యూత్‌ఫెస్ట్‌లో... కుర్రకారు హుషారు
ఎరీనావన్లో కాలేజీ కుర్రకారు అదరగొడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ ల్లో కాలేజీ జట్లు హోరాహోరీగా తలపడితే.. బాస్కెట్‌బాల్‌లో నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డారు. ఫొటోగ్రఫీ, శిల్పకళ పోటీల్లో తమ సృజనాత్మకత చాటుతున్నారు. క్విజ్ కాంపిటీషన్లో మెదడుకు పదును పెట్టారు. ఈ యూత్‌ఫెస్ట్ నగర విద్యార్థులకు ఫుల్ జోష్ నింపింది.
సిటీబ్యూరో/కలెక్టరేట్/చాంద్రాయణగుట్ట: కింగ్‌కోఠిలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కళాశాలలో క్విజ్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన 60 గ్రూపులు ఈ పోటీలో పాల్గొన్నాయి. రెండు రౌండ్లుగా నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు. విజేతలేవరో చివరిక్షణం వరకూ తెలియనంత ఉత్కం ఠగా పోటీ సాగింది. న్యాయనిర్ణేతలుగా సెయింట్ జోసె ఫ్ కాలేజీ ఇంగ్లిషు డిపార్ట్మెంట్ హెచ్ఓడీ ప్రొఫెసర్ సంగీత మోట్కర్, ఇంటర్నల్ క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ కో ఆర్డినేటర్ ఈస్తర్ రత్నలు వ్యవహించారు. సాక్షి కార్పొరేట్ ఈవెంట్స్ ఏజీఎం హరీష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాలేజీ డెరైక్టర్ విశ్వేశ్వరరావు, ప్రిన్సిపాల్ విన్సెంట్ ఆరోఖ్యదాస్, క్విజ్ మాస్టర్ రితేష్ బెనడిట్, జకిఉద్దీన్, షేక్, జిలానీ, ఉమర్, షరీఫ్, రచన, అమన్, నౌమన్ తదితరులు పాల్గొన్నారు.
క్విజ్ విజేతలు
ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ (ఎస్.ఎం.మునీర్ అలీ, సయ్యద్ మన్సూర్ అహ్మద్) మొదటి స్థానంలో నిలవగా...ఘట్కేసర్లోని ఏస్ ఇంజినీరింగ్ కళాశాల (ఎ.శ్రీకాంత్‌రెడ్డి, వి.సూర్యతేజ) రన్నరప్‌గా నిలిచింది.
ఇలాంటి ఈవెంట్లతో ఎంతో మేలు
ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఈ పోటీలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.ఆడియో, వీడియోల ప్రశ్నలు కొత్త అనుభూతి కల్గించాయి. సాక్షి కృషి అభినందనీయం. నాలాంటి ఎం దరో విద్యార్థులకు ఈ ఈవెంట్లు ఎంతో మేలుచేస్తాయి.
- ఎస్.ఎం. మునీర్అలీ,
ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్
చక్కటి వేదిక
విద్యార్ధుల్లోని ప్రతిభ, సృజనాత్మకత వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతో అవసరం. ఉచి తంగా సాక్షి ఇలాంటి ఈవెంట్లు నిర్వహించడం ఎంతో అభినందనీయం. అందరు విద్యార్థులు తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఈ వేదిక చక్కటి అవకాశం. - ఎ. శ్రీకాంత్‌రెడ్డి, ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్ధి