Keshubhai patel
-
కేశూభాయ్ పటేల్ కన్నుమూత
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అత్యంత సీనియర్ నేత కేశూభాయ్ పటేల్(92) కన్ను మూశారు. కోవిడ్–19 బారిన పడి ఇటీవలే కోలుకున్న పటేల్ గురువారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గుజరాత్లో బీజేపీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించిన కేశూభాయ్ 1995, 1998–2001 సంవత్సరాల్లో రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఆయన తర్వాత గుజరాత్లో నాడు సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టారు. కేశూభాయ్ మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్య క్రియలు జరుగుతాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ తన తండ్రి ఆరోగ్యం కొంతకాలంగా క్షీణిస్తోందని కేశూభాయ్ కుమారుడు భరత్ పటేల్ తెలిపారు. గురువారం ఉదయం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోవడంతో ఆస్పత్రికి తరలించామన్నా రు. కేశూభాయ్ గుండెపోటుతో చనిపో యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర పర్యటనలో ఉన్న రూపానీ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గాంధీనగర్ చేరుకుని స్వగృహంలో ఉంచిన కేశూభాయ్ మృతదేహానికి నివాళుల ర్పించారు. జునాగఢ్ జిల్లా విసవదార్ పట్టణంలో 1928లో జన్మించిన కేశూభాయ్ 1945లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రచారక్‌గా చేరారు. జన్‌సంఘ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్ర శాసనసభకు ఆయన 6 పర్యాయాలు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీ నుంచి వైదొలిగి గుజరాత్ పరివర్తన్ పేరిట పార్టీని స్థాపించారు. 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. -
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
గాంధీనగర్ : గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం పటేల్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించటంతో 92 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. జులై 24, 1928లో జునాగద్ జిల్లాలోని విశవదార్ పట్టణంలో పటేల్ జన్మించారు. 1945లో ఆర్ఎస్ఎస్లో ప్రచారకునిగా చేరారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు సైతం వెళ్లారు. 1960లో జనసంఘ్‌లో కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1977లో రాజ్‌కోట్ నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం తన పదవికి రాజీనామా చేసి బాబుభాయ పటేల్ ‘జనతా మోర్చ్’ ప్రభుత్వంలో చేరారు. 1978నుంచి 1980వరకు వ్యవసాయ మంత్రిగా సేవలందించారు. 1995లో మొట్టమొదటి సారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల 7 నెలలకే తన పదవికి రాజీనామా చేశారు. 1998 మార్చి నెలలో మరోసారి సీఎం పదవిని చేపట్టారు. అనారోగ్య కారణాల దృష్ట్యా మరోసారి 2001లో పదవికి రాజీనామా చేశారు. అనారోగ్యం వల్ల గత కొన్ని సంవత్సరాలనుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత నెలలో ఆయన కరోనా వైరస్ బారిన పడికోలుకున్నారు. -
కరోనా బారిన పడిన మాజీ ముఖ్యమంత్రి
అహ్మదాబాద్ : గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. శుక్రవారం ఆయనకు రాపిడ్ యాంటీజెన్ పరీక్ష చేయించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో పూర్తి స్థాయి పరీక్షల కోసం ఆయన సీటీ స్కాన్ చేయించడంతో పాటుగా, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల కోసం శాంపిల్స్ పంపించినట్టు గాంధీనగర్ సివిల్ హాస్పిటల్ పూపరింటెండెంట్ డాక్టర్ తెలిపారు. (గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు) 92 ఏళ్ల పటేల్‌కు ఇంతకు ముందు బైపాస్ సర్జరీ జరిగిందని, అలాగే ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఆయన తనయుడు భరత్ తెలిపారు. ఇది తమకు ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి కారోనా లక్షణాలు లేవని వెల్లడించారు. ఇటీవల కేశుభాయ్ పటేల్ వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. వారి నుంచే ఆయనకు కరోనా వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. (కరోనా ఎఫెక్ట్: 60 లక్షల ఉద్యోగులకు ఉద్వాసన) -
ఇక అన్యమతస్థులను నేరుగా అనుమతించరు!
-
ఇక అన్యమతస్థులను నేరుగా అనుమతించరు!
అహ్మదాబాద్: సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్రస్టీగా కొనసాగుతున్న భారత పశ్చిమ కోస్తా తీరంలోవున్న చారిత్రక సోమనాథ్ మహాదేవ్ ఆలయంలోనికి ఇక హిందూయేతర మతస్థులను నేరుగా అనుమతించరు. దేశంలోని 12 ఆది జ్యోతిర్లింగాల్లో మొదటి లింగేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని ఇతర మతస్థులు సందర్శించాలంటే ముందుగా ఆలయం జనరల్ మేనేజర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆలయం ప్రవేశ ద్వారం వద్ద శ్రీ సోమ్‌నాథ్ ట్రస్టు బోర్డు పేరిట ఓ నోటీసు ప్రత్యక్షమైంది. మోదీ ట్రస్టీగా ఉన్న ఈ ఆలయం ట్రస్టీ చైర్మన్‌గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేషూభాయ్ పటేల్ కొనసాగుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందుత్వ శక్తుల ఒత్తిడి మేరకు హిందూ ఆలయాల్లో ఇలాంటి ఆంక్షలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పూరి జగన్నాథ ఆలయాన్ని ఇతర మతస్థుల సందర్శనపై ఆంక్షలున్నప్పుడు సోమ్‌నాథ్ ఆలయంలో ఆంక్షలు ఉంటే తప్పేమిటని ఆలయం జనరల్ మేనేజర్ విజయ్‌సింహ్ చావడా వాదిస్తున్నారు. బీజేపీ అలనాటి అగ్రనేత ఎల్కే అద్వానీ 1991లో ఈ ఆలయం నుంచే ఆయోధ్య రథయాత్రను ప్రారంభించారు. అది బాబ్రీ మసీదు విధ్వంసానికి, దేశంలో మత కల్లోలాకు దారితీసిన విషయం తెల్సిందే. మొహమ్మద్ ఘజనీ సోమ్‌నాథ్ ఆలయంపై 17 సార్లు దండయాత్ర జరిపినట్లు చారిత్రక ఆధారాలున్న నేపథ్యంలో అద్వానీ తన రథయాత్ర ఆందోళనకు ఈ ఆలయాన్ని ఎంపిక చేసుకున్నారు.