Karnataka Fans
-
కర్ణాటకలో మెగాస్టార్ క్రేజ్ చూశారా? బ్యాండ్ బాజాలతో ఫ్యాన్స్ రచ్చ, వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్లో అయితే ఆయన పేరు ఓ బ్రాండ్‌గా నిలిచిపోయింది. అనీర్వచమైన తన నటనతో ఎన్నో రికార్డులు కొల్లగోట్టారు చిరు. ఇక ఆయన సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరం తలపిస్తుంది. ఇక పండక్కి ఆయన సినిమా అంటే ఇక ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అలా థియేటర్లో సందడి చేసేందుకు ఈ సంక్రాంతికి(జనవరి 13న) వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. చదవండి: Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ రివ్యూ ఆయన 154వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్, కామెడీతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ల వద్ద మాస్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే చిరుకు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నేడు వాల్తేరు వీరయ్య రిలీజ్ సందర్భంగా కార్ణాటకలోని ఆయన అభిమానులు చేసిన హంగామా మామూలుగా లేదు. ఈ చిత్రంలోని చిరు 154 పోస్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. చదవండి: శృతి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఆయన 154 పోస్టర్లను 154 ఆటోలపై పెట్టి కర్ణాటక రోడ్లపై బ్యాండ్లు మోగిస్తూ.. డాన్స్ చేస్తూ జాతరగా భారీ ర్యాలీ నిర్వహించి చిరుపై అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతూ ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కాగా వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా.. మాస్ మహారాజా రవితేజ కీ రోల్ పోషించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. Karnataka Mega Fans Huge Rally with 154 Autos. #WaltairVeerayya #WaltairVeerayyaOnJan13th #Bangalore #karnatka #MegaStarChiranjeevi pic.twitter.com/d89mn7x7Pq — Pavanheartkiller (@Pavanheartkill1) January 12, 2023 -
జగన్‌కు జన స్వాగతం
=పెద్దవెలగటూరుకు తరలివచ్చిన కర్ణాటక అభిమానులు =వృద్ధులను ఆప్యాయంగా పలకరించిన జగన్ =అనంతపురం బయల్దేరి వెళ్లిన జననేత పెద్దపంజాణి, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అడుగడుగునా అభిమానులు నీరాజనాలందించారు. శనివారం వేకువజామునుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో పెద్దవెలగటూరుకు తరలివచ్చారు. జననేత జయరామిరెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాగానే జై జగన్, వైఎస్సార్ జిందాబాద్ అంటూ అభిమానుల నినాదాలతో ఆ గ్రామం దద్దరిల్లిపోయింది. కర్ణాటక రాష్ట్రం ఉగిని, హెబ్బిణి, బైరుకూరు, చిన్న నగవారం తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పెద్దవెలగటూరుకు చేరుకొని జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆనంతరం ఆయన అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అనంతపురం వెళుతున్న జగన్‌ను చూసేందుకు జనం నిరీక్షిం చారు. రాజుపల్లెకు చేరుకోగానే పాఠశాల విద్యార్థులు, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన అభిమానులు భారీగా రావడంతో ఆయన వాహనం నుంచి దిగి అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. జన నేత కోసం గంటల తరబడి వేచివున్న అభిమానులు ఆయన రాకతో కేరింతలు కొట్టారు. వారి అభిమానానికి పరవశించిపోయిన జగన్ కాన్వాయ్‌ను ఆపారు. రాజుపల్లె గ్రామస్తులు ఆయనకు పూల వర్షం కురిపించారు. రాజుపల్లెలో మాజీ ఎమ్మెల్యే, పలమనేరు నియోజకవర్గ కన్వీనర్ అమరనాథరెడ్డి కమ్మినాయనిపల్లెకు చెందిన భాను ప్రతాప్‌రెడ్డిని జగన్మోహన్రెడ్డికి పరిచయం చేశారు. అనంతరం చీమనపల్లె రోడ్డు పక్కన ఉన్న మహిళలను, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. ‘‘మీ చల్లని చూపే నాకు శ్రీరామ రక్ష’’ అంటూ వృద్ధుల వద్ద ఆశీర్వచనా లు తీసుకున్నారు. ఆయన తోపాటు జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణ స్వామి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు మిథున్‌రెడ్డితో పాటూ పలువురు ముఖ్య నేతలున్నారు.