అమ్మవారికి నూడుల్సే నైవేద్యం!
కోల్‌కతా: అవును మీరు చదివింది కరెక్టే.. పశ్చిమబెంగాల్లో కోల్‌కతా సమీపంలోని టంగ్రా ప్రాంతంలో కాళీమాత గుడి ఉంది. ఈ ప్రాంతంలో చైనీయులు ఎక్కువగా నివసిస్తుంటారు. చైనా టౌన్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల క్రితం ఓ వృక్షం కింద ఉన్న కొన్ని రాళ్లను... స్థానికులు కాళీమాతగా పూజించేవారు.
ఆ వృక్షం సమీపంలో నివసించే ఓ చైనా కుటుంబంలోని పిల్లవాడికి ఓసారి జబ్బు చేసింది. డాక్టర్లకు చూపించినా ఫలితం లేకపోవడంతో.. ఆ కుటుంబం కాళీమాతను పూజించగా...పిల్లవాడు కొన్ని రోజులకే కోలుకున్నాడని.. అప్పటినుంచి ఆ గ్రామంలో ఉన్న చైనీయులు కాళీమాతను పూజించడం మొదలుపెట్టారనే ప్రచారం ఉంది. స్థానికంగా ఉన్న చైనీయులందరూ చందాలు వేసుకుని కాళీమాతకు గుడి కూడా కట్టారు. అమ్మవారికి నైవేద్యంగా చైనా వంటకాలనే పెడుతుంటారు.