నేటి నుంచి తిరుమలలో కారీ రిష్టియాగం
తిరుమల: నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో కారీ రిష్టియాగం జరగనుంది. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ పరిసరాల్లోని పార్వేట మండపం వద్ద ఐదురోజుల పాటు ఈ యాగం నిర్వహించబోతున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కారీ రిష్టియాగం జరగనుంది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సరైన వర్షాలు కురవాలని, దేశం సుఖశాంతులతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో యాగం నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
సోమవారం కూడ తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనానిని, సర్వదర్శన భక్తులకు 12గంటలు, కాలినడక భక్తులకు 10గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రొటోకాల్ ప్రకారమే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు.