ప్రత్తిపాడు ఫొటోగ్రాఫర్‌కు కేసీపీ అవార్డు
ప్రత్తిపాడు :
కోనసీమ చిత్రకళా పరిషత్ (కేసీపీ) ఇటీవల నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో ప్రత్తిపాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ సలాది కృష్ణకు అవార్డు లభించింది. మోనోక్రోమ్ (బ్లాక్ అండ్ వైట్) విభాగంలో ‘గోయింగ్ టు ఫీల్డ్’ పేరిట తీసిన ఫొటోకు ఈ అవార్డు లభించిందని కృష్ణ సోమవారం విలేకరులకు తెలిపారు. ప్రదర్శన ముగింపు సందర్భంగా అమలాపురం మున్సిపల్ చైర్మ¯ŒS చిక్కాల గణేష్, అంతర్జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్, పరిషత్ అధ్యక్షుడు మెట్ల రమణబాబుల చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నాని చెప్పారు. కృష్ణను ఫొటోగ్రాఫర్ల సంఘ నాయకులు నామన వెంకట భాస్కర్, కొమ్ముల ఆనంద్, చవల శ్రీను, ధర్మవరం సంఘ నాయకులు గుత్తుల వీరరాఘవులు, పాలిక ఆంజనేయులు, అంబటి రాజు, దేవాడ బాబ్జీ తదితరులు అభినందించారు.