ఎన్ఎఫ్సీ ఛైర్మన్‌గా కళ్యాణ క్రిష్ణన్
హైదరాబాద్: అణు ఇంధన రంగంలో విశేష సేవలందిస్తోన్న హైదరాబాద్‌లోని అణు ఇంధన సంస్థ (ఎన్ఎఫ్సీ) ఛైర్మన్, సీఈవోగా ప్రముఖ శాస్త్రవేత్త కళ్యాణ క్రిష్ణన్ నియమితులయ్యారు. రెండేళ్ల పదవికాలం ముగియడంతో ఎన్ఎఫ్సీ ఛైర్మన్, సీఈవోగా వ్యవహరించిన ఎన్.సాయిబాబ బుధవారం పదవివిరమణ పొందారు. ఎన్ఎఫ్సీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న జీ కళ్యాణకృష్ణన్కు ఎన్ఎఫ్సీ కొత్త సీఈవోగా బాధ్యతలు అప్పగించారు.
అణు ఇంధన ఉత్పత్తిలో ఎన్ఎఫ్సీ ప్రపంచ రికార్డు నెలకొల్పడంలో కళ్యాణ క్రిష్ణ తనవంతు కృషి చేశారు. 1980 ఆర్ఈసీ(ప్రస్తుత ఎన్ఐటీ-వరంగల్)లో కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ముంబైలో ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ బార్క్(బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)లో(24వ బ్యాచ్)లో చేరి న్యూక్లియర్ ఇంజనీరింగ్‌లో ప్రావీణ్యం పొందారు. రాజస్తాన్‌లో కోటాలోని అణు ఇంధన సంస్థలో హెవీ వాటర్ బోర్డులో పని చేశారు. ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్ల(ఐఐసీహెచ్ఈ)ల సభ్యుల్లో కళ్యాణ క్రిష్ణన్ ఒకరు. జిర్కోనియం కాంప్లెక్స్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కళ్యాణ క్రిష్ణన్ చేసిన కృషికిగానూ డీఏఈ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించారు.