Kherki Daula
-
నన్నే టోల్ ఫీజు అడుగుతావా?!
సాక్షి, గుర్గావ్ : టోల్ ఫీజ్ చెల్లించమన్నందుకు ఒక మహిళా ఉద్యోగిపై చేయి చేసుకున్నాడో వ్యక్తి. ఈ ఘుటన గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవే మీద.. గురువారం ఉదయం11 గంటల ప్రాంతంలో జరిగింది. గురువారం ఉదయం గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవే మీదున్న ఖేర్కి దులా టోల్ ప్లాజా దగ్గరకు ఒక వాహనం వచ్చింది. ఎప్పటిలానే టోల్ ప్లాజాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిన టోల్ మొత్తాన్ని చెల్లించాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి నేను స్థానికుడను.. నాకు టోల్ ఉండదంటూ ఆగ్రహంగా ఉద్యోగినిపై చేయిచేసుకున్నాడు. అంతేకాక రాయడానికి వీలు లేని విధంగా టోల్ ప్లాజా ఉద్యోగులపై తిట్ల వర్షం కురిపించాడు. టోల్ ఉద్యోగులంతా అక్కడకు చేరుకోవడాన్ని గమనించిన సదరు వ్యక్తి అక్కడనుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది కారుకు బారీకేడ్లు అడ్డుపెట్టి పట్టుకున్నారు. పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదిలాఉండగా.. టోల్ ఫీజు అడిగినందుకు నన్ను కొట్టడంతో పాటు.. చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. #WATCH: Man argues & attempts to beat a female toll plaza employee in #Gurugram pic.twitter.com/QlhYun3x3i — ANI (@ANI) December 7, 2017 -
టోల్‌ప్లాజా వద్ద అడ్డొచ్చిన వ్యక్తిని బస్సుతో..
గుర్గావ్: టోల్ గేట్ దగ్గర టోల్ ట్యాక్స్ కట్టకుండా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఏకంగా వ్యక్తినే ఢీకొట్టడానికి వెనుకాడలేదు ఓ బస్సు డ్రైవర్. వివరాలు..గుర్గావ్లోని ఖేర్కీధౌలా టోల్‌ప్లాజా దగ్గర టోల్ టాక్స్ రూ.60 కట్టడానికి ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నిరాకరించాడు. టోల్ టాక్స్ కట్టాల్సిందిగా నిలదీయడంతో బస్సు డ్రైవర్ కట్టకుండా పారిపోవడానికి ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన టోల్ మేనేజర్‌ను ఢీకొట్టడానికి కూడా వెనకాడకపోవడంతో అతను వెంటనే పక్కకు దూకాడు. ఈ తతంగం అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డయింది. ఆదివారం రాత్రి సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరో వైపు అదే టోల్ గేట్ వద్ద జరిగిన మరో సంఘటనలో కొందరు టోల్ సిబ్బంది పై దాడికి దిగారు. ట్రక్ డ్రైవర్‌ను టోల్ అడిగినందుకు ఆరు నుంచి ఏడుగురు వచ్చి సిబ్బంది పై దాడికి దిగారు. డ్రైవర్ ఆర్సీ చూపించినా వాహనాన్ని వెళ్లడానికి అనుమతి ఇవ్వక పోవడంతో తన వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. అక్కడకు వచ్చిన వారు టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. ఖేర్కీధౌలా టోల్‌ప్లాజాలో టోల్‌ఫ్రీ ట్యాగ్ చూపించిన స్థానికులకు టోల్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంది. ఈ రెండు సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.