బెంగుళూరు: తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాలంటూ కావేరీ జల నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య.
బుధవారం మాలె మహదేశ్వర హిల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య... తమవద్ద తగినంత నీరు లేదని జల నియంత్రణ కమిటీకి నివేదిక సమర్పించామని.. సెప్టెంబర్ 25 నాటికి కావేరీ బేసిన్‌లోని నాలుగు రిజర్వాయర్ల ఇన్‌ఫ్లో చాలా తక్కువగా ఉందని వాటి సామర్థ్యంలో 53.04 మాత్రమే ఉందన్నారు. ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో గత 123 ఏళ్లలో ఎన్నడు లేనంత తక్కువ వర్షపాతం నమోదైందని అన్నారు.
12000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ తమిళనాడు కావేరీ జల నియంత్రణ కమిటీని కోరగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 15 వరకు రోజుకు 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందిగా కమిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదైందని ఇప్పటికీ తాగునీటి సమస్య ఉన్నా వ్యవసాయానికి మాత్రమే నీటిని సమకూర్చ గలుగుతున్నామన్నారు.
ఇదిలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం మొత్తం 12000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరగా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే సరిపోతుందన్న సీడబ్ల్యుఆర్‌సీ ఆదేశాలపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంతృప్తిని వ్యక్తం చేసారు.
ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఫార్ములా ఇదే..
Comments
Please login to add a commentAdd a comment