Katihar-Amritsar Amrapali Express
-
బిహార్లో పట్టాలు తప్పిన రైలు
-
బిహార్లో పట్టాలు తప్పిన రైలు
పట్నా: బిహార్లో రైలు ప్రమాదం జరిగింది. ఖగారియాలోని పస్రాహ స్టేసన్ సమీపంలో కటిహార్-అమృత్సర్ అమ్రపాలి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఏడు బోగీలు పక్కకు ఒరిగిపోయాయి. పట్టాలు తప్పిన వాటిలో ఐదు స్లీపర్, రెండు ఏసీ బోగీలున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. సహాయక బృందాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. ఈ మార్గంలో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.