khairthabad
-
ఎన్ఎస్జీ సేవలు స్ఫూర్తిదాయకం
ఖైరతాబాద్: డెబ్బైఐదేళ్ల భారత స్వాతంత్య్రోత్సవాల వేళ మాతృభూమిపై యువతలో ప్రేమను పెంచడమే లక్ష్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడి నెక్లెస్‌రోడ్డు పీపుల్స్‌ప్లాజాలో సుదర్శన్ భారత్ పరిక్రమ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్టోబర్ 2న విశాఖ నుంచి 47 మంది బ్లాక్‌క్యాట్ కమోండోలు 15 కార్లలో ర్యాలీగా బయలుదేరి ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ బ్లాక్‌క్యాట్ కారుర్యాలీని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై మాట్లాడుతూ ఎన్ఎస్జీ ఎన్నో గొప్ప ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిందని కొనియాడారు. బ్లాక్‌క్యాట్ ర్యాలీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ర్యాలీ 12 రాష్ట్రాల్లోని 18 నగరాల మీదుగా 7,500 కిలోమీటర్ల మేర కొనసాగి ఈ నెల 30న ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారకచిహ్నం వద్ద ముగుస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓగ్గుడోలు, కర్రసాము, కత్తిసాము వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్, నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ అధికారి షాలిన్, సీఆర్పీఎఫ్ హైదరాబాద్ గ్రూప్ డీఐజీ ప్రీత్ మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం: తలసాని
ఖైరతాబాద్: ఈ సంవత్సరం యథావిధిగానే హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికిప్పుడు వినాయక నిమజ్జనాలకోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారని, ఇంత తక్కువ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని, పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. నిమజ్జనం జరిగిన 48 గంటల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిమజ్జనంపై ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ రూపంలో ఈ పిటిషన్‌ను విచారించాలని కోరగా, ధర్మాసనం తిరస్కరిస్తూ, సోమవారం ఉదయం ఇదే విషయాన్ని ధర్మాసనం ముందు నివేదించాలని సూచించింది. -
ఈ కామర్స్‌తో చేనేతకు చేదోడు
ఖైరతాబాద్: ఈ కామర్స్ ద్వారా చేనేత ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు పరిశ్రమలు, ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. టెస్కో ఆధ్వర్యంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులకు కొత్తదనం తీసుకువస్తున్నామని చెప్పారు. శనివారం చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని పీపుల్స్‌ప్లాజా వేదికగా వారంపాటు ఏర్పాటు చేసిన చేనేత ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. స్టాళ్లలోని వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీతాంబరం, ఆర్మూర్ చీరల పునరుద్ధరణ, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఏర్పాటు చేసిన ఈ గోల్కొండ వెబ్‌సైట్‌తోపాటు చేనేత ఫ్యాషన్ షోను మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. 31 మంది చేనేత కళాకారులను సత్కరించి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను అందజేశారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత చేనేత, జౌళి శాఖ బడ్జెట్‌ను రూ.70 కోట్ల నుంచి రూ.1,200 కోట్లకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ నేతన్నలు భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, కళలలకు వైభవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. పోచంపల్లి ఇక్కత్, గద్వాల్ కాటన్, సిల్క్ చీరలు, నారాయణపేట కాటన్, వరంగల్ జరీలు, కరీంనగర్ బెడ్షీట్లు తెలంగాణ కళాకారుల అత్యున్నత నైపుణ్యానికి ప్రతీకలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అద్భుత చేనేత కళాకారులను గుర్తించి సత్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాతీయస్థాయి చేనేత ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కళాకారులు కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ విక్రయించుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. 25,319 మందికి చేనేతమిత్ర చేనేతమిత్ర పథకం ద్వారా 25,319 మంది చేనేత, అనుబంధ కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటివరకు రూ.13 కోట్ల 34 లక్షలు జమ చేసినట్లు కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుల రుణమాఫీ పథకం ద్వారా 2010 నుంచి 2017 వరకు తీసుకున్న రుణాలపై రూ.28 కోట్ల 96 లక్షల మేర మాఫీ చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చామన్నారు. అందరం బాధ్యతగా ముందుకొచ్చి చేనేత రంగాన్ని బతికించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
సదరోత్సాహం...
-
ఆర్టీఏలో నాగార్జున
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఇన్నోవా కారును టీఎస్ 09 ఈఎన్ 9669 నెంబర్‌పై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన కొత్త మారుతీ స్విఫ్ట్ డిజైర్ రిజిస్ట్రేషన్ కోసం వచ్చారు. టీఎస్ 09 ఈఎన్ 9580 నెంబర్‌పైన వాహనం నమోదు చేసుకున్నారు. జేటీసీ టి. రఘునాథ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు.