kannayya
-
కన్నయ్య తపన
‘ఎంత కష్టమైనా తాను అనుకున్నది సాధించాలన్నది ఆ యువకుడి తపన. తన లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు?’అనే అంశంతో తెరకెక్కిన చిత్రం ‘కన్నయ్య’. విపుల్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున ఈ చిత్రాన్ని రాజేష్ జాదవ్, కృష్ణంరాజు పగడాల, రవితేజ తిరువాయిపాటి నిర్మిస్తున్నారు. హర్షిత కథానాయిక. సత్యకశ్యప్, ఘంటసాల విశ్వనాధ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న విడుదల చేశారు. సినిమా ట్రైలర్‌ను కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్. వేణుగోపాలచారి రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, కుటుంబ బంధాల మేళవింపుతో తెరకెక్కుతోన్న చిత్రమిది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు. చిత్ర నిర్మాతలు, నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర ప్రసాద్, మల్కాపురం శివకుమార్, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. -
కన్నయ్య లక్ష్యం ఏంటి?
విపుల్, హర్షిత జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘కన్నయ్య’. విపుల్ దర్శకత్వంలో జాదవ్ రాజేష్ బాబు, పగడాల కృష్ణంరాజు, తిరువాయిపాటి రవితేజ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కుటుంబ విలువలు, బంధాలు, సెంటిమెంట్, వినోదం అన్నీ సమపాళ్లలో ఉంటాయి. కన్నయ్య ఎవరు? అతని లక్ష్యం ఏంటి? అనేది కథాంశం. సత్యకశ్యప్ సంగీతం ప్రేక్షకులను అలరిస్తుంది. జవహర్ రెడ్డి ప్రతి ఫ్రేమ్‌ను చాలా అద్భుతంగా చూపించారు. త్వరలో పాటలు, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వైవిధ్యమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఉత్తేజ్, కాశీ విశ్వనాథ్, సత్యకృష్ణ, సూర్య తదితరులు నటించారు. -
'తండ్రి వస్తేనే కొడుకును వదులుతాం..'
తమ చెరలో ఉన్న ఇస్సాక్‌ను విడుదల చేయాలంటే అతని తండ్రి పాస్టర్ కన్నయ్య తమ వద్దకు రావాల్సిందేనని మావోయిస్టులు అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఇస్సాక్ ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టుల చేతిలో బందీలైన పాస్టర్లను ఆదివారం రాత్రి మావోయిస్టులు విడిచిపెట్టారు. అయితే చెర వీడిన పాస్టర్లు అటవీ ప్రాంతంలో అసలేం జరిగిందనే దానిపై నోరు మెదపడం లేదు. ఇస్సాక్ ఆచూకీ కోసం వెళ్లినపుడు మావోయిస్టులు ఎలా తారసపడ్డారు, ఏం మాట్లాడారు, ఇస్సాక్‌ను చూపించారా, ఎలాంటి హెచ్చరికలు చేశారనే దానిపై వారు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే, తాము ముందు నుంచీ బందీ చేసిన ఇస్సాక్‌ను, పాస్టర్లను మావోయిస్టులు విడివిడిగా ఉంచినట్లు తెలిసింది. కాగా, కన్నయ్య వచ్చిన తర్వాత అతనితో మాట్లాడిన అనంతరం కొడుకుని విడుదల చేస్తామని, మరోసారి ఇస్సాక్‌విడుదల కోసం ఎవరూ మధ్యవర్తులుగా రావద్దని మావోయిస్టులు హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో ఇస్సాక్ భవితవ్యం ఇక అతని తండ్రిపైనే ఆధారపడి నట్లయింది. ఈ నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. మరోవైపు మావోయిస్టులు కన్నయ్యకు అల్టిమేటం జారీచేస్తూ ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇస్సాక్‌ను అపహరించిన నాటి నుంచి కన్నయ్య ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు లేఖలో ఏం రాశారనేది స్పష్టంగా తెలియరాలేదు. -
సినిమా థియేటర్లో తొక్కిసలాట
ఎమ్మిగనూరులో ఒకరి మృతి ఎమ్మిగనూరు: ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విడుదల సందర్భంగా బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఓ అభిమాని ప్రాణాన్ని బలిగొంది. అభిమాన హీరో రాంచరణ్ నటించిన సినిమాను మొదటి రోజే చూడాలని ఎమ్మిగనూరులోని బుడగజంగాల కాలనీకి చెందిన కన్నయ్య(19) ఒక రోజు ముందే టికెట్ కొనుగోలు చేసి స్నేహితులతో కలసి థియేటర్‌కు చేరుకున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు థియేటర్ గేట్లు ఒక్కసారిగా తెరవడంతో అప్పటికే అక్కడ గుమికూడిన అభిమానులంతా లోపలికి తోసుకెళ్లారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో కన్నయ్య కింద పడి ప్రాణాలొదిలాడు. విషయం తెలుసుకున్న బంధువులు థియేటర్ వద్దకు చేరుకుని హీరో ఫ్లెక్సీలను తగులబెట్టి ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. మృతునికి రెండు నెలల్లో వివాహం జరగనున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది.