knives attacked
-
తహశీల్దార్ కార్యాలయంలో కత్తులతో దాడి
సాక్షి, వైఎస్సార్ : వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట తహశీల్దార్ కార్యాలయంలో భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సందర్భంలో అక్కడే ఉన్న అనిల్‌కుమార్ రెడ్డి వర్గీయులు నరసింహారెడ్డి వర్గీయులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. కాగా ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పత్రిక రిపోర్టర్ దారుణ హత్య
పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం తిరుమల దేవి పేట గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కుప్పాల వెంకట నాగేశ్వర్ రావు (40) ఓ పత్రికలో కంట్రిబ్యూటర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం భార్యతో కలిసి తిరుమలదేవి పేటలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. బైక్ పై తిరిగి వస్తుండగా.. ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వీరిపై కత్తులతో దాడి చేశారు. దుండగులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వరలక్ష్మిని పక్కకు తోసేశారు. దీంతో ఆమె ఫోన్ ద్వారా అంబులెన్స్ కు సామాచారం అందించింది. అయితే అంబులెన్స్ వచ్చే సరికే నాగేశ్వరరావు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాలే.. హత్యకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.