రోబో గజరాజు! | Robot elephant | Sakshi
Sakshi News home page

రోబో గజరాజు!

Published Thu, Oct 30 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

రోబో గజరాజు!

రోబో గజరాజు!

వివాహాది శుభకార్యాలకు గజరాజులను తీసుకొస్తే ఆ వేడుకలు అంగరంగ వైభవ మే. ఇప్పుడు వేడుకలకు ఏనుగును తీసుకురావడం అంటే ఖరీదైన వ్యవహారమే కాదు, జంతు సంరక్షణ చట్టం నిబంధన లు పెద్ద అడ్డంకి. అందుకే ఆ ఆనందాన్ని పంచుకున్న అనుభూతిని కల్పించేందుకు ఈ రోబో గజరాజును రూపొందించాడు తిరుచ్చి జిల్లా ఉడుమలైపేట్టకు చెందిన అబ్దుల్ హకీం. పెళ్లిళ్లు, ఆలయా ల్లో ఉత్సవాలకు అలంకారాలు చేసే ఇతను ఒకసారి కొడెకైనాల్ నుంచి వస్తుండగా చెక్క ఏనుగు, కీలుగుర్రాలను మార్కెట్‌లో చూశాడట.

దీంతో ఈ రెండు బొమ్మల లక్షణాలను కలిపి ఏనుగును తయారుచేస్తే ఎలాగుంటుందనే ఆలోచన వచ్చింది. బంకమట్టిలో ఇనుప ముక్కలు కలిపి ఈ ఏనుగుకు రూపమిచ్చాడు. రంగురంగుల వస్త్రాలతో అలంకరించి ఏనుగులా సిద్ధం చేశాడు. ఇది జనరేటర్ సహాయంతో పని చేస్తుంది.  తన సొంతూరులోనైతే రోజుకు రూ.3,500, మరోచోటకైతే రవాణా చార్జీలు కలుపుకుని రూ.18 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement