సిరియాలో బాంబుల మోత.. 39మంది మృతి
డెమాస్కస్: సిరియాలో మరోసారి బాంబుల మోత మోగింది. అల్ రఖ్కాలో రష్యా, అమెరికా వాయుసేనలు జరిపిన వైమానిక బాంబుదాడుల్లో 39 మంది ప్రాణాలుకోల్పోయారు. చాలామంది గాయాలపాలయ్యారు.
వీరిలో అమాయకులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురు చిన్నారులు, ఏడుగురు మహిళలు మృతుల్లో ఉన్నారు. అయితే, మృతుల సంఖ్య 60కి పెరిగే అవకాశం ఉందని సిరియా హక్కుల సంస్థ తెలిపింది. ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.