తెలుగు సినిమా హీరో, డైరెక్టర్ కిడ్నాప్
గ్యాంగ్ స్టర్ నయీమ్ జీవిత కథ ఆధారంగా కట్టా రాంబాబు ప్రధాన పాత్రలో భరత్ పారేపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఖయ్యుoభాయ్ సినిమా ఈశుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. కాగా శనివారం మధ్యాహ్నం చిత్ర డైరెక్టర్, హీరో కిడ్నాప్ అయ్యారు. దుండగులు వారు ప్రయణిస్తున్న కారును అడ్డగించి ఆ కారును అనంతపురం తరలించారు.
అక్కడ ఒక హోటల్లో నిర్భoదించి, 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కొంత సేపటికే దుండగులు వారిని అక్కడే వదిలేసి పరారయ్యా రు. ప్రస్తుతం హీరో, దర్శకుడు సురక్షితంగా ఉన్నారు. ఈరోజు సాయంత్రానికి రాంబాబు, భరత్ హైదరాబాద్ చేరుకొనున్నారు. ఈ విషయాన్ని కట్టా రాంబాబు, భరత్ మీడియా కి తెలి పారు.