K Padmarajan
-
Vijay prakash kondekar: పట్టువదలని విక్రమార్కుడు
విజయ ప్రకాశ్ కొండేకర్. తెల్లగడ్డం, తెల్లని దోతీ, భుజంపై కండువా, ఒంటిపై అంగి కూడా లేకుండా కనిపిస్తాడు. కానీ పట్టు వదలని విక్రమార్కుడనే పదబంధానికి నిలువెత్తు రూపం. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఈయన స్థానిక సంస్థల నుంచి లోక్‌సభ దాకా ఇప్పటికి ఏకంగా 25 సార్లు పోటీ చేశారు. దశాబ్దాలుగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్ బోర్డు నుంచి 1980ల్లో రిటైరయ్యారు. ‘బూటు గుర్తునే గెలిపించండి’ అని రాసున్న ప్లకార్డును ఓ బండిపై పెట్టుకుని కాలినడకన ప్రచారం చేస్తుంటారు. నగర వీధుల్లో అతడిని కొందరు పట్టించుకోకుండా వెళ్తే మరి కొందరు సెలీ్ఫలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఉచితంగా ప్రచారం దొరికిందంటూ సంతోషిస్తారాయన. గెలిచే అవకాశం లేదని తెలిసినా ప్రచారం కోసం పూరీ్వకుల భూమి, ఇల్లు అమ్మేశాడు. ఎప్పటికైనా ప్రధాని కావాలన్నది ఆయన కలట. దాన్ని నిజం చేసుకోవడానికి ఎన్ని సార్లైనా పోటీ చేస్తూనే ఉంటానంటారు కొండేకర్. ఆయన కంటే ఘనుడు మరొకరున్నారు. ఆయనే కె.పద్మరాజన్. గిన్నిస్ రికార్డు కోసం 170 కంటే ఎక్కువ ఎన్నికల్లో పోటీ చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీపైనే బరిలో దిగారు! అలాగే యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన 78 ఏళ్ల హస్నురామ్ అంబేద్కరి ఇప్పటిదాకా ఏకంగా 98సార్లు ఎన్నికల్లో తలపడ్డారు. ఈసారి కూడా ఆగ్రా, ఫతేపుర్సిక్రీ స్థానాల్లో నామినేషన్ వేస్తున్నారు. ఆ రెండింట్లోనూ ఓడి సెంచరీ కొడతారట! ‘నీ భార్యే నీకు ఓటేయదు. ఇతరులెలా వేస్తారు’ అంటూ ఓ బీఎస్పీ నేత అవమానించడంతో విజయం కోసం కాకుండా ఓట్ల కోసం ఆయన ఇలా పోటీ చేస్తూనే ఉన్నారు!! -
ఎలక్షన్స్ కోసం రూ.80 లక్షలు ఖర్చు.. వందలసార్లు ఓడినా మళ్లీ బరిలోకి..
న్యూఢిల్లీ: ఎలక్షన్ అనగానే ఎవరైనా గెలవాలనే పోటీ చేస్తారు. కానీ ఓడిపోవడానికే పోటీ చేసే వ్యక్తి కూడా ఉన్నారంటే.. బహుశా ఇది వినటానికి కొంత వింతగా ఉంటుంది. అయినా ఇది నమ్మాల్సిన నిజం. ఇప్పటికి 238 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి.. ఒక్కసారికి కూడా గెలుపొందలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఆయనే.. ఎలక్షన్ కింగ్ 'కే పద్మరాజన్'. ఎలక్షన్ ఏదైనా పోటీ చేయడమే ప్రధానం అన్నట్లు పద్మరాజన్ నామినేషన్స్ వేస్తూనే ఉన్నారు. ఇప్పటికి ఎన్నికల కోసం ఈయన రూ.80 లక్షలు డిపాజిట్ చేసి మొత్తం కోల్పోయారు. ఇప్పడూ కూడా తమిళనాడులోని ధర్మపురి లోక్‌సభ స్థానం నుంచి, కేరళలోని త్రిస్సూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 1988లో తమిళనాడులోని తన స్వస్థలమైన మెట్టూరు నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించిన పద్మరాజన్.. మాజీ ప్రధానులు అటల్ బీహార్ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మాజీ ప్రధానమంత్రుల మీద సైతం పోటీ చేశారు. ఎన్నికలలో నిలబడిన ప్రతిసారీ నాకు ఓటు వేయవద్దని ప్రజలను చెబుతానని పద్మరాజన్ పేర్కొన్నారు. జయలలిత, ఎం కరుణానిధి, ఎకె ఆంటోనీ వంటి మాజీ ముఖ్యమంత్రుల నుంచి సినీ నటులు హేమ మాలిని, విజయకాంత్ వరకు.. పద్మరాజన్ అందరిమీదా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో అత్యధికసార్లు ఓడిపోయి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించమే లక్ష్యం అని పద్మరాజన్ చెబుతున్నారు. అత్యధిక సార్లు ఎన్నికల్లో ఓటమిపాలైన వ్యక్తులలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాకా జోగిందర్‌సింగ్ కూడా ఒకరు. పద్మరాజన్ 238 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. కానీ జోగిందర్‌సింగ్ ఏకంగా 300 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈయన 1998లో కన్నుమూశారు. బహుశా ఈ రికార్డును బద్దలు కొట్టడానికి పద్మరాజన్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
మళ్లీ బరిలోకి ఎలక్షన్ కింగ్.. 177వసారి
మధురై: మరోసారి ఎలక్షన్ కింగ్ పోటీ చేసేందుకు బరిలోకి దిగాడు. ఉప ఎన్నికల కోసం నామినేషన్ పత్రాలు దాఖలు చేశాడు. అతడు ఇలా ఎన్నికల్లో పోటీ చేయడం ఇది 177వ సారి. ఇంతకీ ఎవరు ఆ ఎలక్షన్ కింగ్ అని అనుకుంటున్నారా..! తమిళనాడులో సేలంలో కే పద్మరాజన్(57) అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన 1988 నుంచి పలు ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. ఆయనను అంతా ఎలక్షన్ కింగ్ అంటారు. తాజాగా తిరుపరన్కుంద్రం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో అక్కడ నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మరోసారి నామినేషన్ పత్రాలు సమర్పించి ఔరా అనిపించారు. అదే సమయంలో ఆయనతోపాటు మరో ఇద్దరు కూడా నామినేషన్లు వేశారు. ఈ నియోజకవర్గంలో గతంలో ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎస్ఎం సీనివేల్ గత మే నెలలో గెలిచాడు. అయితే, ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టకముందే అదే నెల 25న చనిపోయాడు. దీంతో అక్కడ ఖాళీ ఏర్పడగా ఉప ఎన్నిక ఖరారైంది.