katni district
-
అంబులెన్సులా మారిన బుల్డోజర్.. వీడియో వైరల్
భోపాల్: బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడ్ని మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కిందపడిన అతనికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. అయితే 30 నిమిషాలు గడిచినా అక్కడికి అంబులెన్స్ రాలేదు. యువకుడికి మాత్రం తీవ్ర రక్తస్రావమవుతోంది. దీంతో చలించిపోయిన ఓ వ్యక్తి.. అతడ్ని బుల్‌జోడర్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఈ ఘటన జరిగింది. రోడ్డుప్రమాదం తన షాపు ముందే జరిగిందని, యువకుడికి రక్తస్రావం కావడం చూసి బాధతో జేసీబీలో అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకున్నట్లు దాని యజమాని పుష్పేంద్ర తెలిపాడు. కాగా.. గాయపడిన యువకుడ్ని మహేశ్ బుర్మాగా గుర్తించారు. ఆస్పత్రికి తీసుకెళ్లాక వైద్యులు అతనికి వెంటనే చికిత్స అందించారు. అతని కాలికి ఫ్రాక్చర్ అయిందని గుర్తించి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి సిఫారసు చేశారు. అయితే యువకుడ్ని జేసీబీలో ఆస్పత్రికి తరలించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. साइकिल, ठेले, कंधे के बाद अब मरीज सीधे जेसीबी में! कटनी का मामला है लोगों का कहना है कि एंबुलेंस सेवा को कॉल किया था लेकिन मिली नहीं. @ndtv @ndtvindia pic.twitter.com/CfxRlNfXEM — Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2022 చదవండి: నా శాఖలో అందరూ దొంగలే.. బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్.. -
ధైర్యమిచ్చిన గౌరవం.. వన్డే కలెక్టర్
ధైర్యం అంటే ఎలా ఉండాలి? ధైర్యానికి ఉదాహరణ ఏంటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అమ్మాయిలకు చెప్పాలంటే అర్చన కెవాట్ను చూపించాలి. 21 ఏళ్ల అర్చన ధైర్యానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కాట్ని జిల్లా కలెక్టర్ అర్చనను ‘ఒకరోజు కలెక్టర్’గా నియమించి గౌరవించింది. ఆ ప్రభుత్వం 51,000 రూపాయలను కానుకగా ఇచ్చి, ఘనంగా సత్కరించింది. వేధింపులకు గురిచేస్తున్న అబ్బాయిల నుంచి ఇద్దరు మైనర్ బాలికలను రక్షించినందుకు గాను అర్చన కెవాట్కు దక్కిన అరుదైన గౌరవం ఇది. మార్చి 8, సోమవారం ఉదయం 21 ఏళ్ల అర్చన కెవాట్ కాట్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కారులో చేరుకుంది. కాటన్ సల్వార్ సూట్ ధరించిన అర్చన కెవాటన్ పేరును మీడియా ముందు ‘వన్డే కలెక్టర్’గా ప్రకటించారు. ఆమె అంతే ఆత్మవిశ్వాసంతో తనకు అందించిన గౌరవాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కూరగాయలు అమ్మే వ్యక్తి కూతురుగా తనను తాను పరిచయం చేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేముందు అర్చనకు జిల్లా కలెక్టర్ ప్రియాంక్ మిశ్రా, సిబ్బంది పూలతో స్వాగతం పలికారు. సమీక్షలు.. సమావేశాలు సోమవారం కావడంతో జిల్లా పరిపాలన, అభివృద్ధికి సంబంధించిన సమీక్షలు జరిపే సమావేశం. ఈ సమావేశానికి అర్చన అధ్యక్షత వహించింది. జిల్లాల్లో పోషకాహార లోపం ఉన్న పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మొదటి ప్రాధాన్యంగా అధికారులను ఆదేశించింది. తక్కువ బరువు, పోషకాహార లోపం ఉన్న పిల్లలను పునరావాస కేంద్రాలకు చేర్చాలని తెలిపింది. సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో చకా గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొంది. ఆ తర్వాత మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యింది. ఒంటి గంటప్పుడు బస్టాండ్ వద్ద ఉన్న ఆడిటోరియం చేరుకుని, సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 3 గంటలకు వన్‌స్టాప్ సెంటర్‌ను, సాయంత్రం 4 గంటలకు ఆడపిల్లల భద్రత గురించిన వివరాలను తెలుసుకుంది. పర్యటన, సమావేశాలు ఒకదాని తర్వాత ఒక కార్యక్రమాన్ని రోజంతా చేపడుతూనే ఉంది అర్చన. కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌కి.. ఎనిమిది మంది తోబుట్టువులున్న అర్చన తండ్రి చేసే కూరగాయల వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటోంది. కొద్దిరోజుల క్రితం మార్కెట్ వద్ద టీనేజ్ అమ్మాయిలను రౌడీలు వేధిస్తుండటం చూసిన అర్చన సమీపంలోని వ్యక్తుల సాయంతో వారిని కొట్టుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, పోలీసులకు అప్పజెప్పింది. అర్చన ఎలాంటి భయం లేకుండా దుండగులను చట్టానికి పట్టించిన తీరు స్థానిక ప్రజానీకానికే కాకుండా అధికారులను సైతం ఆకట్టుకుంది. ఆమె సాహసానికి నగదు పురస్కారాన్ని ఇవ్వడమే గాకుండా ఒకరోజు కలెక్టర్‌గా నియమించి ఆమె పట్ల తమ గౌరవాన్ని చాటారు. -
భార్యాపిల్లలను చంపి బీజేపీ నేత ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్ లో బీజేపీ నేత ఒకరు భార్యాపిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్ని జిల్లాలోని బొహ్రిబంద్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ పంపు నిర్వహిస్తున్న శశాంక్ తివారి(38) ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న శశాంక్ కుటుంబ సభ్యులను చూసి పోలీసులకు పనిమనిషి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. శశాంక్ భార్య మిని తివారి(30), కుమార్తె మాని(12), కొడుకు అభి(8) మృతదేహాలపై బుల్లెట్టు గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. రెండు పెంపుడు కుక్కలు కూడా చనిపోయి ఉండడాన్ని పోలీసులు కనుగొన్నారు. కుంగుబాటు, ఆర్థిక సమస్యలతో శశాంక్ తివారి ఈ కిరాతకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి పెట్రోల్ బంకును స్థానిక అధికారులు ఇటీవల మూసివేయడంతో ఆర్థిక సమస్యల్లో చిక్కున్నట్టు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బతికుండగానే పాతిపెట్టారు!
-
బతికుండగానే పాతిపెట్టారు!
భోపాల్: బతికున్న వ్యక్తిని రోడ్డు గుంతలో పూడ్చిపెట్టిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. గొయ్యిలో పడిపోయిన వ్యక్తిపై కంకర వేసి పాతిపెట్టారు. కాట్ని జిల్లాలోని ఉడ్లానా-హతా మార్గంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మృతుడు ఖాద్రా గ్రామానికి చెందిన లటోరి బర్మాన్(45)గా గుర్తించారు. తన భార్యతో కలిసి రిషి పంచమి వేడుకలకు బర్మాన్ అత్తగారింటికి వెళ్లాడు. భార్య పుట్టింట్లో ఉండిపోవడంతో అతడు స్వగ్రామానికి పయనం అయ్యాడు. మార్గమధ్యలో లిక్కర్ షాపులో మద్యం సేవించాడు. రాత్రివేళ నడుకుంటూ వెళుతున్న క్రమంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయని రోడ్డు గొయ్యిలో పడిపోయాడు. అపస్మారకస్థిలోకి వెళ్లిపోవడంతో పైకి లేవలేకపోయాడు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కార్మికులు నిర్లక్ష్యంగా వ్యవహరించి గుంతను పూడ్చివేశారు. గుంత నుంచి బర్మాన్ చేయి బయటపడడంతో ఈ దారుణ ఉదంతం వెలుగు చూసింది. మృతుడి బంధువులు తమ గ్రామస్తులతో కలిసి ఆందోళన చేపట్టారు. దీంతో మృతుడి కుటుంబానికి కలెక్టర్ రూ. 50 వేలు పరిహారం ప్రకటించారు. అయితే హెవీ మిషనరీతో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండడం వల్లె గొతిలో పడిన వ్యక్తిని గుర్తించలేకపోయారని విచారణాధికారి తెలిపారు.