గుట్టపాడులో మహిళ ఆత్మహత్య | woman suicide in guttapadu | Sakshi
Sakshi News home page

గుట్టపాడులో మహిళ ఆత్మహత్య

Published Mon, Mar 13 2017 12:41 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

woman suicide in guttapadu

ఓర్వకల్లు: గుట్టపాడు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మాబులాల్‌ భార్య జిలానిబేగం (32) శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో శరీరంపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందింది. మృతురాలికి సోయల్, సోయబ్‌ ఇద్దరు సంతానం. మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. దర్యాప్తులో ఆత్మహత్యకు కారణాలు వెల్లడికావాల్సి ఉందన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement