kauvery River
-
Cauvery Row: కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం: సిద్దరామయ్య
బెంగుళూరు: తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాలంటూ కావేరీ జల నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. బుధవారం మాలె మహదేశ్వర హిల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య... తమవద్ద తగినంత నీరు లేదని జల నియంత్రణ కమిటీకి నివేదిక సమర్పించామని.. సెప్టెంబర్ 25 నాటికి కావేరీ బేసిన్‌లోని నాలుగు రిజర్వాయర్ల ఇన్‌ఫ్లో చాలా తక్కువగా ఉందని వాటి సామర్థ్యంలో 53.04 మాత్రమే ఉందన్నారు. ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో గత 123 ఏళ్లలో ఎన్నడు లేనంత తక్కువ వర్షపాతం నమోదైందని అన్నారు. 12000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ తమిళనాడు కావేరీ జల నియంత్రణ కమిటీని కోరగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 15 వరకు రోజుకు 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందిగా కమిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదైందని ఇప్పటికీ తాగునీటి సమస్య ఉన్నా వ్యవసాయానికి మాత్రమే నీటిని సమకూర్చ గలుగుతున్నామన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం మొత్తం 12000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరగా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే సరిపోతుందన్న సీడబ్ల్యుఆర్‌సీ ఆదేశాలపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంతృప్తిని వ్యక్తం చేసారు. ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఫార్ములా ఇదే.. -
మేకదాటు ఉద్రిక్తత
ముట్టడిని అడ్డుకున్న పోలీసులు 1500 మంది రైతుల అరెస్ట్ హొసూరు/కెలమంగలం : కావేరి నదిపై మేకదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ వల్ల తమ ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతారంటూ తమిళనాడుకు చెందిన రైతులు ఉద్యమించారు. రాష్ర్ట సరిహద్దులోని మేకదాటు ప్రాంతాన్ని ముట్టడించేందుకు రాజకీయాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, సంఘ సంస్థలు, రైతులు సుమారు రెండు వేలకు పైగా తరలి వచ్చారు. దీంతో శనివారం డెంకణీకోటలో ఉద్రిక్తత నెలకొంది. డెంకణీకోటకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేకదాటు వరకు రైతులు ర్యాలీగా వెళ్లి, కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన పనులను అడ్డుకోవాలని కావేరి హక్కుల విడుదల సమాఖ్య నిర్ణయించింది. ఈ మేరకు కావేరి నదీ పరివాహక ప్రాంతాలైన తిరుచ్చి, తిరువారూరు, తంజావూరు, నాగై, సేలం, క్రిష్ణగిరి, ధర్మపురి, నామక్కల్ తదితర జిల్లాల రైతులు శుక్రవారం రాత్రికి డెంకణీకోట, హొసూరుకు చేరుకున్నారు. శనివారం ఉదయం డెంకణీకోట పాతబస్టాండు నుంచి ర్యాలీ మొదలైంది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు పాడికట్టి దానిపై ఓ రైతును పడుకోబెట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ 50 మీటర్ల దూరం వెళ్లగానే భారీగా మొహరించిన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను, బ్యారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పరిస్థితి విషమిస్తుండడంతో చేతికి చిక్కిన 1500 మంది రైతులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ వారిని ఉంచేందుకు సరైన వసతి లేకపోవడంతో వెంటనే కల్యాణమంటపాలకు తీసుకెళ్లారు.