kerosin
-
గుట్టపాడులో మహిళ ఆత్మహత్య
ఓర్వకల్లు: గుట్టపాడు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మాబులాల్ భార్య జిలానిబేగం (32) శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందింది. మృతురాలికి సోయల్, సోయబ్ ఇద్దరు సంతానం. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. దర్యాప్తులో ఆత్మహత్యకు కారణాలు వెల్లడికావాల్సి ఉందన్నారు. -
భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
ఎంజీఎంలో చికిత్స పొందుతున్నబాధితురాలు చెన్నారావుపేట : భార్యపై కిరోసిన్ పోసి భర్త నిప్పంటించిన సంఘటన మండలంలోని ఉప్పరపల్లిలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కడబోయిన సదయ్య కుమార్తె సరితను పదేళ్లక్రితం ఉప్పరపల్లికి చెందిన కుక్కల రాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జ న్మించారు. కుటుంబ తగాదాలతో సోమవారం రాత్రి భార్య సరితపై రాజు కిరోసిన్‌పోసి నిప్పం టించాడు. ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఎంజీ ఎంకు తరలించారు. బాధిత మహిళ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్ తెలిపారు.