కాపు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చిన్నారావు
అన్నవరం :
ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా అన్నవరానికి చెందిన లింగంపల్లి చిన్నారావు(బాబ్జీ)ను నియమిస్తూ ఫెడరేషన్ అధ్యక్షుడు గొర్రెపాటి అర్జునరావు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని చిన్నారావు ఆదివారం విలేకరులకు తెలిపారు. తనకు ఆ పదవి ఇవ్వడంపై ఆయన అధ్యక్షుడు అర్జునరావుకు, ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి శేషగిరికి కృతజ్ఞతలు తెలియచేశారు.