Kartikam
-
కార్తీక శోభ
- సోమవారం పోటెత్తిన భక్తులు - శ్రీశైల ఆలయ పూజావేళల్లో మార్పులు - 1100పైగా సామూహిక ఆర్జిత అభిషేకాలు ·- నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు - క్యూలలో ఉచిత ప్రసాదవితరణ శ్రీశైలం: మొదటి కార్తీక సోమవారం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయం భక్తులతో పోటెత్తింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈఓ భరత్ గుప్త ఆలయ పూజా వేళల్లో మార్పులు చేశారు. వేకువ జామున 3గంటలకు మంగళవాయిద్యాలు, 3.15గంటలకు సుప్రభాతం, 4గంటలకు మహామంగళహారతి, 4.30గంటల నుంచి దర్శనాలు, ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు చేశారు. కార్తీకమాసంలోని శæని, ఆది, సోమవారాలు, పర్వదినాలు, ప్రభుత్వ సెలవు రోజులు..రద్దీ అధికంగా ఉండే ఆయా దినాలకనుగుణంగా పూజావేళలు ఈ విధంగా కొనసాగుతాయ తెలిపారు. కార్తీకమాసం ప్రారంభం రోజునే మొదటి సోమవారం కలిసి రావడంతో ఆదివారం సాయంత్రం నుంచి వేల సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. అభిషేక సేవాకర్తల కోసం ఆన్లైన్ టికెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే ఒక రోజు ముందస్తు అభిషేకం టికెట్లు, కరెంట్ బుకింగ్‌లో తీసుకున్న టికెట్లను పెంపుదల చేయడంతో సుమారు 1100 పైగా అభిషేకం టికెట్లను విక్రయించినట్లు ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి తెలిపారు. సేవాకర్తలకు జాప్యం లేకుండా స్వామివార్ల కల్యాణ మండపంతో పాటు అక్కమహాదేవి అలంకార మండపంలో కూడా సామూహిక అభిషేకాలను నిర్వహించారు. స్వామి దర్శనంలో అభిషేక సేవాకర్తలకు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేశారు. క్యూలైన్లలో అల్పాహారం .. కార్తీకమాసంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను ఉచిత, ప్రత్యేక దర్శన క్యూల ద్వారా దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం పులిహోర ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మొదటి కార్తీక సోమవారం ఈ కార్యక్రమాన్ని ఈఓ ఉచిత దర్శన క్యూ వద్ద ప్రారంభం చేశారు. అలాగే ఆయా రద్దీ రోజుల్లో అల్పాహారంతో పాటు పాలు, మజ్జిగ, మంచినీరు మొదలైనవి భక్తులకు క్యూలలో పంపిణీ అయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు ఈఓ తెలిపారు. నాగులకట్ట వద్ద అన్ని ఏర్పాట్లు కార్తీకమాసం సందర్భంగా భక్తులు కార్తీçకదీపాలను వెలిగించుకునేందుకు ఆలయప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ç అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈఓ భరత్ గుప్త సోమవారం తెలిపారు. భక్తులు వేకువజాము నుంచే సంప్రదాయబద్ధంగా కార్తీక దీపారాధనలను చేసుకుంటారని, అలాగే లక్షదీపాలను వెలిగించి శాస్త్రోక్త పూజలను, కార్తీక వ్రతం నోచుకుంటారని అన్నారు. ఆలయ ఉత్తర భాగం( శివాజీగోపురం)నుంచి దీపారాధన భక్తులకు ప్రత్యేక ప్రవేశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. -
కార్తీకం..శుభప్రదం
– రేపటి నుంచి కార్తీకమాసం – సోమవారంతో మొదలు - సోమవారమే వచ్చిన పౌర్ణమి, అమావాస్య // న కార్తీకసమో మాసో న కృతేన సమం యుగమ్/న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్// కార్తీకమాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరిౖయెన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తీకమాసంలో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు, విశేష ఫలప్రదములు. కార్తీకమాసం పాడ్యమి(31–10–2016) నుంచి పాడ్యమి(29–11–2016) వరకు నెలరోజులు అత్యంత విశేషమైనది. శివకేశవులకు ఈ నెల ప్రీతికర. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా ఈ కార్తీకమాసం అత్యంత అధిక ఫలదాయకమైనదని పురాణాల్లో చెప్పబడింది. ఈ సారి ప్రత్యేకం.. ఈ ఏడాది కార్తీకమాసం సోమవారంతో మొదలవడం విశేషం. అలాగే కార్తీకపౌర్ణమి, అమావాస్య కూడా సోమవారం రావడం చాలా అరుదు. ఇలాంటి అరుదుగా వచ్చే కార్తీక మాసం సహస్రాధికమైన ఫలాన్ని ఇస్తుందని మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం అత్యంత శక్తిదాయకమన్నారు. మహానంది క్షేత్రంలో గంగాదేవి(రుద్రగుండం కోనేరు), ఈశ్వరుడు ఇద్దరూ ఉన్నారని, యధాశక్తి దీపారాధన చేయడం ద్వారా అనంతమైన ఫలం లభిస్తుందని చెప్పారు. నియమాలివి.. కార్తీక సోమవారం పగలు అంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తూ ఆ రోజంతా భగవధ్యానంలో గడిపేవాళ్లు శివసాయుజ్యం పొందుతారని సూత ఉవాచ. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తభోజనం చేస్తారు. అయితే నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమి రోజు అయినా ఉన్నా ఎంతో పుణ్యం. కార్తీకమాసం అంతా తెల్లవారుఝామునే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. ఈ మాసంలో ఉదయం, సాయంత్ర వేళల్లో ఆవునేతితో లేదా నువ్వులనూనెతో దీపారాధన చేసి అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చనలు చేయడం వలన మహాపుణ్యం లభిస్తుంది. ఈ నెలలో ఎక్కడైతే మహావిష్ణువును పూజిస్తారో అక్కడ భూత, పిశాచ, గ్రహగణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడు పూలతో పూజిస్తే దీర్ఘాయులై మోక్షాన్ని పొందుతారు. వనభోజనం .. కార్తీకమాసంలో వనభోజనాలది ప్రత్యేకత. ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువు ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టు క్రింద సహపంక్తి భోజనాలు చేయాలి. గోమాతను పూజించాలి. తులసీదళాలతో శ్రీ మహావిష్ణువును కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసీ చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణుసహస్రనామ పారాయణం, కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం. గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసీకోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. -
నియమాల తోరణం
అలౌకికం మాసాలన్నింటిలోకి కార్తికం అత్యంత పవిత్రమైనది, ఆహ్లాదకరమైనదీ, హరిహరులకు, వారి తనయుడైన అయ్యప్పకు ప్రీతికరమైనది. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, దీక్షలు అనంతమైన ఫలాన్నిస్తాయి. అందుకే అయ్యప్ప దీక్ష తీసుకునేవారు సాధారణంగా కార్తికమాసంలోనే మాల ధారణ చేస్తుంటారు. ఈ మాసంలో మరో పన్నెండురోజులు మిగిలాయి. ఈ మిగిలున్న రోజుల్లోనైనా నియమనిష్ఠలతో గడుపుతూ, మనస్సునూ, శరీరాన్నీ పవిత్రంగా ఉంచుకోవడం ఆవశ్యకం. ఇష్టదైవాలను బట్టి, జీవనశైలిని బట్టి ఈ మాసంలో మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా అయ్యప్పమాల, భవానీమాల, శ్రీవెంకటేశ్వరమాల, సాయిమాల, గణపతి మాల, గోవిందమాల, శివమాల, హనుమద్దీక్ష... బహుళ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ అన్ని రకాల మాలధారణలు సక్రమమైన దినచర్య, నియమనిష్ఠలనే ప్రధానంగా సూచిస్తున్నాయి. దైవకృపకు పాత్రులవాలంటే పవిత్రత తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయి. రోజువారీ జీవితంలో పాటించడానికి అనువుగా ఉండని జీవనశైలిని ఈ దీక్షా కాలంలో అనుసరించ వలసి వుంటుంది. మానసిక బలహీనతలను దూరంచేసుకోవడానికి, మనసుపై నియంత్రణ సాధించడానికి ఈ దీక్షలు ఎంతగానో ఉపకరిస్తాయన్నది సత్యం. అదేవిధంగా ఇంచుమించు అన్ని రకాల దీక్షలూ కూడా మండల దీక్షలే కావడం గమనార్హం. ఎందుకంటే ఏదైనా కొత్త పనిని కనీసం 40 రోజుల పాటు దినచర్యలో భాగం చేసినప్పుడే అది అలవాటుగా మారుతుంది. అందుకే మండల దీక్షల పేరిట సంప్రదాయాన్ని విధించారు పెద్దలు. అదే ఈ నియ‘మాల’ రహస్యం. దీక్షల ద్వారా భక్తి, ఆధ్యాతిక భావనలతోబాటు ఆరోగ్యకర జీవనశైలి అలవడుతుండటం ప్రత్యక్ష ప్రయోజనాలు. అందుకోవడం, ఆచరించడం ఆధ్యాత్మికానందాలలో ఓలలాడటం ఆవశ్యకం. - కృష్ణ కార్తీక