kargil martyr daughter
-
ఆ అమ్మాయి రాజకీయాలు మానేస్తే మంచిది
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ రాజకీయాలు మానేసి చదువుపై దృష్టిపెట్టాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెణ్ రిజిజు హితవు పలికారు. గుర్‌మోహర్ తీరుతో ఆమె తండ్రి, కార్గిల్ అమరవీరుడు మణ్‌దీప్ సింగ్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. దేశంలో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చని, కానీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడొద్దని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. గుర్మెహర్ ఇటీవల.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వ్యాఖ్యలను నెటిజెన్లు, కొందరు సెలబ్రిటీలు తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి స్పందించారు. గుర్మెహర్ ఫిర్యాదుపై కేసు నమోదు: తనను రేప్ చేసి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ గుర్మెహర్ చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏబీవీపీకి భయపడనని, తాను ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థినినంటూ పోస్ట్ చేసింది. ఆ తర్వాత ఏబీవీపీ నాయకులు తనను బెదిరించారని ఆమె ఆరోపించింది. -
సెహ్వాగ్ ట్వీట్ నా గుండెను బద్దలు చేసింది
న్యూఢిల్లీ: కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్మెహర్ కౌర్ ఆరోపణలు, విమర్శలతో నిత్యం వార్తల్లో ఉంటోంది. ఏబీవీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపిన కౌర్.. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్‌పై స్పందించింది. తనను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ తన గుండెను బద్దలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో గుర్మెహర్ చెప్పింది. సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూడగానే తనకు చాలా బాధ కలిగిందని, తన చిన్నతనం నుంచి ఆయనను చూస్తున్నానని, తనను ఉద్దేశిస్తూ ఎందుకు ఇలా ట్వీట్ చేశాడోనని చెప్పింది. గుర్మెహర్ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. గుర్మెహర్ ఇటీవల.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. వీరూ ఈ ట్వీట్ చేయగానే చాలా మంది నెటిజెన్లు స్పందించారు. కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గుర్మెహర్ సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్‌లు చేస్తోంది. తనను రేప్ చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు బెదిరించారని ఆరోపించింది. ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్ ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు -
ఆ అమ్మాయి మనసును కలుషితం చేస్తున్నారు
న్యూఢిల్లీ: బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి వ్యతిరేకంగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్ కౌర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు స్పందించారు. గుర్మెహర్ కౌర్ మనసును ఎవరు కలుషితం చేస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా కౌర్ ఏబీవీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. ఏబీవీపీని విమర్శించినందుకు కొందరు తనను రేప్ చేస్తామని హెచ్చరించారని ఆ తర్వాత ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గుర్మెహర్ మనసును ఎవరో కలుషితం చేస్తున్నారని అన్నారు. -
ట్విట్టర్ వార్‌కు తెరలేపిన సెహ్వాగ్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన విధ్వంసకర బ్యాటింగ్ శైలి తరహాలో.. ట్విట్టర్లోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఏ సందర్భం వచ్చినా వదలకుండా ట్వీట్లు బాదేస్తుంటాడు. ఆదివారం ట్విట్టర్ వేదికగా పుణె టెస్టులో టీమిండియా ఓటమిపై వ్యంగాస్త్రాలు విసిరిన వీరూ.. తాజాగా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్మెహర్ కౌర్ పోస్టింగ్‌కు రిప్లే ఇచ్చాడు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. లేడీ శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన గుర్మెహర్.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. అంతకుముందు తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక వార్తల్లోకి వచ్చింది. గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. వీరూ ఈ ట్వీట్ చేయగానే చాలా మంది నెటిజెన్లు స్పందించారు. వీరిలో సెలెబ్రిటీలు, రచయితలు ఉన్నారు. కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తానికి వీరూ చేసిన ట్వీట్ దుమారం రేపింది. నెటిజెన్ల మధ్య ట్విట్టర్ వార్‌కు తెరలేపింది. ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం! నన్ను రేప్ చేస్తామని బెదిరించారు -
నన్ను రేప్ చేస్తామని బెదిరించారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి ఆమెకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. అందులో భాగంగానే.. ఏకంగా ఆమెను రేప్ చేస్తామని కూడా కొంతమంది బెదిరించారు. ఈ విషయాన్ని స్వయంగా గుర్మెహర్ కౌర్ తెలిపారు. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో బుధవారం జరిగిన గొడవ తర్వాత.. తాను ఏబీవీపీకి భయపడనంటూ ఆమె ఒక లేఖ రాసి, ప్లకార్డుతో కూడిన ఫొటోను ఫేస్బుక్లో ఆమె అప్లోడ్ చేయడంతో, అది బాగా వైరల్ అయ్యింది. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్దీప్ సింగ్ కుమార్తె ఆమె. తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోయినా, ఆయన ధైర్యాన్ని పుణికి పుచ్చుకుంది. సోషల్ మీడియాలో తనకు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయని, తనను జాతి వ్యతిరేకిగా అందులో పలువురు తిడుతున్నారని ఆమె చెప్పారు. ఎవరైనా దాడి చేస్తామని, రేప్ చేస్తామని బెదిరిస్తే అది చాలా భయంకరంగా ఉంటుందని అన్నారు. రాహుల్ అనే వ్యక్తి తాను రాసిన కామెంటులో చాలా సుదీర్ఘమైన వివరణ ఇచ్చాడని, తనను ఎలా రేప్ చేయాలనుకుంటున్నాడో కూడా అందులో వివరించాడని, అది చూసి చాలా భయమేసిందని గుర్మెహర్ కౌర్ తెలిపారు. గత సంవత్సరం జేఎన్‌యూలో జరిగిన ఒక ర్యాలీలో జాతి వ్యతిరేక నినాదాలు చేసి, ప్రస్తుతం రాజద్రోహ నేరం ఎదుర్కొంటున్న ఉమర్ ఖలీద్‌ను రాంజాస్ కాలేజిలో జరిగిన ఒక సెమినార్‌కు ఆహ్వానించడంతో.. దాన్ని ఏబీవీపీ వ్యతిరేకించింది. ఈ సందర్భంగా మిగిలిన విద్యార్థులకు, ఏబీవీపీ వాళ్లకు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై స్పందించిన గుర్మెహర్, తన ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్‌ను కూడా మార్చారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఆమె అందులో చెప్పారు. తాను ఒంటరిని కానని, దేశంలో ప్రతి విద్యార్థి తన వెంట ఉన్నారని అన్నారు. దాంతో ఆమెను సమర్థించేవాళ్లు, వ్యతిరేకించేవాళ్లు కూడా భారీ స్థాయిలో ఫేస్బుక్లో కామెంట్లు పెట్టారు. ఏబీవీపీకి భయపడను: జవాన్ కూతురు 'నా తండ్రిని పాకిస్థాన్ చంపలేదు' రాంజాస్ కాలేజీలో రణరంగం!