kiss on camera
-
‘రాసలీలల’ కెమెరా తొలగింపు.. విచారణకు ఆదేశం
బ్రిటన్ మాజీ మంత్రి రాసలీలల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సీసీ కెమెరాను తొలగించిన ప్రభుత్వం.. అది అధికారిక కెమెరా కాదని ప్రకటించడం విశేషం. వ్యక్తిగత కార్యదర్శితో మాట్ హాంకాక్ ముద్దుల రసక్రీడ కొనసాగిస్తూ సీసీ కెమెరా కంటికి చిక్కడం.. ఆ ఫొటోలు టాబ్లాయిడ్లో ప్రముఖంగా ప్రచురితం కావడంతో ఆరోగ్య మంత్రి(కార్యదర్శి కూడా)గా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇక ఇందుకు కారణమైన సీసీ కెమెరా అక్కడికి ఎలా వచ్చిందనే దానిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు కొత్త ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ వెల్లడించారు. లండన్: బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి కార్యాలయంలో దొరికిన సీసీ టీవీ కెమెరా.. రెగ్యులర్ ఆఫీస్ కెమెరా కాదని కొత్త ఆరోగ్య మంత్రి(కార్యదర్శి) సాజిద్ జావిద్ వెల్లడించాడు. అంతేకాదు ఈ ఘటన తర్వాత మిగతా ఎంపీల ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించామని, ఇలాంటి కెమెరాలేవీ బయటపడలేదని తెలిపాడు. కాబట్టి, ఉద్దేశపూర్వకంగా మాట్ హాంకాక్ ఆఫీస్‌లో కెమెరాలు ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేశాడాయన. ఇక ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించిన ఆయన.. హాంకాక్ యవ్వారంపై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించాడు. బోరిస్‌పై ప్రశ్నల వర్షం ఇక హాంకాక్ పట్ల ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రదర్శించిన ఉదాసీనతపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి గురువారం ఈ ఫొటోలు పేపర్ ద్వారా బయటికి రాగా.. శుక్రవారం ఘటనకు సంబంధించి హాంకాక్ క్షమాపణలు చెప్పాడు. అయితే అతనిపై వేటు వేయకుండా కేవలం ఆ సారీతో సరిపెట్టుకుని.. ‘మ్యాటర్ క్లోజ్డ్’ అని ప్రకటించాడు బోరిస్. ఇది మరింత విమర్శలకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే హాంకాక్ బలవంతపు రాజీనామా, బోరిస్ అన్యమనస్కంగానే దానిని ఆమోదించడం జరిగిపోయాయి. అయితే ఈ విమర్శలపై ప్రధాని బోరిస్ తాజాగా స్పందించాడు. మహమ్మారి విజృంభణ టైంలో ఆరోగ్య మంత్రి మార్పును అంత త్వరగా చేయడం సబబు కాదనే ఉద్దేశంతో.. కాస్త ఆలస్యం జరిగినట్లు బోరిస్ వివరణ ఇచ్చాడు. ఈ వ్యవహారంలో మరిన్ని అనుమానాలు ఉన్నాయి. హాంకాక్ మెయిల్స్ పాలసీని బబ్రేక్ చేశాడని, నిధుల అవకతవకలకు పాల్పడ్డాడని, వ్యక్తిగత ఉద్దేశాలకు కార్యాలయాన్ని వాడుకున్నాడని.. ఇలా ఆరోపణలెన్నో ఉన్నాయి. ఈ తరుణంలో వీటిపై దర్యాప్తునకు ఆదేశించడంపై బోరిస్ మౌనం వహించడం ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలా బయటికొచ్చింది ఒక ఎంపీ ఆఫీస్‌లో నిషేధిత జోన్లో సీసీ కెమెరా బిగించడం ఒక ఎత్తు అయితే.. ఆ వీడియో ఫుటేజీ బయటకు రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందన్న విషయాన్ని తేల్చే పనిలో పడ్డాయి బ్రిటన్ నిఘా వర్గాలు. ఇక ఈ వీడియో/ఫొటోలో ఉన్న హాంకాక్ మాజీ కార్యదర్శి గినా కొలాడాంగెలో మీద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సోషల్ కేర్‌లో పని చేసిన గినా.. చాలా ఏళ్లుగా మ్యాట్ హాంకాక్తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆధారాలున్నాయి. అంతేకాదు ఆ పరిచయాలతోనే ఆమె తన పనుల్ని చక్కబెట్టుకున్నట్లు, కుటుంబ సభ్యుల్ని ఉన్నత స్థానాల్లో నియమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ లాక్డౌన్ ఆంక్షలను వ్యతిరేకించిన ఓ డీహెచ్ఎస్సీ ఉద్యోగి.. బ్లాక్మెయిల్ ఉద్దేశంతో ఈ పని చేసి ఉండటానే అనుమానాలు ఉన్నాయి. దీంతో ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది కూడా. చదవండి: పాత ఎఫైర్‌ని పీఏగా.. ఆపై ఆఫీస్‌లోనే కసితీరా ముద్దులు -
నేను ముద్దు పెట్టనని ఎవరన్నారు?
పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ హాట్ హీరోయిన్ సన్నీ లియోన్ అభిమానులకు ఓ అరుదైన గిఫ్ట్ ఇచ్చింది. ఆమె కెమెరా ముందు ముద్దు సన్నివేశాల్లో నటించదన్న అభిప్రాయాన్ని ఇక అందరూ చెరిపేసుకునేలా.. ఒక ఘాటైన ముద్దు ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. శుక్రవారం నాడే 35 ఏళ్లు నిండిన సన్నీ.. తన భర్త డేనియల్ వెబర్‌కు ఘాటైన ముద్దు ఇచ్చి, ఆ ఫొటోను అందరికీ చూపించింది. ''నేను కెమెరా ముందు ముద్దు పెట్టనని ఎవరు చెప్పారు.. హెహే డేనియల్ వెబర్'' అని ఆ ఫొటోకు ఓ వ్యాఖ్య కూడా పెట్టింది. జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పహేలి లీలా, కుఛ్ కుఛ్ లోచా హై, మస్తీజాదే లాంటి ఎ రేటెడ్ సినిమాల్లో సన్నీ లియోన్ హాట్‌గా నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నటించిన 'వన్ నైట్ స్టాండ్' కూడా విడుదలైంది. మస్తీజాదే సినిమా తనకు చాలా ప్రత్యేకమని, తన అభిమానులు అంతా ఆ సినిమా పట్ల అపార ప్రేమాభిమానాలు కురిపించారని సన్నీ ఖుషీ ఖుషీగా చెప్పింది. ఆ సినిమాలో సన్నీ డబుల్ రోల్ పోషించిన విషయం తెలిసిందే. తన అభిమానులంతా ఈ సినిమాను ఎప్పుడు కావాలంటే అప్పుడు 'హంగామా ప్లే'లో చూసుకోవచ్చని.. ఇంతకంటే మంచి బర్త్‌డే గిఫ్టును తాను అడగలేనని సన్నీ చెప్పింది. ఈ అడల్ట్ కామెడీ సినిమాలో తుషార్ కపూర్, వీర్‌దాస్ ప్రధాన పాత్రలు పోషించారు. Who said I don't kiss on camera?!?!? Hehe :) @DanielWeber99 pic.twitter.com/VjG6CNHTJ2 — Sunny Leone (@SunnyLeone) 13 May 2016