దారుణం: భార్యను పొడిచి, ఆపై కారుతో...
వాషింగ్టన్: కేరళకు చెందిన మెరిన్ (26)అనే యువతి అమెరికాలో మంగళవారం దారుణ హత్యకు గురయ్యింది. మెరిన్ ఒక హాస్పటల్లో నర్సుగా విధులు నిర్వర్తిస్తుంది. ఆమె మంగళవారం ఆసుపత్రిలో విధులు ముగించుకొని వెళుతుండగా ఆమె భర్త ఫిలిప్ మ్యాథ్యు (34) వెనుక నుంచి వచ్చి ఆమెను కత్తితో అనేకసార్లు పొడిచాడు. అంతే కాకుండా రోడ్డుపై పడిపోయిన ఆమె మీద నుంచి కారును పోనిచ్చాడు. మెరిన్ను ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే ఆమె చనిపోయింది.
నిందుతుడి కోసం పోలీసులు గాలించగా అప్పటికే అతను తనకు తాను గాయాలు చేసుకొని హాస్పటల్లో చేరాడు. మెరిన్, మాథ్యులకు ఒక పిల్లాడు ఉన్నాడు. స్థానికంగా వారు కేరళకు చెందిన వారు. బాబును కేరళలోనే వదిలేయాలని మ్యాథ్యు, మెరిన్తో గొడవపడ్డాడు. దీంతో ఆమె బాబును వదిలేసి భర్తతో కలిసి అమెరికాకు వెళ్లింది. అక్కడ కూడా వారిద్దరికి గొడవలు అయ్యాయి. తరువాత మెరిన్ 2018లో నర్సుగా ఆసుపత్రిలో చేరింది. కుటుంబ కలహాలు ముదరడంతో మ్యాథ్యు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: భార్యను హతమార్చి.. ఆత్మహత్యగా