక్షుడు నవీన్‌చైతన్య, నాయకులు ఏడునూతల శ్రీనివాసరావు, జాలావతి, శ్రీదేవి, న్యాయవాదులు మర్రి కృష్ణమూ ర్తి, ఎం.మురళీధరరావు, వేగినాటి నాగేశ్వరరావు, బార్ వైస్ ప్రెసిడెంట్ కూర్మాచలం రవీంద్రస్వామి,గ్రంథాలయ కార్యదర్శి కోటి రామకృష్ణ, పంబా వెంకయ్య, చుంచుల మల్లికార్జున్‌రావు, యెన్నెబోయిన శ్రీనివాసరావు, అజీజ్‌పాషా, కంచర్ల విజయ్‌కుమార్, కూరపాటి వెంకటప్పయ్య, లక్ష్మీనారాయణ, మధిర, కొ త్తగూడెం, ఇల్లెందు, మణుగురు, భద్రాచలం కోర్టులకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు.
ధర్మపూరిత మార్గాన్ని ఎంచుకోవాలి..
Published Sun, Dec 22 2013 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement
Advertisement