cauveri issue
-
Cauvery Row: కావేరీ జలాలపై సుప్రీం కోర్టులో సవాల్ చేస్తాం: సిద్దరామయ్య
బెంగుళూరు: తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయాలంటూ కావేరీ జల నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య. బుధవారం మాలె మహదేశ్వర హిల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య... తమవద్ద తగినంత నీరు లేదని జల నియంత్రణ కమిటీకి నివేదిక సమర్పించామని.. సెప్టెంబర్ 25 నాటికి కావేరీ బేసిన్‌లోని నాలుగు రిజర్వాయర్ల ఇన్‌ఫ్లో చాలా తక్కువగా ఉందని వాటి సామర్థ్యంలో 53.04 మాత్రమే ఉందన్నారు. ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో గత 123 ఏళ్లలో ఎన్నడు లేనంత తక్కువ వర్షపాతం నమోదైందని అన్నారు. 12000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలంటూ తమిళనాడు కావేరీ జల నియంత్రణ కమిటీని కోరగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 15 వరకు రోజుకు 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిందిగా కమిటీ కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా తక్కువ వర్షపాతం నమోదైందని ఇప్పటికీ తాగునీటి సమస్య ఉన్నా వ్యవసాయానికి మాత్రమే నీటిని సమకూర్చ గలుగుతున్నామన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం మొత్తం 12000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరగా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే సరిపోతుందన్న సీడబ్ల్యుఆర్‌సీ ఆదేశాలపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంతృప్తిని వ్యక్తం చేసారు. ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఫార్ములా ఇదే.. -
‘కర్ణాటక ప్రచారంలో మునిగిపోయారు’
సాక్షి, న్యూఢిల్లీ : కావేరీ జలాల పంపిణీపై సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అమలుచేయలేకపోతున్నామని కేంద్రం పేర్కొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు తలమునకలవడంతో ఈ అంశంలో జాప్యం జరుగుతోందని కోర్టుకు నివేదించింది. కాగా, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని తమిళనాడు ఆరోపించింది. పదిరోజుల సమయమిస్తే కావేరీ జలాల పంపిణీకి అనువైన పథకానికి రూపకల్పన చేస్తామని కేంద్రం తరపున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోరారు. దీనికి సంబంధించిన ముసాయిదాను క్యాబినెట్ ముందుంచారని, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి రావడం, అంతకుముందు ప్రధాని చైనా పర్యటనల నేపథ్యంలో జాప్యం జరుగుతోందని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం కన్విల్కార్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌కు నివేదించారు. కేంద్రం తీరుపై తమిళనాడు తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శేఖర్ నఫడే అభ్యంతరం వ్యక్తం చేశారు.కేంద్రం ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని..ప్రభుత్వం కర్ణాటకలో ఎన్నికల భవితవ్యంపై ఆందోళన చెందుతోందని అన్నారు. కర్ణాటక ఎన్నికలు మే 12న జరుగుతాయని, అప్పటివరకూ కావేరీ జలాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదని..ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇక నెలాఖరులోగా నాలుగు టీఎంసీల నీటిలో ఎంత మేర నీరు విడుదల చేస్తారో తెలపాలని కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కావేరీ జలాలను కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల మధ్య పంపిణీ చేసేందుకు తమ ఉత్తర్వుల అమలు కోసం ఓ పథకం రూపొందించాలన్న తమ తీర్పుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని సుప్రీం కేంద్రాన్ని కోరింది. కేంద్రం ఎలాంటి వ్యవస్థనూ ఏర్పాటు చేయకున్నా తమిళనాడుకు ప్రతినెలా కర్ణాటక కావేరీ జలాలను విడుదల చేయాలని కోర్టు స్పష్టం చేసింది. -
చెన్నైకు ఫ్యాన్స్ క్షమాపణలు
సాక్షి, హైదరాబాద్ : ఎంఏ చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల్లో కొందరు చెన్నై ఆటగాళ్లపై బూట్లు విసిరిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన చెన్నై ఫ్యాన్స్ ఆటగాళ్లకు క్షమాపణలు తెలిపారు. దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని అన్నారు. కావేరి నదీ జలాల యాజమాన్య బోర్డు ఏర్పాటు కోసం ఉధృతంగా ఆందోళనలు జరగుతున్న సమయంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించరాదంటూ ఆందోళనకారులు మొదటినుంచీ వ్యతిరేకత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే)-కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆందోళనకారులు మైదానంలోకి చెప్పులు విసిరారు. కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అప్పర్ టయర్ నుంచి మెయిన్ పెవిలియన్‌లోకి కొందరు వ్యక్తులు చెప్పులు విసిరారు. దీంతో మ్యాచ్‌లో ఆడని డుప్లెసిస్, బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా మైదానంలో పడిన చెప్పులకు బయటకు విసిరేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డుప్లెసిస్, జడేజాలను ట్విటర్లో ట్యాగ్ చేస్తూ.. ‘మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. స్టేడియంలో జరిగిన ఘటనకు చింతిస్తున్నాం. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాం. మా గురించి తప్పుగా భావించొద్దు. మీరంటే మాకు అమితమైన గౌరవం ఉంది.’ అంటూ పలువురు ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు. Cringing. So Sorry @faf1307 , @imjadeja , @ChennaiIPL . pic.twitter.com/mEgumYofYo — kasturi shankar (@KasthuriShankar) April 10, 2018 -
ఢిల్లీలో ఏఐడీఎంకే ఎంపీల ర్యాలీ
న్యూఢిల్లీ: కావేరీ నదీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన ఏఐడీఎంకేఎంపీలు విజ్ఞప్ఞి చేశారు. సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయం వరకు 50 మంది ఎంపీలు ర్యాలీగా చేరుకున్నారు. వీరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై నాయతత్వం వహించారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్నారని, వివాద పరిష్కారానికి తమను అమ్మ పంపిందని వారు పేర్కొన్నారు. వెంటనే వివాద పరిష్కారానికి కావేరీ జలాల బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. బోర్డు ఏర్పాటుకు బోర్డు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సైతం చెప్పన విషయాన్ని వారు గుర్తు చేశారు. -
కుదుటపడుతున్న బెంగళూరు
-
ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సిద్దరామయ్య
బెంగళూరు: కావేరీ జలాల వివాదం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కర్ణాటక సీఎం సిద్దరామయ్య భేటీకానున్నారు. మరోపక్క, కావేరీ జలాలపై వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోరారు. దీనిపై ఇప్పటి వరకు పీఎంవో స్పందించలేదు. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వస్తే సిద్ధరామయ్య వెళ్లనున్నారు. సెప్టెంబర్ 9నే ప్రధానికి లేఖ రాశామని, అయినా వారు జోక్యం చేసుకోలేదని కర్ణాటక అధికారి ఒకరు చెప్పారు. అల్లర్లకు ముందు కూడా పరిస్థితి సున్నితంగా ఉందని కూడా చెప్పామన్నారు. కావేరి జలాల విషయంలో తక్షణం పరిష్కారం చూపాలని కోరినట్లు వివరించారు. కాగా, కావేరి జలాల వివాదం విషయంలో ఎట్టకేలకు బెంగళూరులో పరిస్థితులు సర్దుమణుగుతున్నాయి. చాలా చోట్లు కర్ఫ్యూను సడలించారు. బెంగళూరులో దాదాపుగా అన్ని కార్యాలయాలు, కంపెనీలు తెరుచుకున్నాయి. రవాణా వ్యవస్థలన్నీ తిరిగి ప్రారంభమైనట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. పరిస్థితి సున్నితంగా ఉండటంతో సెక్యూరిటీని కొనసాగిస్తున్నామని చె్పారు. అల్లర్లలో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. పోలీసుల కాల్పుల్లో ఒకరు చనిపోగా లాఠీఛార్జీ భయంతో భవనంపై నుంచి దూకి మరొకరు చనిపోయారు. -
అంతా కళ్లప్పగించి చూశారే తప్ప..
ఢిల్లీ: కావేరి అల్లర్లపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఆస్తుల విధ్వంసం జరుగుతుంటే అందరూ కళ్లప్పగించి చూశారు తప్ప ఏ ఒక్కరు వాటిని నివారించేందుకు ప్రయత్నించలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ పిటిషనర్ అందులో పేర్కొన్నాడు. కావేరి జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య తీవ్ర విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 25 వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో శివకుమార్ అనే ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య ఘర్షణకు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అల్లర్ల సందర్భంగా జరిగే నష్టానికి ఎవరు పరిహారం చెల్లిస్తారని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.