కేఎల్‌యూలో ‘ఖైదీ నెం 150’ యూనిట్
వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): స్థానిక వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో 'ఖైదీ నంబర్ 150' చిత్ర యూనిట్ సభ్యులు గురువారం పర్యటించారు. చిరంజీవి నటించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ ఎక్కడ నిర్వహించాలి అనే అంశంపై నిర్మాత అల్లు అరవింద్ అక్కడ ఉన్న వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి 150వ చిత్రం ఆడియో ఫంక్షన్ నిర్వహణకు కృష్ణా జిల్లా ఫెర్రి, తాత్కాలిక సచివాలయం వద్ద, మంగళగిరి హాయ్‌ల్యాండ్‌ను పరిశీలించామని తెలిపారు. సినీ వర్గాలు మాత్రం దాదాపుగా యూనివర్సిటీనే ఖాయం చేసినట్టు విశ్వసనీయ సమాచారం.