వరుసగా 13వ సారి ఆయన గెలిచారు
చెన్నై : చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైనా, ఆ పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మాత్రం భారీ మెజార్టీతో విజయం సాధించారు. తిరువరూర్ నియోజకవర్గం నుంచి ఆయన ఏకంగా 13వ సారి 65వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటివరకూ కరుణానిధి ఇప్పటివరకూ పోటీ చేసిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొంది రికార్డు సృష్టించారు. కాగా అన్నాడీఎంకే ఆధిక్యంలో దూసుకుపోతోంది. తమిళనాడు ప్రజలు మరోసారి జయలలితకు జై కొట్టారు.
ఇక ఎగ్జిట్ పోల్స్ తలకిందులు కావటంతో డీఎంకే భంగపాటు పడింది. ప్రభుత్వ వ్యతిరేకతను డీఎంకే సొమ్ము చేసుకోలేకపోవడంతో రెండో స్థానంతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. భారీగా ఉచిత వరాలు ప్రకటించినా, ప్రజలు మాత్రం 'కరుణ' చూపలేదు. అయితే చెన్నై నగరంలో మాత్రం మెజార్టీ స్థానాల్లో డీఎంకే ఆధిక్యం కొనసాగుతోంది.