ఆరోపణలు ఎదుర్కుంటున్న మహిళ
కౌల లంపూర్ : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ సోదరుడి హత్య కేసులో నిందితులను కౌల లంపూర్ పోలీసులు షా అలం కోర్టులో ప్రవేశపెట్టారు.
కిమ్ జంగ్ నామ్‌ను హత్యకు సంబంధించి ఎయిర్ పోర్టులో లభించిన పుటేజీ ఆధారంగా ఇండోనేషియా, వియత్నాంలకు చెందిన ఇద్దరు మహిళలపై, నలుగురు పురుషులపై మలేషియా పోలీసులు ఆరోపణలు నమోదు చేశారు. సిటి ఐషా, డోన్ తి రియాల్టీ షో అంటూ ఫ్రాంక్ వీడియో పేరిట నామ్‌పై దాడి చేశారంటూ డిఫెన్స్ న్యాయవాది వాదించారు. ఇక వీరితో మాట్లాడిన వారు ఉత్తర కొరియా వాసులేనన్న విషయం అధికారులు ధృవీకరించారు.
అందులో ముగ్గురు వ్యక్తులు ఘటన జరిగిన గంట తర్వాత ఉత్తర కొరియా దౌత్యవేత్త, ఎయిర్ కోర్యో అధికారులతో మాట్లాడటం కూడా రికార్డు అయ్యింది. కిమ్ కుట్రగా అభివర్ణిస్తున్న ఆ వీడియోను కోర్టు హాల్లో మొత్తం ప్రదర్శించారు. కిమ్ పాలనను తప్పు బట్టిన ఆయన సోదరుడు నామ్, తర్వాత మకావ్‌కు శరణార్థిగా వెళ్లాడు. ఫిబ్రవరి 13న కిమ్ జంగ్ నామ్‌ను రసాయన ఆయుధం వీఎక్స్ తో కొందరు దుండగులు మలేషియన్ ఎయిర్‌పోర్టులో హతమార్చిన విషయం తెలిసిందే.
అయితే ఆ ఆరోపణలను ఖండించిన ఉత్తర కొరియా.. అప్పటి నుంచి మలేషియాతో దౌత్య సంబంధాలను తెంచేసుకుంది. నామ్ శవం అప్పగింత విషయంలో కూడా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయ్ కూడా.
Comments
Please login to add a commentAdd a comment