karunanidhi win
-
ఊహించినదే.. నథింగ్ స్పెషల్: నితీశ్
పట్నా: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించినవే అని, ప్రత్యేకతేమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. కాగా తమిళనాడులో అన్నాడీఎంకే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, అసోంలో బీజేపీ, కేరళలో ఎల్డీఎఫ్ కూటమి, పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోనుంది. మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ...గెలుపు సారధిలుకు అభినందనలు తెలిపారు. యూపీలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలను సమాజ్వాదీ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. -
వరుసగా 13వ సారి ఆయన గెలిచారు
చెన్నై : చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైనా, ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మాత్రం భారీ మెజార్టీతో విజయం సాధించారు. తిరువరూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఏకంగా 13వ సారి 65వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటివరకూ కరుణానిధి ఇప్పటివరకూ పోటీ చేసిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది రికార్డు సృష్టించారు. కాగా అన్నాడీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. తమిళనాడు ప్రజలు మరోసారి జయలలితకు జై కొట్టారు. ఇక ఎగ్జిట్ పోల్స్ తలకిందులు కావటంతో డీఎంకే భంగపాటు పడింది. ప్రభుత్వ వ్యతిరేకతను డీఎంకే సొమ్ము చేసుకోలేకపోవడంతో రెండో స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. భారీగా ఉచిత వరాలు ప్రకటించినా, ప్రజలు మాత్రం 'కరుణ' చూపలేదు. అయితే చెన్నై నగరంలో మాత్రం మెజార్టీ స్థానాల్లో డీఎంకే ఆధిక్యం కొనసాగుతోంది.