Karolinska Institute
-
Nobel Prize 2024: జన్యు నియంత్రణ గుట్టువిప్పిన శాస్త్రవేత్తలకు వైద్య నోబెల్
స్టాక్‌హోం: అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాల సందడి మొదలైంది. 2024కు వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డును స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ మెడికల్ వర్సిటీ సోమవారం ప్రకటించింది. జన్యు నియంత్రణకు సంబంధించిన మౌలిక వ్యవస్థ అయిన మైక్రో ఆర్ఎన్ఏను కనిపెట్టిన అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లను నోబెల్ వరించింది. జన్యువులను, జీవక్రమాన్ని మైక్రో ఆర్ఎన్ఏ ఎలా ప్రభావితం చేస్తుంది, మొత్తంగా మనుషులతో పాటు ఇతర జీవజాలాన్ని ఎలా నియంత్రిస్తుందన్న అంశాలను వారి సంచలనాత్మక పరిశోధన లోతుగా పరిశోధించింది. జన్యు నియంత్రణకు సంబంధించి ఏకంగా సరికొత్త సూత్రాన్నే ఇది వెలుగులోకి తెచి్చందంటూ నోబెల్ కమిటీ ప్రశంసించింది. జీవుల ఎదుగుదల, పనితీరుకు సంబంధించిన మౌలికాంశాలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు వీలు కలి్పస్తుందని పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు క్యాన్సర్ చికిత్సలో కొత్త ద్వారాలను తెరిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు లండన్ ఇంపీరియల్ కాలేజీలో మాలిక్యులార్ అంకాలజీ లెక్చరర్ డాక్టర్ క్లెయిరీ ఫ్లెచర్ వెల్లడించారు. చర్మ క్యాన్సర్ చికిత్సలో వీటి పనితీరుపై ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్టు ఆమె తెలిపారు. ‘‘ఈ పరిశోధనల ద్వారా జన్యువుల ప్రవర్తనను నియంత్రించేందుకు కొత్త మార్గం తెరుచుకుంది. తద్వారా పలు రకాల వ్యాధుల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు కనిపెట్టడంతో పాటు చికిత్సకు కూడా వీలు కలుగుతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న థెరపీల్లో చాలావరకు కణజాలంలోని ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకున్నవే. అలాగాక మైక్రో ఆర్ఎన్ఏ స్థాయిలో జోక్యం చేసుకోగలిగితే జన్యువులను నేరుగా నియంత్రించవచ్చు. తద్వారా ప్రభావవంతమైన ఔషధాల అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి’’ అని వివరించారు. ఆంబ్రోస్ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్. రువ్కున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. బహుమతితో పాటు వారికి 10 లక్షల డాలర్ల నగదు పురస్కారం అందనుంది. నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 14 దాకా కొనసాగనుంది. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య నోబెల్ అవార్డులను ప్రకటిస్తారు. అక్టోబర్ 14న ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ప్రకటన ఉంటుంది. విజేతలకు డిసెంబర్ 10న పురస్కారాలను ప్రదానం చేస్తారు.ఏమిటీ మైక్రో ఆర్ఎన్ఏ? ఆంబ్రోస్, రువ్కున్ కనిపెట్టిన ఈ మైక్రో ఆర్ఎన్ఏను సూక్ష్మ జన్యుపదార్థ సమూహంగా చెప్పవచ్చు. కణజాల స్థాయిలో జన్యువుల పనితీరును నియంత్రించడంలో, మార్చడంలో దీనిది కీలక పాత్ర. ఒకవిధంగా ఇది కణజాల స్విచ్చుగా పని చేస్తుంది. కణాలన్నింట్లోనూ ఉండేది ఒకలాంటి క్రోమోజోములే. అయినప్పటికీ జీవుల్లో నరాలుగా, కండరాలుగా వేటికవే ప్రత్యేక లక్షణాలతో ఈ కణాలు అభివృద్ధి చెందుతాయి. జీవ వికాసానికి అత్యంత కీలకమైన ఈ తేడాలకు జన్యు నియంత్రణే కారకంగా నిలుస్తుంది. డీఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకు వెళ్లే జన్యు సమాచారం రూపంలో ఈ నియంత్రణ జరుగుతుందని ఆంబ్రోస్, రువ్కువ్ కనిపెట్టారు. ఈ సూక్ష్మ ఆర్ఎన్ఏ తాలూకు సంతులనంలో తేడాలే క్యాన్సర్ తదితర వ్యాధులకు కారణమని తేలింది. ‘‘కొన్ని కణాల్లో నిర్దిష్ట జన్యువు, లేదా జన్యువులు మరీ ఎక్కువగా పని చేయడమో, ఉత్పరివర్తనం చెందడమో వ్యాధిగా పరిణమిస్తుంది. సదరు జన్యు కార్యకలాపాన్ని మార్చగలిగే మైక్రో ఆర్ఎన్ఏను ఎంపిక చేసు కోవడం ద్వారా వ్యాధిగ్రస్త కణాల్లో ఉత్పరివర్తనాలను అరికట్టవచ్చు. మరోలా చెప్పాలంటే వ్యాధిని రూపుమాపవచ్చు’’ అని డాక్టర్ ఫ్లెచర్ వివరించారు. ఈ కోణంలో సూక్ష్మ ఆర్ఎన్ఏ ఉనికిని కనిపెట్టిన ఆంబ్రోస్, రువ్కున్ ఆవిష్కరణకు ఎనలేని ప్రాధాన్యముందన్నారు. -
కరోనా నుంచి కాపాడే ‘టీ సెల్స్’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ గురించి స్వీడన్‌లోని కరోలిన్స్కా పరిశోధనా కేంద్రం ఓ కొత్త విషయాన్ని కనుగొన్నది. ఇప్పటి వరకు అంచనా వేసిన సంఖ్య కన్నా మానవుల్లో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రెండింతల మందిలో ఉందని మానవుల్లోని టీ సెల్స్‌ను పరిశీలించడం ద్వారా పరిశోధనా కేంద్రం వైద్యులు తేల్చారు. టీ సెల్స్ అంటే మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే తెల్లరక్తం కణాలు. కరోనా వైరస్ బారిన పడిన రోగుల్లో ఆరోగ్యంగా ఉన్న 30 శాతం మందిలోని టీ సెల్స్ రోగ నిరోధక శక్తి పెరిగిందని, కరోనాను కట్టడి చేసేందుకు ఎంత శక్తి కావాలనేది ఇంకా స్పష్టం కావడం లేదని వారు తెలిపారు. ఆ 30 శాతం మందిలో కరోనా రోగ లక్షణాలు కూడా కనిపించలేదని వారు చెప్పారు. కరోనా బారిన పడిన వారిలో పిల్లలు ఎక్కువగా కోలుకోవడానికి కారణం టీ–సెల్స్‌యేనని, పిల్లల్లో అవి క్రియాశీలకంగా ఉంటాయని వైద్యులు చెప్పారు. (చదవండి : ఊపిరి ఆడటం లేదంటూ 50 ఆస్పత్రులు..) కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం యూరప్‌లో లాక్డౌన్ ప్రకటించని ఏకైక దేశం స్వీడన్. అయినప్పటికి గత వారం రోజుల్లో కరోనా బారిన పడి మరణించే వారి సంఖ్య పది శాతం తగ్గింది. స్వీడన్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 5,5,000లకు చేరుకోగా మృతుల సంఖ్య 43 వేలకు చేరుకుంది. -
ముగ్గురికి వైద్య నోబెల్
స్టాక్‌హోమ్: వైద్య రంగంలో 2019 సంవత్సరానికి గానూ ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటిష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన డాక్టర్ విలియమ్ జీ కెలీన్ జూనియర్(హార్వర్డ్ యూనివర్సిటీ), డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెన్జా(హాప్కిన్స్ యూనివర్సిటీ), బ్రిటన్‌కు చెందిన డాక్టర్ పీటర్ జే రాట్క్లిఫ్(ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్స్టిట్యూట్)లను ఈ పురస్కారానికి నోబెల్ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. ఈ ముగ్గురు ప్రైజ్‌మనీ అయిన 9.18 (రూ. 6.51 కోట్లు)లక్షల అమెరికన్ డాలర్లను సమంగా పంచుకుంటారు. శరీరంలోని కణాలు శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయో, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయో అనే విషయంపై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రక్తహీనత, కేన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధనలు ఉపయోగపడ్తాయని నోబెల్ కమిటీ పేర్కొంది. ‘వేర్వేరు ఆక్సిజన్ స్థాయిలకు జన్యువులు ఎలా ప్రతిస్పందిస్తాయనే విషయంలో, అలాగే, కొత్త ఎర్ర రక్త కణాలు, రక్త నాళాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చే విషయాల్లో వీరు చేసిన పరిశోధనలు ఆ శాస్త్ర విస్తృతికి ఎంతో దోహదపడ్డాయి’ అని కమిటీ ప్రశంసించింది. ఆక్సిజన్‌ను గ్రహించే విధానంలో మార్పు కలగజేసే ఔషధాల రూపకల్పన ద్వారా పలు వ్యాధులకు చికిత్స విధానాన్ని వీరు రూపొందించారు. ఈ అవార్డ్ ద్వారా తనకొచ్చిన డబ్బును ఎలా వినియోగించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే, ఒక మంచి పనికే ఆ డబ్బును వాడుతానని డాక్టర్ కెలీన్ తెలిపారు. ‘ఉదయం 5 గంటల సమయంలో సగం నిద్రలో ఉండగా ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఈ సమయంలో ఫోన్ వచ్చింది అంటే.. అది శుభవార్తే అయ్యుండొచ్చు అనుకున్నాను. నా గుండె వేగం పెరిగింది’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ పరిశోధన ప్రారంభించేముందు అవార్డుల గురించి ఆలోచించలేదు. కణాల్లో ఆక్సిజన్ స్థాయిలపై పరిశోధన అంత సులభం కాదు. పరిశోధన ఫలితాలపై కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు’ అని డాక్టర్ రాట్క్లిఫ్ స్పందించారు. 2018 సంవత్సరానికి గానూ అమెరికా సైంటిస్ట్ జేమ్స్ ఆలిసన్, జపాన్ శాస్త్రవేత్త తసుకు హోంజోలకు వైద్య శాస్త్ర నోబెల్ లభించింది. డైనమైట్ను రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్ఫ్రెడ్ నోబెల్ పేరున ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి రోజైన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. -
ప్రాణవాయువు గుట్టు విప్పినందుకు..
తిన్న ఆహారం శక్తిగా మారాలంటే మనిషితోపాటు అన్ని రకాల జంతువులకూ ఆక్సిజన్ అవసరం. సూక్ష్మస్థాయిలో కణాలూ ఆక్సిజన్ తగ్గిపోతే ఇబ్బంది పడతాయి. ఈ సూక్ష్మ కణాలు తమ పరిసరాల్లో ఆక్సిజన్ తక్కువగా ఉందని ఎలా గుర్తిస్తాయి? అందుకు తగ్గట్లుగా తమను తాము ఎలా మలచుకుంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కున్న శాస్త్రవేత్తలు కెలీన్, రాట్క్లిఫ్, సెమెన్జాలకు ఈ ఏడాది వైద్యనోబెల్ దక్కింది. కణస్థాయిలో ఆక్సిజన్ స్థాయికి తగ్గట్లుగా జన్యువులను ప్రేరేపించే ఓ కణ యంత్రాంగాన్ని వీరు గుర్తించారు. ఆక్సిజన్ మోతాదుల్లో వచ్చే తేడాలు జీవక్రియలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు, రక్తహీనత మొదలుకొని కేన్సర్ వరకూ అనేకవ్యాధులకు సరికొత్త, మెరుగైన చికిత్స కల్పించేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని స్వీడెన్లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ సోమవారం ప్రకటించింది. వాతావరణంలో 20 శాతం... భూ వాతావరణంలో 20 శాతం వరకూ ఉన్న ఆక్సిజన్ జీవక్రియల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. కణాల్లోని మైటోకాండ్రియా.. ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. ఎంజైమ్‌ల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుందని 1931 నోబెల్ గ్రహీత ఒట్టో వార్బర్గ్ గుర్తించారు. మెడకు ఇరువైపులా రెండు పెద్ద రక్తనాళాల పక్కనే ఉండే కరోటిడ్ బాడీలో... రక్తంలో ఆక్సిజన్ మోతాదును గుర్తించే ప్రత్యేక కణాలు ఉంటాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగాన్ని నియంత్రించేందుకు ఈ కరోటిడ్ బాడీలు మెదడుకు సంకేతాలు పంపుతాయని 1938 నో»ñ ల్ గ్రహీత కార్నైయిల్ హేమన్స్ గుర్తించారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు శరీరం చేపట్టే ఇంకో పని... ఎరిథ్రోపొయిటిన్ అనే హర్మోన్‌ను ఉత్పత్తి చేయడం. ఈ హార్మోన్ ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. అయితే ఈ ప్రక్రియను ఆక్సిజన్ ఎలా నియంత్రిస్తుందన్నది ఇటీవలి వరకూ తెలియదు. జన్యు ప్రహేళిక... ఈ ఏడాది నోబెల్ అవార్డుగ్రహీతలు సెమెన్జా, రాట్క్లిఫ్లు ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువుపై పరిశోధనలు చేశారు. ఈ జన్యువులో మార్పులు చేసిన ఎలుకలను ఉపయోగించినప్పుడు ఆక్సిజన్ కొరతకు ఈ జన్యువు స్పందిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఈ ఎరిథ్రోపొయిటిన్ కిడ్నీ కణాల్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కానీ శరీరంలోని దాదాపు అన్ని కణజాలాల్లోనూ ఎరిథ్రోపొయిటిన్ ఉత్పత్తిని నియంత్రించే జన్యువు ఉన్నట్లు స్పష్టమైంది. దీంతోపాటు అనేక ఇతర ప్రొటీన్లు, (హెచ్ఐఎఫ్–1, ఏఆర్ఎన్టీ), ఒక రకమైన కేన్సర్‌ను నిరోధించే హార్మోన్‌ను ఉత్పత్తి చేసే జన్యువు వీహెచ్ఎల్కు కూడా కణాల ఆక్సిజన్ నియంత్రణలో తమదైన పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీటన్నింటి మధ్య జరిగే చర్యలు ఆక్సిజన్ మోతాదుకు తగ్గట్లుగా కణాలు మార్పులు చేసుకునేందుకు కారణమవుతున్నట్లు తెలిసింది. వీటిల్లో కొన్ని పరిశోధనలను కెలీన్ వేరుగా చేశారు. ఏతావాతా... శరీరంలో ఆక్సిజన్ మోతాదు తక్కువగా ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 ప్రొటీన్ కణ కేంద్రకంలో ఎక్కువగా పోగుపడుతుంది. ఇక్కడ అది ఏఆర్ఎన్టీతో కలసి ఆక్సిజన్ లేమి, కొరతను నియంత్రించే జన్యువులకు అతుక్కుంటుంది. ఆక్సిజన్ సాధారణ స్థితిలో ఉన్నప్పుడు హెచ్ఐఎఫ్–1 వేగంగా నశిస్తూ టుంది. కొన్ని అణువులను జత చేయడం ద్వారా ఆక్సిజన్ దీనిని నియంత్రిస్తుంటుంది. ఎన్నో వ్యాధులకు హేతువు.. కణాలు ఆక్సిజన్ లేమి, కొరతలను గుర్తించకపోవడం రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. కిడ్నీ వైఫల్యం ఉన్న వారిలో ఎక్కువ మంది రక్తహీనతతోనూ బాధపడుతుంటారు. ఎరిథ్రోపొయిటిన్ హార్మోన్ జన్యువు సక్రమంగా పనిచేయకపోవడం దీనికి కారణం. ఆక్సిజన్ మోతాదులను గుర్తించే వ్యవస్థ కేన్సర్ విషయంలోనూ కీలకంగా ఉంటుంది. కేన్సర్ కణితుల్లో ఈ వ్యవస్థ జీవక్రియలను మార్చేందుకు, కొత్త రక్తనాళాల ఏర్పాటు, కేన్సర్ కణాలు శరీరంలో వేగంగా వ్యాప్తి చెందేందుకూ ఉపయోగపడుతూ ఉంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సాక్షులూ వాసనతో పట్టేస్తారు !
లండన్: జాగిలాల మాదిరే వాసన ఆధారంగా మనుషులు కూడా నేరస్తులను వారి శరీర వాసనతో గుర్తిస్తారని స్వీడన్‌లోని కారోలిన్స్కా ఇనిస్టిట్యూట్ అధ్యయనంలో తేలింది. శరీర వాసనతో మనుషుల మధ్య తేడాను గుర్తించవచ్చట. అధ్యయనంలో కొంతమందికి నేరం చేస్తున్న వారి వీడియోలను వారి వాసనలతో సహా చూపారు. తర్వాత కొన్ని వేరే వీడియోలనూ చూపించారు. సాక్షులు 70 శాతం కచ్చితత్వంతో ఐదుగురు భిన్న వాసనలున్న నేరగాళ్లను గుర్తించారు. 8 మంది నేరస్తులున్న ప్రయోగంలోనూ సాక్షులు వారిని గుర్తించారు.