రోబో గజరాజు!
వివాహాది శుభకార్యాలకు గజరాజులను తీసుకొస్తే ఆ వేడుకలు అంగరంగ వైభవ మే. ఇప్పుడు వేడుకలకు ఏనుగును తీసుకురావడం అంటే ఖరీదైన వ్యవహారమే కాదు, జంతు సంరక్షణ చట్టం నిబంధన లు పెద్ద అడ్డంకి. అందుకే ఆ ఆనందాన్ని పంచుకున్న అనుభూతిని కల్పించేందుకు ఈ రోబో గజరాజును రూపొందించాడు తిరుచ్చి జిల్లా ఉడుమలైపేట్టకు చెందిన అబ్దుల్ హకీం. పెళ్లిళ్లు, ఆలయా ల్లో ఉత్సవాలకు అలంకారాలు చేసే ఇతను ఒకసారి కొడెకైనాల్ నుంచి వస్తుండగా చెక్క ఏనుగు, కీలుగుర్రాలను మార్కెట్లో చూశాడట.
దీంతో ఈ రెండు బొమ్మల లక్షణాలను కలిపి ఏనుగును తయారుచేస్తే ఎలాగుంటుందనే ఆలోచన వచ్చింది. బంకమట్టిలో ఇనుప ముక్కలు కలిపి ఈ ఏనుగుకు రూపమిచ్చాడు. రంగురంగుల వస్త్రాలతో అలంకరించి ఏనుగులా సిద్ధం చేశాడు. ఇది జనరేటర్ సహాయంతో పని చేస్తుంది. తన సొంతూరులోనైతే రోజుకు రూ.3,500, మరోచోటకైతే రవాణా చార్జీలు కలుపుకుని రూ.18 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.