Kerala high court judge
-
హైకోర్టు జడ్జికే లంచం!
కొచ్చి: ఇందుగలడు అందులేడు ఎందెందు వెతికినా.. అన్నట్టుగా అవినీతి సర్వత్రా వ్యాపించింది. లంచాలు ఇవ్వడం, తీసుకోవడం సర్వసాధారణ విషయంగా మారింది. ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే లంచం ఇవ్వచూపారంటే ఈ జాడ్యం ఎంత ముదిరిపోయిందో అర్థమవుతోంది. స్మగ్లింగ్ కేసులో తనకు ముడుపులు ఇవ్వచూపారని కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కేటీ శంకరన్ వెల్లడించారు. తనకు అనుకూలంగా తీర్పు ఇస్తే రూ. 25 లక్షలు లంచం ఇస్తామని ఆశ చూపారని చెప్పారు. 500 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో ఇమ్మిగ్రేషన్ అధికారితో సహా నిందితులను గతేడాది అక్టోబర్ లో అరెస్ట్ చేశారు. ఈ కేసు నుంచి తమను బయటపడేసేందుకు అంగీకరిస్తే తీర్పుకు ముందు రూ. 25 లక్షలు, తర్వాత మరికొంత మొత్తం ముట్టచెబుతామని నిందితులు ఆశ పెట్టారని శంకరన్ తెలిపారు. దీంతో ఈ కేసు విచారణ నుంచి వైదొలిగానని చెప్పారు. 61 ఏళ్ల శంకరన్ కేరళ హైకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తుల్లో ఒకరు. 2005లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. -
నలుగురు భర్తలు ఎందుకు ఉండకూడదు?
‘ముస్లిం పర్సనల్ లా’ను మార్చాలన్న కేరళ జడ్జి కోజికోడ్: ‘ముస్లిం పురుషుడికి నలుగురు భార్యలు ఉండవచ్చని చెప్పినప్పుడు.. మహిళలకు ఎందుకు నలుగురు భర్తలు ఉండకూడదు?’ అంటూ కేరళ హైకోర్టు జడ్జి బి.కెమల్ పాషా కోజికోడ్‌లో ఆదివారం జరిగిన ముస్లిం మహిళా సమాఖ్య సభలో ప్రశ్నించారు. అర్థవంత జీవితం గడిపేందుకు పురుషుడికైనా, మహిళకైనా ఒక భాగస్వామి చాలన్నారు. క ట్నం, విడాకులు వంటి అంశాల్లో మహిళలపై ముస్లిం పర్సనల్ లా వివక్ష చూపుతుందని, ఖురాన్ చెపుతున్న దానికి అవి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని పరిష్కరించడంలో వివక్ష సృష్టించిన మతనేతలు భయపడకూడదని, పరిష్కారంలో జోక్యం చేసుకోవాలని అన్నారు. ముస్లిం మహిళలు విడాకులు పొందేందుకు ఖురాన్‌లోని ‘ఫసఖ్’ హక్కు కల్పిస్తున్నా... ‘లా’ ఆ హక్కు కల్పించడం లేదన్నారు. అన్ని న్యాయసూత్రాలు రాజ్యాంగంలోని సమానత్వం, గౌరవంగా జీవించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 14, 21కు లోబడి ఉండాల్సిందేనని తెలిపారు. ప్రస్తుత న్యాయం ఖురాన్‌కు అనుగుణంగా లేదని, పర్సనల్ లాలో మార్పులు రావాలన్నారు.