karimnagar Mayor
-
స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్
సాక్షి, కరీంనగర్: ఉద్యమ నాయకుడు సర్దార్ రవీందర్‌సింగ్‌ను అదృష్టం వరించింది. స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ అరంగ్రేటం చేసిన రవీందర్‌సింగ్ మాస్‌లీడర్‌గా, న్యాయవాదిగా, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పట్టణ అధ్యక్షుడిగా, ఐదుసార్లు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడమే కాకుండా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా రవీందర్‌సింగ్‌ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేయడంతో అదృష్టమంటే రవీందర్సింగ్దే అంటూ చెప్పుకోవచ్చు. సాక్షాత్తు సీఎం కేసీఆర్ కరీంనగర్లో రవీందర్ సింగ్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కొద్దిసేపటిలోనే రాష్ట్రస్థాయి చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదిస్తూ నిర్ణయాలన్ని ఒకేరోజు కావడం అనూహ్యంగా జరిగాయి. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్ కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్‌ను రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జీవో ఆర్టీ 2313 నెంబర్ ద్వారా రవీందర్‌సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ జీవో విడుదల చేశారు. కరీంనగర్లో రవీందర్‌సింగ్ కూతురు వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులను ఆశీర్వదించారు. సీఎం వివాహ వేడుక నుంచి వెళ్లిపోయిన కొద్ది సేపటిలోనే ఉత్తర్వులు వెలువడడంతో రవీందర్‌సింగ్ కూతురి పెళ్లికి సీఎం గిఫ్ట్ ఇచ్చారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్టూడెంట్ లీడర్‌గా.. మాస్ లీడర్‌గా.. రవీందర్‌సింగ్ విద్యార్థి దశలోనే 1984లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలంటే మక్కువ. ఎల్ఎల్బీ పూర్తి చేసి న్యాయవాద వృత్తిని చేపట్టి కొద్ది కాలంలోనే రాజకీయ అరంగ్రేటం చేశారు. కరీంనగర్ మున్సిపాల్టీలో 1995లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించి కౌన్సిలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2001లో బీజేపీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికై ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2005లో జరిగిన ఎన్నికల్లో మరోసారి బీజేపీ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికవ్వడంతోపాటు బీజేపీ నగర అధ్యక్షుడిగా 2006 వరకు పనిచేశారు. 2006లో సీఎం కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. కేసీఆర్ పిలుపును అందుకొని బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఉంటూ టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చే పిలుపునందుకొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తూ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మారారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం కరీంనగర్ నగరంలో ఉధృతంగా నడిపించడంతో కేసీఆర్‌కు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. కరీంనగర్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదల కోసం తీవ్రంగా పనిచేయడంతో కేసీఆర్ అనేక సందర్భంలో రవీందర్ సింగ్‌ను ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న సర్దార్ రవీందర్ సింగ్‌కు ఎమ్మెల్సీ అవకాశం ఖాయమంటూ ఒక దశలో ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ అవకాశం అందినట్లే అంది అందకుండా పోయింది. రాష్ట్రస్థాయి పథకాలు అమలు.. టిఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా, మేయర్‌గా పనిచేసిన కాలంలో సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ నగరంలో ఒక్క రూపాయి మేయర్‌గా ప్రసిద్ధి పొందారు. ఒక్క రూపాయికే నల్లా కలెక్షన్ ఇవ్వడం, ఒక్క రూపాయికే అంత్యక్రియలు చేయడం, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. మేయర్‌గా ఉంటూనే కరీంనగర్ నగరంలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్, ప్రైవేట్ టీచర్, క్రీడా, కార్మిక సంఘాలకు, సంఘటిత, అసంఘటిత కార్మిక సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతూ మాస్ లీడర్‌గా, మేయర్‌గా మన్ననలు పొందారు. -
బాహాబాహీ: బీజేపీ కార్పొరేటర్లపై మేయర్ దూషణ
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం బుధవారం రసాభాసగా మారింది. బీజేపి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు బాహాబాహీకి దిగారు. నినాదాలు, ప్రతినినాదాలు వాగ్వివాదంతో సమావేశాన్ని గందరగోళంగా మార్చారు. మేయర్ సునీల్ రావు బీజేపీ కార్పొరేటర్లను యూజ్ లెస్ ఫెలో అని దూషించడం వివాదాస్పదంగా మారింది. మేయర్ అద్యక్షతన కౌన్సిల్ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రారంభం కాగానే బిజేపి కార్పొరేటర్లు ఎండిపోయిన హరితహారం మొక్కలను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. హరిత హారం అక్రమాలకు నిలయంగా మారిందని, లక్షలు వెచ్చించి నాటిన మొక్కలను ఎందుకు రక్షించడంలేదని పోడియం వద్దకు దూసుకెళ్లి మేయర్‌ను నిలదీశారు. చదవండి: వ్యాక్సిన్‌కు జై కొట్టిన తెలుగు ప్రజలు దీంతో మేయర్‌కు అండగా నిలుస్తూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు పోడియం వద్దకు వచ్చి బీజేపీ కార్పొరేటర్లతో వాగ్వివాదానికి దిగారు. నినాదాలు, ప్రతి నినాదాలతో ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో మేయర్ సహనం కోల్పోయి బీజేపి కార్పొరేటర్ జితేందర్‌ను ఉద్దేశించి యూజ్ లెస్ ఫెలో అని దూషించడంతో బీజేపీ కార్పోరేటర్లు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మేయర్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. మేయర్ తీరును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆధిపత్యం కోసం ఇరుపార్టీలు ప్రయత్నిస్తు ప్రజాసమస్యలను పక్కదారి పుట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత సమావేశంలో సైతం ఇలానే బీజేపీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ లు గొడవపడి సమావేశాన్ని రసాభాసగా మార్చారు. చదవండి: చచ్చినా ఇక్కడ నుంచి కదలను: భార్య గోడు -
స్పోర్ట్స్ సిటీగా కరీంనగర్
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ స్మార్ట్‌సిటీలో నగరం నడిబొడ్డున్న అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి రూ.18 కోట్లు కేటాయించినట్లు మేయర్ రవీందర్‌సింగ్ తెలిపారు. ఈ నిధులతో స్టేడియంను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధికి సంబంధించిన నమూన పోస్టర్‌ను ఆవిస్కరించారు. అనంతరం వివరాలను వెల్లడించారు. స్టేడియం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఉన్న మైదానలను తీసివేయకుండా వాటి రూపురేఖలు మారుస్తున్నట్లు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయడమే కాకుండా కొత్తగా సైక్లింగ్‌రింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్టేడియంకు ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు షాపింగ్ కాంప్లె„Šక్స్ నిర్మిస్తామన్నారు. ఖాళీ స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీతోపాటు స్పోర్ట్స్ సిటీగా, హెల్తీ సిటీగా మార్చడమే లక్ష్యమన్నారు. క్రీడారంగంలో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఎంతో కృషి చేశారని తెలిపారు. క్రీడలంటే అందరికీ హైదరాబాద్ గుర్తుకువస్తుందని, అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి తర్వాత అందరూ కరీంనర్‌వైపు చూస్తార పేర్కొన్నారు. స్మార్ట్ స్టేడియాన్ని కరీంనగర్ ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. ఏడాదిలోగా టెండర్ పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. స్టేడియం చుట్టూ ఉన్న రహదారులను సైతం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 11న స్మార్ట్ స్టేడియం పనులను జిల్లా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభిస్తారని వివరించారు. సమావేశంలో కార్పొరేటర్ ఎల్.రూప్సింగ్, ఇన్చార్జి డీవైఎస్వో నాగిరెడ్డి సిద్దారెడ్డి పాల్గొన్నారు. -
అవినీతిరహిత పాలనే లక్ష్యం
కరీంనగర్.. స్మార్ట్‌సిటీ హోదాకు కృషి - వీఎల్టీ టాక్స్‌తో ఆదాయం పెంపు - మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన సర్దార్ రవీందర్‌సింగ్ - నల్లా కనెక్షన్ ఫైలుపై తొలి సంతకం సాక్షి, కరీంనగర్: అవినీతిరహిత, పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని నగర పాలక సంస్థ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నల్లా కనెక్షన్ ఫైలుపై తొలిసంతకం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు రూ.200 డీడీ చెల్లించి.. నల్లా కోసం దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లోగా కనెక్షన్ ఇస్తామన్నారు. దసరాలోగా నగరానికి నిరంతరం తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. కార్పొరేషన్ ఆదాయం పెంచేందుకు నగరంలో రెండు గుంటల నుంచి ఎకరం వరకు ఖాళీ స్థలం ఉన్న వారి నుంచివీఎల్టీ టాక్స్ వసూలు చేస్తామన్నారు. నగరంలో ఎవరికి ఏ ఆపదొచ్చినా తనను, మున్సిపల్ కమిషనర్‌ను కలువొచ్చని చెప్పారు. కరీంనగర్‌కు స్మార్ట్‌సిటీ హోదాకు కృషి చేస్తాననిపేర్కొన్నారు. రోడ్లపై చెత్త వేస్తే చర్యలు ప్రతి డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని వివరించారు. నగరంలో వ్యాపారులకు ముప్పై రోజుల్లోగా చెత్త బుట్టలు పంపిణీ చేస్తామన్నారు. చెత్త రోడ్లపై వేస్తే చర్యలు తప్పవన్నారు. సమస్యలను సమష్టిగా పరిష్కరించుకుందామని కార్పొరేటర్లు, అధికారులను కోరా రు. డివిజన్లలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి కోసం అల్లాడుతున్న హౌసింగ్‌బోర్డు కాలనీలో అక్కడి ప్రజల మధ్యే శనివారం అధికారులతో కలిసి సమీక్ష చేస్తామన్నారు. రాజకీయ ఉద్యోగమిచ్చిన సీఎం కేసీఆర్‌కు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. మేయర్‌కు నగర కార్పొరేటర్లు.. అధికారులు శాలువా, పూలమాలలు వేసి అభినందన లు తెలిపారు. కాగా, అధికారులు మేయర్ చాంబర్లో కొత్త ఫర్నిచర్ వేశారు. నగర డెప్యూటీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన గుగ్గిళ్లపు రమేశ్ చాంబర్లో మాత్రం పాత కుర్చీలే ఉంచారు. దీంతో అసంతృప్తికి గురైన రమేశ్ వెంటనే కొత్త ఫర్నిచర్ తెప్పించుకున్నారు.