kadiri municipality
-
టీడీపీ కౌన్సిలర్ల మధ్య తోపులాట
► కౌన్సిల్లో సబ్ ప్లాన్ నిధుల అంశం వాయిదా కదిరి: తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ల మధ్య ఉన్న విభేదాలు కౌన్సిల్ సాక్షిగా బయటపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగం అంశంపై కొందరు కౌన్సిలర్లు మద్దతు పలికితే, అదే పార్టీకి చెందిన మరికొందరు విభేదించారు. ఈ విషయంపై చివరకు పోడియం దగ్గరకు వచ్చి వాదులాడుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కలుగజేసుకుని వారిని వారి స్థానాల్లో కూర్చోబెట్టారు. చివరకు ఆ అంశాన్ని వాయిదా వేశారు. చైర్పర్సన్ సురయాభాను అధ్యక్షతన సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశం వాడీ వేడీగా సాగింది. సబ్‌ప్లాన్ నిధులన్నీ వైస్‌చైర్మన్ వసంత ప్రాతినిధ్యం వహించే వార్డుకే కేటాయించడమేంటని తొలుత టీడీపీ కౌన్సిలర్ చంద్ర కౌన్సిల్లో తన అభ్యంతరాన్ని తెలియజేసి, ప్లెక్సీని పట్టుకొచ్చి నిరసన తెలిపారు. ఇందుకు వైస్ చైర్మన్ మండిపడ్డారు. దళితవాడల అభివృద్ధికి అడ్డుతగిలితే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో కౌన్సిలర్ శంకర్ వైస్ చైర్మన్‌కు మద్దతు తెలిపి కౌన్సిలర్ చంద్రతో గొడవకు దిగారు. అఖరుకు ఆ అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు. వచ్చే నెల 5న ఈ అంశంపై కౌన్లిలర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయం తీసుకుందామన్నారు. పింఛన్ల మంజూరులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించే వార్డులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆ పార్టీ కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్, ఖాదర్‌బాషా, జగన్, జిలాన్ మరికొందరు కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. సమావేశంలో కమిషనర్ పీబీ ప్రసాద్, కౌన్సిలర్లు రాజశేఖరాచారి, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు. -
చైర్మన్ కుర్చీ’ రూ.50 లక్షలు?!
ఓ భూ కబ్జాదారుడికి టీడీపీ అమ్మేసిందని ఆరోపణలు తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకే బేరసారాలు కదిరి, న్యూస్‌లైన్ : ఎన్నికలంటేనే.. అనేక జిమ్మిక్కులుంటాయి. అందులో ‘కుర్చీలు’ కొనడం కూడా పరిపాటి. కదిరి మునిసిపాలిటీలో ఇదే జరిగిందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని పట్టణంలో అక్రమార్జన పరుడైన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడికి రూ.50 లక్షలకు అమ్మేశారని తెలుస్తోంది. టీడీపీ నాయకులు ఈ అమ్మకానికి సూత్రధారులన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మున్సిపాలిటీలో అక్రమ లే అవుట్లు వేసి పట్టణ ప్రజలను నిలువునా ముంచుతున్న సదరు వ్యక్తి.. తాను కౌన్సిల్లో అడుగు పెడితే.. తన ప్లాట్ల వ్యాపారానికి అడ్డూ అదుపూ ఉండదని, మూడు పువ్వులు, ఆరు కాయలుగా విస్తరింపజేసుకోవచ్చన్న ఆలోచనతోనే ‘చైర్మన్ కుర్చీ’ తమకే దక్కేలా టీడీపీ నేతలతో ఒప్పందం కుదుర్చుకుని కొనుక్కున్నట్లు తెలుస్తోంది. ఈయన తన భార్యను 8వ వార్డులో టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దింపారని, ఆమెను చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టేందుకే బేరసారాలు ఆడినట్లు ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. సీపీఐ కదిరి డివిజన్ కార్యదర్శి వేమయ్య యాదవ్ సైతం ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ఆరోపించడం బలం చేకూరుస్తోంది. ‘ఆమె గెలిస్తే..ఈయన మున్సిపాలిటీని అమ్మేస్తాడు’ అందుకే ‘ఫ్యాను’కు ఓటేసి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రుణం తీర్చుకుందామంటున్నారని విన్నవారు చెబుతున్నారు. 33వ వార్డులో సైతం టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులు ప్రచారంలో ఓటర్ల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. పూర్వాశ్రమంలో ఆయన లాటరీ టికెట్లు అమ్ముతుండేవాడు. అప్పట్లో పోలీసులకు పట్టుబడి కోర్టుకు హాజరైన సంఘటనలెన్నో ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్‌లో కేసు నమోైదె తే కోర్టులో జరిమానా చెల్లించి వచ్చాడు. దీంతో ప్రచారంలో అవస్థలు పడుతున్నానని తన మిత్రులతో వాపోయినట్లు సమాచారం. కుటాగుళ్లలో 1 వార్డు టికెట్ ఆఖరు దాకా తనకే వస్తుందని ఆశపడిన నాగరాజుకు కాదని, డబ్బున్న మరో వ్యక్తికి ఇచ్చారని ప్రజలు చెబుతున్నారు. వేమయ్య యాదవ్ సైతం ఆరోపించాడు. రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులను వెంటాడుతోంది. ప్రచారంలో ఓటర్ల నుంచి చేదు అనుభవాన్ని వారు చవి చూస్తున్నారు.