రేసిజం ఎఫెక్ట్..వరల్డ్ ఫేమస్ టిక్ టాకర్‌కు షాక్
వరల్డ్ వైడ్‌గా 115 మిలియన్ల మంది టిక్ టాక్ ఫాలోవర్స్‌తో సెకండ్ మోస్ట్ పాపులర్ క్రియేటర్‌గా ఉన్న 21 ఏళ్ల ఖాబీ లేమ్ వివాదంలో చిక్కుకున్నారు. ఫేస్బుక్, టెస్లా వంటి దిగ్గజ సంస్థలే జాత్యహంకార వ్యాఖ్యల వివాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ తరుణంలో ఖాబీలేమ్ సే టూ నో రేసిజం అంటూ చేసిన పోస్ట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిక్కుల్లో వరల్డ్ ఫేమస్ క్రియేటర్
ఖాబీ లేమ్ ఆఫ్రికన్ కంట్రీస్లోని సెనెగలీస్లో పుట్టాడు. పెరిగింది మాత్రం ఇటలీలోని చివాస్సో. చదువుతోంది గ్రాడ్యుయేషన్. ఏడాది క్రితం వరకు ఇతను ఒక మామూలు వ్యక్తి. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఖాబీలేమ్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. మాట్లాడకుండా చిత్ర విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో టిక్‌టాక్ వీడియోలు చేసేవాడు. ఆ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో దశ తిరిగి అనతి కాలంలోనే 115 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఫాలోవర్స్‌తో పాటు స్పాన్సర్ల రూపంలో ఇబ్బడి ముబ్బడి డబ్బు వచ్చి పడుతుంది.
ఇప్పుడు ఇటలీలో ఉంటూ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ భారీగా అర్జిస్తున్నాడు. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో ఆయన చేసిన పోస్ట్‌పై మండిపడుతున్నారు. సే టూ నో రేసిజం పేరుతో చేసిన ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్ వివాదంలో చిక్కుకుంది. దెబ్బకు ఫాలోవర్స్ ఖాబీలేమ్ను అన్ ఫ్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే తాను రేసిజంపై పోస్ట్ చేసినందుకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు.
చదవండి: సుఖం కోసం కష్టమెందుకు?: టిక్‌టాకర్ ఖబి