kapileswara swamy
-
కపిలేశ్వరాలయంలో లక్ష కుంకుమార్చన
సాక్షి, తిరుపతి: టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో మహాలక్ష్మీ, సరస్వతి, కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన చేపట్టారు. ముందుగా కలశస్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ భూపతి తదితరులు పాల్గొన్నారు. -
సూర్యప్రభ వాహనంపై కపిలేశ్వర స్వామి
-
శ్రీకపిలేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
-
వైభవంగా కపిలేశ్వరస్వామి తెప్పోత్సవాలు
సాక్షి, తిరుపతి కల్చరల్: శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయంలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న స్వామివారి తెప్పోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. చివరిరోజు సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు శ్రీచండికేశ్వరస్వామి, శ్రీచంద్రశేఖరస్వమి వారు తెప్పలను అధిరోహించి విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజు శ్రీవినాయకస్వామి, రెండవ రోజు శ్రీసుబ్రమణ్యస్వామి, మూడవ రోజు శ్రీసోమస్కందమూర్తి, నాల్గవ రోజు శ్రీకామాక్షి అమ్మవారు తెప్పలపై కొలువుతీరి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ముగింపు సందర్భంగా శ్రీచండికేశ్వరస్వామి, శ్రీచంద్రశేఖర స్వామి సర్వాంగ సుందర అలంకరణ ప్రియులై తెప్పలపై కొలువు తీరి పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగి భక్తులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సుమధుర భక్తి సంకీర్తనలను గానం చేసి భక్తులను అలరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఏఈవో శంకర్రాజు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం ఆరుద్ర దర్శన మహోత్సవంలో సందర్భంగా ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీనటరాజస్వామి, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీమాణిక్య వాసగ స్వామి ఉత్సవమూర్తులు పురవీధుల్లో ఘనంగా ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. -
నేడు కపిలేశ్వరస్వామి ఆలయంలో ధ్వజారోహణం
తిరుపతి: సప్తగిరులకు దిగువన వెలసిన కపిలేశ్వరస్వామి వారు సోమవారం ఉదయం హంసవాహనంపై ఊరేగనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి అంకురార్పణ నిర్వహించారు. సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం స్వామి వారికి హంస వాహన సేవ నిర్వహించనున్నారు. మార్చి 9వ తేదీ వరకు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రతిరోజూ ఉదయం, రాత్రి వాహన సేవలు జరుగుతాయి. -
వైభవంగా తెప్పోత్సవాలు ప్రారంభం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి తెప్పోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెప్పోత్సవాలను పురస్కరించుకుని ఆలయంతో పాటు స్వామివారి పుష్కరిణిని అరిటి, మామిడి తోరణాలు, పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. పుష్కరిణిలో తెప్పను రంగు రంగుల విద్యుత్ దీపాలతో పాటు పుష్పాలతో అలంకరించారు. మొదటి రోజు ఉదయం స్వామికి అభిషేకం నిర్వహించి పూజలు చేశారు. సాయంత్రం వినాయస్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆస్థాన మండపానికి తీసుకొచ్చి ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం కపిలతీర్థం పుష్కరిణిలోని తెప్పపైకి స్వామి అధిరోహించి విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పండితుల వేద మంత్రోచ్ఛారణ, మేళతాళాల నడుమ వినాయకస్వామి పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భక్తులకు కనువిందు కలిగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఆలయ సూపరింటెండెంట్ మునిసురేష్‌రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. కాగా తెప్పోత్సవాలలో భాగంగా పుష్కరిణిలో శనివారం సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు సుబ్రమణ్యస్వామి తెప్పపై విహరించనున్నారు.