ketireddy venkataramireddy
-
ధర్మవరంలో దుమ్ములేపుతున్న కేతిరెడ్డి ప్రచారం
-
'బాబూ శవరాజకీయాలు మానుకో'
సాక్షి, ధర్మవరం(అనంతపురం) : చంద్రబాబు పరిపాలన చేసిన 5 సంవత్సరాల వ్యవధిలో జిల్లాలో 130 మంది రైతులు, 75 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఏనాడూ వారిని పరామర్శించేందుకు రాని వ్యక్తి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య స్థలవివాదంలో జరిగిన గొడవ కారణంగా ఒక వ్యక్తి మృతి చెందితే శవరాజకీయాలు చేసేందుకు వచ్చాడని చంద్రబాబుపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాడిపత్రి , ధర్మవరంలో జరిగిన సంఘటనలు చంద్రబాబు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో జరిగిన సంఘటనలేనని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు హయాంలో పార్టీల వారీగా ప్రజలను విభజించి విభేదాలను రగిల్చాడని, ఇప్పుడు ఆ నింద తమపై వేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు సొంత జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కారణంగా 21 మంది మృతి చెందారని, అంతెందుకు తాడిపత్రిలో మట్కాబీటర్లను అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీఐని చితకబాదిన సంఘటన, ఆశ్రమ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటనలు ఎవరి హయాంలో జరిగాయో జిల్లా ప్రజలు ఇంకా మరువలేదన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులు చేసిన పాపాల కారణంగా మీకు ప్రజలు బాగా బుద్ధిచెప్పారనడానికి వారికి వచ్చిన 23 సీట్లే నిదర్శనమన్నారు. హిట్‌లిస్ట్‌లు అనౌన్స్ చేసి హతమార్చారు పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇన్చార్జ్ బాధ్యతల విషయమై కేతిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆర్ఓసీ సంస్థ స్థాపన వెనుక ఎవరున్నారో ? ఆ సంస్థ చేసిన హత్యల వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారికి హిట్‌లిస్ట్‌లు ప్రకటించి మరీ హత్యలు చేసిన మాట వాస్తం కాదా ? అని ప్రశ్నించారు. తాము 25 ఏళ్లుగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నామని, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ధర్మవరానికి ఎవరు వచ్చినా తమకు అభ్యంతరం లేదని, ధర్మవరం నియోజకవర్గంలో పరిటాల హయాంలో జరిగిన హత్యలకు క్షమాపన చెప్పి మరీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టాన్నారు. అక్కడలా ఇక్కడ వారి హడావుడి వ్యవహారాలు చెల్లబోవని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. -
చేనేతల బతుకులతో ఆటలా?
సాక్షి, ధర్మవరం: మీ రాజకీయ ప్రయోజనాల కోసం చేనేతల బతుకులతో ఆడుకుంటారా? అంటూ టీడీపీ నాయకులపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో చేనేత కార్మికుడు చంద్రశేఖర్ మృతిచెందాడని ఎల్లో మీడియాలో అసత్య కథనాన్ని ప్రచురించడాన్ని ఆయన తప్పు పట్టారు. సోమవారం ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నాయకుల చిల్లర రాజకీయాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతూ ఎదుటివారిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సంబంధం లేని వ్యవహారాలను వైఎస్సార్సీపీకి అంటగట్టి ప్రయోజనం పొందాలని చూడడం పరిపాటిగా మారిందన్నారు. విధ్వంసాలు, కుట్రలు చేస్తూ పుకార్లు పుట్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పొంతనలేని వివరాలు పనిలోకి రాలేదని తన తండ్రి చంద్రశేఖర్‌ను కొట్టారని కొడుకు సుబ్రమణ్యం మార్చి 30న ధర్మవరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని, అయితే ప్రభుత్వాసుపత్రిలో 29వ తేదీన చికిత్స కోసం చేరినట్లు రికార్డులు ఉన్నాయని కేతిరెడ్డి ఆధారాలతో చూపారు. 29న ఆస్పత్రిలో చేరి పరిస్థితి విషమంగా ఉంటే మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. అలాగే జరిగి ఉంటే ఎమ్మెల్సీని అక్కడి పోలీసులు ఇక్కడి వారికి ఎందుకు సమాచారం ఇవ్వలేదు.. పరిస్థితి విషమంగా ఉంటే వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అదీ కాక సంఘటన జరిగిన రోజు కేసు నమోదు చేయకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేశారని నిలదీశారు. సదరు చేనేత కార్మికుడు ఈ నెల ఐదో తేదీన చనిపోయాడని, అతడి తొడభాగంలో చికిత్స చేయడం వల్ల కార్డియాక్ ఫ్రాక్షన్ జరిగిందని వైద్యులు నివేదికలో పొందుపరిచారన్నారు. అందుకే పోలీసులు కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే.. రాజకీయంగా లబ్ధి పొందేందుకు, వైఎస్సార్సీపీపై బురదజల్లేందుకు ఇలా తప్పుడు కథనాలు రాయిస్తున్నారని టీడీపీ నేతలపై కేతిరెడ్డి మండిపడ్డారు. నష్టం ఎవరికి జరిగినా తాము ఉపేక్షించబోమన్నారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారాన్ని తమకు ఆపాదించి లబ్ధి పొందాలని చూస్తే చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ధర్మవరం పట్టణంలో 65 మంది చేనేత కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడితే పట్టించుకోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చేనేత కార్మికులను పావుగా వాడుకోవాలని చూస్తున్నారన్నారు. ఎవరు ఎలాంటి వారో.. నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని, ఈ కేసును సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించి, అలసత్వం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో చేనేత నాయకలు గిర్రాజు నగేష్, గిర్రాజు రవి, దాసరి లక్ష్మినారాయణ, బండారు ఆదినారాయణ, ఉడుముల రాము, బీవీఆర్ శ్రీనివాసులు, గడ్డం శ్రీనివాసులు, జయశ్రీ, సిద్ది రాజేష్, గుర్రం రాజు, మేకల కిష్ట, సందా రాఘవ, కలిమిశెట్టి మురళి, డీఎల్ నాగభూషణ, కేతా గోపాల్, గడ్డం రాజ, కాచర్ల అంజి, పాలబావి శీనా పాల్గొన్నారు. -
బాబును ఓడించడానికి ప్రజలి కిసిగా ఎదురు చూస్తున్నరు
-
చేనేతల ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలే
టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేనేతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ధ్వజం ధర్మవరంటౌన్ : రాష్ట్రంలో జరుగుతున్న చేనేతల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని నివాసంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ముడిపట్టు ధరలు మూడింతలు పెరిగిపోయి చేనేతలు అల్లాడి పోతుంటే ఏడాదిన్నర పాటు రాయితీ బిల్లులు పెండింగ్ పెట్టి దొంగనాటకం ఆడుతోందని దుయ్యబట్టారు. పట్టుచీరలకు మద్దతు ధర లేక, విపరీతంగా పెరిగిన ముడి సరుకు ధరల కారణంగా నష్టాలపాలై నేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఇటీవల చంద్ర అనే చేనేత కార్మికుడు అప్పుల బాధతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ఈ రెండున్నరేళ్లలో ఒక్క కార్మికుడికైనా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుద్వారా గానీ, వ్యక్తిగత రుణాలను గానీ అందించారా అని ప్రశ్నించారు. చేనేతల ఆత్మగౌరవం దెబ్బతీసే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నెలకొందన్నారు. గతంలో చేనేతలకు లాంబార్డ్ ఇన్సూరెన్స్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.15 వేల వరకు నగదు రహిత ప్రైవేట్ వైద్యం అందించే వీలు ఉండేదని గుర్తు చేశారు. ఆ పథకాన్ని ప్రస్తుత పాలకులు అటకెక్కించారన్నారు. ప్రభుత్వానికి చేనేతల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే గతంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న చేనేతల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ పరిహారం అందించాలన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదుకు ప్రజాదరణ లేకపోవడంతో రేషన్ డీలర్లు, జన్మభూమి కమిటీ సభ్యులకు టార్గెట్లు ఇచ్చి.. ప్రజల నుంచి బలవంతంగా రూ.100 చొప్పున కట్టించుకుని సభ్యత్వం ఇస్తున్నారన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకోకపోతే రేషన్‌కార్డులు, పింఛన్ రద్దు చేస్తామని టీడీపీ నాయకులు బెదిరించడం సరికాదన్నారు.