Kodali Sri Venkateswara Rao ( Nani )
-
పప్పు, తుప్పును నమ్ముకుంటే తెలంగాణలో పట్టిన గతే: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి: పరిషత్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 99 శాతం జెడ్పీటీసీ, 85 శాతం ఎంపీటీసీలు గెలిచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబు, నిమ్మగడ్డ వాయిదా వేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చాక మార్చిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే ఎక్కడా టీడీపీ గెలవదని లెక్కింపు ఆపేశారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే చూడలేని ఈ చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటారని మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 800 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచారు.. వాళ్లందరూ చంద్రబాబుని ధిక్కరించినవాళ్లా? అని సూటిగా ప్రశ్నించారు. ఆ గెలిచిన వాళ్లలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోండి అని సూచించారు. ప్రతిపక్షం ఖాళీ అయినట్టు చంద్రబాబు ఒప్పుకుంటున్నారని నాని పేర్కొన్నారు. ఈ పప్పు, తుప్పును నమ్ముకుంటే తెలంగాణలో పట్టిన గతేనని పడుతుందని జోస్యం చెప్పారు. అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తాను తలచుకుంటే ఇంకా దారుణంగా తిట్టగలనని ఆయన వార్నింగ్ ఇచ్చారు. -
బెడిసి కొట్టిన టీడీపీ వ్యూహం
కౌన్సిల్లో రచ్చకు విఫలయత్నం తిప్పికొట్టిన వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ :గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ చేయాలనే టీడీపీ కౌన్సిల్ సభ్యుల వ్యూహం బెడిసి కొట్టింది. అత్యవసర సమావేశాన్ని వాయిదా వేయించేందుకు పట్టుబట్టి సమావేశం ఆదినుంచి చివరి వరకు ఆందోళనలు నిర్వహించి అభాసుపాలయ్యారు. వైఎస్సార్సీపీ సభ్యుల సమయస్ఫూర్తితో సమావేశం ఎజెండాలోని 64 అంశాలకు గానూ 61 అంశాలకు ఆమోదం అభించింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ లేచి మాట్లాడుతూ తాము సమాచార హక్కు చట్టం ద్వారా మున్సిపల్ కమిషనర్‌ను సమాచారం అడిగామని ఇంతవరకు ఇవ్వలేదని చైర్మన్ యలవర్తిని ఇరకాటంలో పెట్టాలనే వ్యూహంతో ప్రశ్నించారు. దీనిపై అధికార వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు లేచి ఎజెండాలో లేని అంశంపై ఎలా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అయితే టీడీపీ సభ్యులు ముందుగా రచించుకున్న వ్యూహం ప్రకారం చైర్మన్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. నవంబర్ 1నుంచి జన్మభూమి సభలు ఉన్నందున తప్పనిసరి పరిస్థితిలో అత్యవసర సమావేశం జరుపుతున్నామని యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వినకుండా ఆందోళనకు దిగడంతో సమావే శాన్ని 15నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ యలవర్తి ప్రకటించారు. ఆ సమయంలో అధికార, ప్రతిపక్ష నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలు రచించారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో అధికార వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అంతా సమావేశం ఎలా నిర్వహించాలో వ్యూహ రచన చేశారు. టీడీపీ పక్ష నాయకుడు లింగం ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం వాయిదా వేసే వరకు ఆందోళన చేపట్టాలనే ప్రతివ్యూహంతో ముందుకొచ్చారు. సమావేశం తిరిగి ప్రారంభం కాగానే టీడీపీ కౌన్సిలర్లు యథాప్రకారం చైర్మన్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. టీడీపీ సభ్యులు అల్లర్లు, ఆందోళనలు జరుగుతుండగానే వైస్‌చైర్మన్ అడపా బాబ్జీ, కౌన్సిలర్లు చోరగుడి రవికాంత్, కిలిమి వెంకటరెడ్డి ప్రతిగా ఆందోళనకు దిగారు. చివరకు సమావేశాన్ని కొనసాగించి ఎజెండాలోని 64 అంశాలకు గానూ61 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు గణపతి లక్ష్మణరావు, కాటి విశాలి, వెంపల హైమావతి, అల్లం సూర్యప్రభ, జ్యోతుల సత్యవేణి, వసంతవాడ దుర్గారావు, బొమ్మారెడ్డి ధనలక్ష్మీ, గొర్లశ్రీను, టీడీపీ కౌన్సిలర్లు బొడ్డు శివశ్రీ, అడుసుమిల్లి శ్రీనివాసరావు, పసలాది ఏసుబాబు పాల్గొన్నారు. -
ప్రజల ఆశీస్సులే గెలిపించాయి : కొడాలి
గుడివాడ అర్బన్ : ప్రజల ఆశీస్సులు, కార్యకర్తలు కష్టించి పనిచేయడం వల్లే తాను గెలుపొందానని ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. ‘కృష్ణజ్యోతి’ సాయంకాల దినపత్రిక సంపాదకుడు శ్రీకాంత్ బుధవారం రాత్రి పట్టణంలో కొడాలి నానితోపాటు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన సీనియర్ కౌన్సెలర్లకు సన్మాన సభ ఏర్పాటుచేశారు. తెలుగు వికాస పరిరక్షణ నాయకుడు డీఆర్బీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొడాలి నాని మాట్లాడుతూ తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి ప్రజల అభిమానం, ఆశీస్సులే కారణమని చెప్పారు. తాను వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొంది గుడివాడ అంటే టీడీపీ అడ్డా అనుకునే పిచ్చిభ్రమల నుంచి కొందరని బయటపడేశానని పేర్కొన్నారు. తనను గెలిపించిన ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మునిసిపల్ కౌన్సిలర్లుగా గెలిచిన ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ కొడాలి నానిపై గుడివాడలో ఎవరూ గెలుపొందలేరని అభిప్రాయపడ్డారు. అనంతరం యలవర్తి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు నెరుసు చింతయ్య, అడపా బాబ్జీ, వెంపల హైమావతిలను ఘనంగా సన్మానించారు. నాయకులు పాలేటి చంటి, పెదదుర్గారావు, రావులకొల్లు హైమావతి, రామలింగేశ్వరరావు, కాటి విశాలి, మూడెడ్ల ఉమా, రావులకొల్లు సుబ్రహ్మణ్యం, వెంపల అప్పారావు, ఆది, హన్ను, బోయిన శ్రీనివాసమూర్తి, వంకా విజయకుమార్, బన్ను, గాయత్రి, బాణావత్ ఇందిరారాణి, కాటాబత్తుల రత్నకుమారి, పాలేటి చంటి, గంధం రాజేంద్రప్రసాద్, ఉషోదయ పాఠశాల ప్రిన్సిపాల్ తుమ్మల రత్న, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు దుడ్డు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
కొడాలి కుమార్తెలకు జగన్ ఆశీస్సులు
గుడివాడ : శుక్రవారం జరిగిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కుమార్తెల నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అధినేత, పులివెందుల శాసనసభ్యులు వైఎస్.జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. కొడాలి నాని కుమార్తె విజయదుర్గకు కొడాలి నాని సోదరుడు చిన్న కుమార్తె శ్రీఅఖిలాండేశ్వరిదేవికి ఆయన ఆశీస్సులందజేశారు. జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ ప్రముఖులు హాజరయ్యారు. గుడివాడకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు జగన్‌ను కలిసి కరచాలనం చేశారు. జగన్మోహన్రెడ్డి వెంట పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా,పేర్ని నాని, కైకలూరు నియోజక వర్గ పార్టీ కన్వీనర్ దూలం నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు తెనాలి పార్లమెంటు మాజీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు దుక్కిపాటిశశిభూషణ్, పాలేటి చంటి, నందివాడ మండల పార్టీ కన్వీనర్ పెయ్యల ఆదాం, గుడివాడ పట్టణ పార్టీ మహిళా విభాగం కన్వీనర్ కాటాబత్తుల రత్నకుమారి, మున్సిపల్ కౌన్సిలర్లు అడపా బాబ్జీ, మేరుగు మరియకుమారి, గొర్ల శ్రీనివాసరావు, నెరుసు చింతయ్య, పొట్లూరి కృష్ణారావు వెంపల హైమావతితోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులున్నారు.