KBR partk
-
నెమలీక.. ఆనంద జ్ఞాపిక
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో సహజ సిద్ధంగా నేలపై రాలిపోయిన నెమలీకలను చిన్నారులు తీసుకోవడానికి అభ్యంతరం చెప్పవద్దని మంత్రి కేటీఆర్ పార్కు నిర్వాహకులకు సూచించారు. అయిదేళ్ల బాలుడి తల్లి చేసిన ట్వీట్‌కు స్పందించిన ఆయన ఈ సూచన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం తన అయిదేళ్ల కొడుకు వేదాంతతో కలిసి ఓ మహిళ కేబీఆర్ పార్కుకు వెళ్లారు. ఆ సమయంలో చిన్నారి వేదాంత నెమలీకలను సేకరించి వాటితో ఆడుకుంటూ సంబరపడసాగాడు. ఈ దృశ్యం ఆమెకు ఎంతో ఆనందాన్నిచి్చంది. కానీ.. ఆ నెమలీకలను చిన్నారి వెంట తీసుకెళ్లడానికి పార్కు నిర్వాహకులు అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆమె మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఈ రోజు తన కొడుకుతో పాటు చాలా మంది పిల్లలు నెమలీకలు సేకరించి వాటితో సంబరపడుతూ వెళ్తుంటే నిర్వాహకులు అడ్డుకున్నారు అని ఆమె కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కేటీఆర్.. పిల్లలు నెమలీకలను తీసుకోవడానికి పార్కు నిర్వాహకులు అనుమతి ఇవ్వాలని సూచించారు. చిన్నారుల ముఖంలో సంతోషం చూడాలన్నారు. ఆ తల్లి ట్వీట్ తనను కదిలించిందని పేర్కొన్నారు. (చదవండి: పాస్‌పార్ట్ కార్యాలయానికి గవర్నర్ తమిళ సై) -
కేబీఆర్ పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం
-
కేబీఆర్ పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం
Actress Shalu Chaurasia Attack: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో నటి చౌరసియాపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలగు పోలీసు బృందాలతో దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కేబీఆర్ పార్క్ చుట్టుపక్కలా సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. వీఐపీ జోన్లోనే దారి దోపిడీ జరగడంపై నగర సీపీ అంజనీ కుమార్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. కాగా ఆదివారం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన నటి చౌరాసియాపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లోని స్టార్‌బక్స్ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతం వద్ద దాడి చేసి ఆమె సెల్‌ఫోన్‌ను లాక్కుని పరారయ్యాడు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఆభరణాలు, సెల్‌ఫోన్ కోసమే దాడికి పాల్పడ్డాడా..లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. -
లవ్ యూ.. మామ్
ఆడవారికి అమ్మదనం కన్నా కమ్మదనం ఏముంటుంది..! బుజ్జాయిలకు అమ్మ కన్నా ఆత్మీయ నేస్తం ఎవరుంటారు !! ఈ రెండు అనుభూతులూ.. ఒకే ఫ్రేములో ఇదిగో ఇలా అందంగా ఒదిగిపోయాయి. విమెన్స్ డే సందర్భంగా పింక్‌థాన్ ఆధ్వర్యంలో ఆదివారం కేబీఆర్ పార్క్‌లో బేబీ వేర్ వాకింగ్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో చంటి పిల్లలను ఎత్తుకుని తల్లులు నడక సాగించారు. ఈ సందర్భంగా ఓ బుడతడు తన తల్లికి రోజా ఇస్తూ విమెన్స్ డే విషెస్ తెలియజేశాడు. - బంజారాహిల్స్