King Kong
-
అభిమానం @ 29 ఏళ్లు
గాడ్‌ఫాదర్ లేడు. బ్యాక్గ్రౌండు లేదు. ఏదో సాధించాలని రైలేక్కి ముంబై చేరుకున్నాడు. ‘అసహ్యంగా ఉన్నాడనే’ ఛీదరింపు అతనిలో కసి పెంచింది. నటనలో మరింత రాటుదేలేలా చేసింది. బుల్లితెరపై నాలుగేళ్ల రాణింపు ఫలితం.. వెండితెరకు సాదరంగా ఆహ్వానం పలికింది. అక్కడ అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టింది. ఆ సినీ స్టార్డమ్ ఇవాల్టికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఆఫ్ ఖాన్స్.. ఈ ట్యాగుల్ని వరుస ఫ్లాపులు, డిజాస్టర్లు ఇప్పటికీ షారూఖ్ ఖాన్ నుంచి దూరం చేయలేకపోతున్నాయి. దీవానా(జూన్ 25, 1992న రిలీజ్)తో సెకండ్ హీరోగా మొదలైన షారూఖ్ నటన.. తొలినాళ్లలో నెగెటివ్ రోల్స్‌తో జనాలకు దగ్గరైంది. మేనరిజం, చేతుల చాచే స్టయిల్, నటన.. యువతలో చెరగని ఓ ముద్ర వేశాయి. 90వ దశకం నుంచి దాదాపు పదిహేనేళ్లకుపైగా లవర్‌బాయ్, ఫ్యామిలీమ్యాన్ తరహా పాత్రలతో షారూఖ్‌ను అలరించేలా చేశాయి. కి..కి..కిరణ్ ఇప్పుడున్న యాక్టింగ్ జనరేషన్ నెగెటివ్ రోల్స్‌ను తేలికగా ఓన్ చేసుకుంటోంది. కానీ, అప్పట్లో ఆడియెన్స్ ఎలా రియాక్టర్ అవుతారో అనే సంగ్ధిగ్దం నడుమే స్టార్లు పచ్చ జెండా ఊపేవాళ్లు. అలాంటిది యాక్టింగ్ తొలినాళ్లలో.. అదీ ఛాలెంజింగ్ రోల్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశాడు షారూఖ్. పగతో రగిలిపోయి ప్రేమను సైతం చంపుకునే యువకుడిగా ‘బాజీఘర్’లో, సైకో లవర్‌గా ‘డర్’, ‘అంజామ్’ సినిమాలతో హీరో‘విలని’జం పండించాడు. ‘కరణ్ అర్జున్, దిల్వాలే దుల్హానియా లే జాయేంగే, కోయ్లా, దిల్ తో పాగల్ హై, డుప్లికేట్, కుచ్కుచ్ హోతా హై, జోష్, మోహబ్బతేన్, మైహూనా’ లాంటి ఎంటర్టైన్మెంట్ సబ్జెక్టులు యూత్‌లో షారూఖ్ క్రేజ్‌ను అమాంతం పెంచాయి. అన్ని భాషల్లో షారూక్ పేరు మారుమోగేలా చేయడంతో పాటు బాలీవుడ్‌కి బాద్షాగా షారూఖ్‌ను నిలబెట్టాయి. ప్రయోగాలు వెక్కిరించినా.. షారూఖ్ కెరీర్లో పర్దేశ్, డీడీఎల్జే, దేవదాస్, కల్హోనహో, వీర్‌జరా, చక్‌దే ఇండియా లాంటి పర్ఫార్మెన్స్ బేస్డ్ సినిమాలే కాదు.. ప్రయోగాలు చాలానే ఉన్నాయి. దిల్ సే, అశోక, ఛల్తే ఛల్తే, స్వదేశ్, మై నేమ్ ఈజ్ ఖాన్, రా వన్, ఫ్యాన్, రాయిస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చినప్పటికీ.. షారూఖ్ యాక్టింగ్‌కు ఆడియెన్స్‌ను ఫిదా చేయకుండా ఉండలేకపోయాయి. ఇక డిజాస్టర్ల సంగతి సరేసరి. అయినప్పటికీ షారూఖ్ స్టార్ హీరో క్రేజ్, ఫ్యాన్డమ్ ఈనాటికి తగ్గలేదు. అందుకు కారణం.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించాడనే. ముంబైలోని మన్నత్ ముందు ప్రతీ పుట్టినరోజుకి క్యూ కట్టే అభిమానం చాలు.. షారూక్‌పై అభిమానం ఏనాటికీ తరిగిపోదని చాటి చెప్పడానికి. Been working. Just saw the ’overwhelmed ness’ of the lov of nearly 30 yrs u r showering on me here. Realised it’s more than half my life in the service of hoping to entertain u all. Will take out time tomorrow & share some love back personally. Thx needed to feel loved…. — Shah Rukh Khan (@iamsrk) June 24, 2021 -
భీకర యుద్ధం మొదలవ్వబోతోంది
రెండు అతి భారీ ప్రాణుల మధ్య భీకర యుద్ధం మొదలవ్వబోతోంది. నిజంగా కాదు! ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ సినిమాలో. ఆదామ్ విన్గార్డ్ డైరెక్షన్లో వార్నర్ బ్రదర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. ‘‘మనకు ఇదొక్కటే మార్గం’’ అన్న డైలాగ్‌తో మొదలై.. ‘‘ కాంగో ఎవరి ముందు తలవంచడు’’ అన్న డైలాగ్ వరకు ట్రైలర్ అద్భుతంగా ఉంది. రెండిటి మధ్య పోరాట సన్ని వేశాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరాన్ని నాశనం చేయటానికి పూనుకున్న గాడ్జిల్లాను అంతమొందించటానికి మనుషులు కాంగ్‌ను రంగంలోకి దించుతున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ( బాండ్ మళ్లీ వాయిదా ) గాడ్జిల్లా, కాంగ్‌లు ప్రధాన పాత్రలుగా ఇంతవరకు చాలా సినిమాలు వచ్చాయి. గాడ్జిల్లా: కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్, షిన్ గాడ్జిల్లా, గాడ్జిల్లా: ప్లానెట్ ఆఫ్ ది మాన్స్టర్స్, గాడ్జిల్లా: సిటీ ఆఫ్ ది ఎడ్జ్ ఆఫ్ బ్యాటిల్ ఇలా మొత్తం 40 పైగా సినిమాలు వచ్చాయి. ఇక కాంగ్ తక్కువ వాడేమీ కాదు! 1933లో వచ్చిన కింగ్ కాంగ్ మొదలుకుని మొన్నటి కాంగ్:స్కల్ ఐలాండ్ వరకు మొత్తం పదికి పైగా సినిమాలు ఉన్నాయి. మార్చి 26న హెచ్‌బీఓ మ్యాక్స్‌తో పాటు థియేటర్లలో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. -
కాంగ్: స్కల్ ఐల్యాండ్
మాయా ద్వీపంలో మహా మర్కటం హాలీవుడ్ 2005లో ‘కింగ్ కాంగ్’ సినిమా వచ్చింది. ఒక వింత దీవిలోని కింగ్ కాంగ్ (భారీ గొరిల్లా) అక్కడకు షూటింగ్ కోసం వచ్చిన సినిమా యూనిట్‌లోని హీరోయిన్‌తో ప్రేమలో పడుతుంది. తన ప్రేమ కోసం దీవి నుంచి న్యూయార్క్ నగరానికి వచ్చి నానా బాధలు పడుతుంది. సర్కస్‌కు చిక్కుతుంది. ఆఖరకు పోలీసులతో యుద్ధంలో ప్రాణాలు విడుస్తుంది. భారీ విజయం సాధించిన ఆ సినిమాను పోలిన (సీక్వెల్ కాదు) మరో సినిమా ఇప్పుడు రాబోతోంది. పేరు ‘కాంగ్: స్కల్ ఐలాండ్’. ‘మాన్స్టర్ మూవీ’ గా హాలీవుడ్ పేర్కొనే ఈ తరహా సినిమాలు గతంలో వచ్చినా ఎప్పటికప్పుడు ప్రేక్షకాదరణ ఉండనే ఉంటుంది. అందుకే గతంలో ‘గాడ్జిల్లా’ (2014)ను నిర్మించిన లెజండరీ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. వార్నర్ బ్రదర్స్ పంపిణీ చేస్తోంది. ‘కాంగ్: స్కల్ ఐల్యాండ్’ కథ 1970ల నాటిది. ఆ సమయంలో ఒక పరిశోధక బృందం అరుదైన జాతులున్న ఒక కొత్త దీవిని కనిపెడుతుంది. దానికి పయనమైపోతుంది. కాని ఆ దీవిలో అన్ని జీవులూ భారీగా ఉంటాయి. అన్నింటి కంటే భారీగా కింగ్ కాంగ్ ఉంటుంది. అక్కడకు వెళ్లిన బృందం ఆ భారీ జీవులన్నింటి మీదా యుద్ధాన్ని ప్రకటిస్తుంది. అయితే కథ గడిచే కొద్దీ కింగ్ కాంగ్ చంపదగ్గ జీవి కాదని బృందంలోని కొందరు వ్యక్తులకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందనేది కథ. టామ్ హిడిల్స్టన్, జాన్ గుడ్మేన్ తదితరులు నటించిన ఈ సినిమా ఈ నెలలోనే అమెరికాలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండియాలో ఇంకా విడుదల తేదీ తెలియదు. బహుశా వేసవిలో విడుదల చేయాలని పూనుకుంటే మాత్రం పిల్లలకే కాదు, పెద్దలకూ కనువిందే.