kasaiah
-
పోలీసులమంటూ వచ్చి చితకబాదారు
హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్‌లో శనివారం ఉదయం ఓ వ్యక్తిపై దాడి జరిగింది. కాశయ్య అనే వ్యక్తి ఇంట్లో ఉండగా పోలీసులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. కాశయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని సమీపంలోని మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. -
బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరి పరిస్థితి విషమం
గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ వద్ద సోమవారం మధ్యాహ్నం బైక్‌పైకి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నడిగడ్డ గ్రామానికి చెందిన పాలడుగు వెంకట సుబ్బారావు (47), పావుల కాశయ్య (35)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.