సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసులపై అనుమానాలు
హైదరాబాద్: కేబీఆర్ పార్కు కాల్పుల ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసుల అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగిస్తున్నారు. గతంలో ఏకే-47 తుపాకీ కనిపించకుండాపోయిన కేసులో ఏడుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దుండగుడు వదిలేసిన ఆయుధం ఫిబ్రవరి 3న గ్రేహౌండ్స్ పోలీసుల నుంచి మిస్సైన తుపాకీగా గుర్తించారు. దీనిపై నార్సింగ్ పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదైందని పోలీసులు తెలిపారు.
మరోవైపు సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆగంతకుడు ట్రాక్ షూట్, తెలుగు రంగు టీషర్టు ధరించినట్టు పోలీసులు గుర్తించారు.