Kim Jung Nam
-
కిమ్ కుట్ర వీడియోను ప్రదర్శించారు
కౌల లంపూర్ : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సోదరుడి హత్య కేసులో నిందితులను కౌల లంపూర్ పోలీసులు షా అలం కోర్టులో ప్రవేశపెట్టారు. కిమ్ జంగ్ నామ్‌ను హత్యకు సంబంధించి ఎయిర్ పోర్టులో లభించిన పుటేజీ ఆధారంగా ఇండోనేషియా, వియత్నాంలకు చెందిన ఇద్దరు మహిళలపై, నలుగురు పురుషులపై మలేషియా పోలీసులు ఆరోపణలు నమోదు చేశారు. సిటి ఐషా, డోన్ తి రియాల్టీ షో అంటూ ఫ్రాంక్ వీడియో పేరిట నామ్‌పై దాడి చేశారంటూ డిఫెన్స్ న్యాయవాది వాదించారు. ఇక వీరితో మాట్లాడిన వారు ఉత్తర కొరియా వాసులేనన్న విషయం అధికారులు ధృవీకరించారు. అందులో ముగ్గురు వ్యక్తులు ఘటన జరిగిన గంట తర్వాత ఉత్తర కొరియా దౌత్యవేత్త, ఎయిర్ కోర్యో అధికారులతో మాట్లాడటం కూడా రికార్డు అయ్యింది. కిమ్ కుట్రగా అభివర్ణిస్తున్న ఆ వీడియోను కోర్టు హాల్లో మొత్తం ప్రదర్శించారు. కిమ్ పాలనను తప్పు బట్టిన ఆయన సోదరుడు నామ్, తర్వాత మకావ్‌కు శరణార్థిగా వెళ్లాడు. ఫిబ్రవరి 13న కిమ్ జంగ్ నామ్‌ను రసాయన ఆయుధం వీఎక్స్ తో కొందరు దుండగులు మలేషియన్ ఎయిర్‌పోర్టులో హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను ఖండించిన ఉత్తర కొరియా.. అప్పటి నుంచి మలేషియాతో దౌత్య సంబంధాలను తెంచేసుకుంది. నామ్ శవం అప్పగింత విషయంలో కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయ్ కూడా. -
కిమ్ ఈమెను మాత్రమే నమ్ముతాడు
సాక్షి : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అధికారన్ని మరింత బలపరుచుకునే విధంగా అడుగులు వేయబోతున్నాడు. 28 ఏళ్ల తన సోదరి కిమ్ జోంగ్కు కీలక బాధ్యతలు అప్పజెప్పబోతున్నాడని సమాచారం. తద్వారా కీలక నిర్ణయాలు తీసుకోవటంతోపాటు.. అధికారాన్ని కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంచాలని భావిస్తున్నాడని స్పష్టమౌతోంది. ప్యోంగ్ యాంగ్లో శనివారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అమెరికా బెదిరింపులతోపాటు జోంగ్కు బాధ్యతలు అప్పజెప్పే విషయంపై కూడా చర్చించినట్లు అధికారిక మీడియా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో కీలక పాలనా విభాగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కిమ్ సమావేశంలో వ్యక్తం చేశాడంట. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోలో ఆరుగురు అధికారులతోపాటు జోంగ్కు కూడా స్థానం కల్పించబోతున్నట్లు కిమ్ సూచన ప్రాయంగా చెప్పాడని ఈ కథనం సారాంశం. మానవ హక్కుల ఉల్లంఘన కింద ఆమెపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. కరడుగట్టిన నియంతగా పేరొందిన కిమ్ తన చెల్లెలికి కీలక బాధ్యతలు అప్పజెప్పటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కిమ్ జంగ్ ఉన్, కిమ్ యో జోంగ్లు ఒకే తల్లికి జన్మించారు. తన పక్కన ఉండే అధికారులతోసహా ఎవరినీ నమ్మని కిమ్.. జోంగ్‌ను మాత్రం బాగా నమ్ముతాడని చెబుతుంటారు. అన్నతోపాటు తరచూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది కూడా. ఈ యేడాది ఫిబ్రవరిలో సవతి సోదరుడు కిమ్ జోన్ నామ్‌ను మలేషియన్ ఎయిర్పోర్ట్ వద్ద అతిదారుణంగా కెమికల్ దాడి చేయించి కిమ్ జంగ్ చంపించిన విషయం తెలిసిందే. -
‘వీఎక్స్ నర్వ్’తో కిమ్ సోదరుడి హత్య
కౌలాలంపూర్: వీఎక్స్ (నర్వ్ ఏజెంట్) అనే అత్యంత ప్రమాదకర రసాయన విష ప్రయోగం వల్లనే ఉత్తర కొరియా నేత కిమ్ జంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జంగ్ నామ్ మరణించినట్లు శుక్రవారం మలేసియా పోలీసులు వెల్లడించారు. ఈ నెల 13న మకావ్ వెళ్లేందుకు కౌలాలంపూర్ విమానాశ్రయం చేరుకున్న కిమ్‌పై హఠాత్తుగా ఇద్దరు మహిళలు విషాన్ని చల్లారు. అది వాసన, రుచిలేని ఒక ప్రమాదకరమైన రసాయనమని పోలీసులు పేర్కొన్నారు. ఒక్క చుక్క వీఎక్స్ ఏజెంట్ బాధితుడి కేంద్ర నాడీ వ్యవస్థపై ఎంతో ప్రభావాన్ని చూపుతుందన్నారు. నామ్ ముఖం, కళ్లల్లో ఆ విషం తాలూకు అవశేషాలను కనుగొన్నట్లు స్పష్టం చేశారు. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు ఘటనా స్థలంలోనే వాంతులు చేసుకుని సొమ్మసిల్లిపడిపోయారని పేర్కొన్నారు.