కన్యకాపరమేశ్వరికి బంగారు చీర, వజ్ర కిరీటం
♦ తమిళనాడు గవర్నర్ రోశయ్య
♦ చేతుల మీదుగా సమర్పణ
విశాఖ పాత నగరం కన్యకాపరమేశ్వరి దేవస్థానంలోని మూల విరాట్‌కు కోటిన్నర రూపాయల వ్యయంతో నాలుగు కేజీల బంగారాన్ని వినియోగించి రూపొందించిన బంగారు చీరను తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య శుక్రవారం అమ్మవారికి సమర్పించారు. విజయనగరం పట్టణంలోని వాసవీ మాతకు విశాఖపట్నం వాసవీ జ్యూవెలర్స్ సమర్పించిన వజ్ర కిరీటాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ఆయన మాట్లాడుతూ విశాఖలోని ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన కన్యకాపరమేశ్వరి ఆలయం అభివృద్ధికి ఆర్య వైశ్యులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా రోశయ్యను ఆలయ కమిటీ సత్కరించింది.
- విశాఖపట్నం/విజయనగరం రూరల్