Abdul Hakim
-
'నేను ఇండియన్.. నా కొడుకు శవం కూడా చూడను'
తిరువనంతపురం: ఎప్పుడూ అబ్బజాన్ అబ్బజాన్ అనే పిలిచే తన కుమారుడు అనూహ్యంగా తనను కఫీర్(దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి, దేవుడిని వ్యతిరేకించే వ్యక్తి అని అర్థం) అంటూ పిలిచి తనను అవాక్కయ్యేలా చేశాడని అబ్దుల్ హకీమ్ అనే ఓ తండ్రి చెప్పాడు. అతడి కుమారుడు అయిన హఫీసుద్దీన్(22) గత కొద్ది రోజులుగా కనిపించకుండా పోయాడు. అతడితోపాటు మరికొందరు కేరళ వాసులు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ లో చేరేందుకు వెళ్లిపోయారని ఇటీవల వార్తలు కూడా వస్తున్నాయి. అదే నిజం అన్నట్లుగా నిన్న ముంబయిలో కేరళకు చెందిన ఓ జంట కూడా పట్టుబడింది. ఈ నేపథ్యంలో పోలీసులు, మీడియా ప్రతినిధులు కనిపించకుండా పోయినవారి ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా హఫీసుద్దీన్ తండ్రి మీడియాకు విస్తుపోయే విషయాలు చెప్పాడు. తన కుమారుడు పూర్తిగా తీవ్ర భావజాలానికి లోనయ్యాడని, దిగ్భ్రాంతికి గురయ్యేలా అబ్బజాన్ అని పిలవడం మానేసి కఫీర్ అనడం మొదలుపెట్టాడని, తన కుమారుడు పూర్తిగా మారిపోయాడని చెప్పారు. 'నా కన్నకొడుకే నన్ను కఫీర్ అని పిలిచాడు. వాడిని తీవ్రభావజాలం పూర్తిగా మార్చేసింది. ఒక రోజు నాకు మెస్సేజ్ పెట్టాడు. అందులో నాకు ఇప్పుడు స్వర్గం దొరికింది. అందులో పన్నులు లేవు. ప్రత్యేక షరియా చట్టం లేదు. ఇక్కడ నన్నెవరు పట్టుకునే వారు లేరు. ఇది నిజంగా చాలా మంచి చోటు అనిరాశాడు' అని చెప్పారు. తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ 'అతడు భారతదేశాన్ని ఇష్టపడకుంటే.. ఈ దేశానికి వ్యతిరేకంగా ఏదైనా పనిచేస్తే అతడు నాకొడుకైనా నాకొద్దు. వాడి శవాన్ని కూడా చూడను. అసలు వాడు అలా ఎలా మారాడనే దానిపై నాకు ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు. నేను ఒక భారతీయుడిని.. వాడు చస్తే ఆ శవాన్ని కూడా చూడాలనుకోను' అని ఆయన చెప్పారు. కాలికట్ లో ఖురాన్ చదివేందుకని ఇంట్లో నుంచి బయలుదేరిన హఫీజుద్దీన్ ఆ తర్వాత మరిన్ని చదువులకోసం శ్రీలంక వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. ఈద్ సందర్భంగా ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు తాను ఒక కారణం కోసం స్వర్గానికి వెళుతున్నానని చెప్పాడు. ఎక్కడ ఉన్నాడనే విషయం మాత్రం చెప్పలేదు. -
రోబో గజరాజు!
వివాహాది శుభకార్యాలకు గజరాజులను తీసుకొస్తే ఆ వేడుకలు అంగరంగ వైభవ మే. ఇప్పుడు వేడుకలకు ఏనుగును తీసుకురావడం అంటే ఖరీదైన వ్యవహారమే కాదు, జంతు సంరక్షణ చట్టం నిబంధన లు పెద్ద అడ్డంకి. అందుకే ఆ ఆనందాన్ని పంచుకున్న అనుభూతిని కల్పించేందుకు ఈ రోబో గజరాజును రూపొందించాడు తిరుచ్చి జిల్లా ఉడుమలైపేట్టకు చెందిన అబ్దుల్ హకీం. పెళ్లిళ్లు, ఆలయా ల్లో ఉత్సవాలకు అలంకారాలు చేసే ఇతను ఒకసారి కొడెకైనాల్ నుంచి వస్తుండగా చెక్క ఏనుగు, కీలుగుర్రాలను మార్కెట్లో చూశాడట. దీంతో ఈ రెండు బొమ్మల లక్షణాలను కలిపి ఏనుగును తయారుచేస్తే ఎలాగుంటుందనే ఆలోచన వచ్చింది. బంకమట్టిలో ఇనుప ముక్కలు కలిపి ఈ ఏనుగుకు రూపమిచ్చాడు. రంగురంగుల వస్త్రాలతో అలంకరించి ఏనుగులా సిద్ధం చేశాడు. ఇది జనరేటర్ సహాయంతో పని చేస్తుంది. తన సొంతూరులోనైతే రోజుకు రూ.3,500, మరోచోటకైతే రవాణా చార్జీలు కలుపుకుని రూ.18 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. -
పోలీసు వాహనాన్ని ఢీకొట్టి...హోంగార్డు కిడ్నాప్
సుల్తాన్‌బజార్, న్యూస్‌లైన్: పోలీసు వాహనాన్ని ఢీకొట్టినందుకు ఠాణాకు రమ్మని కోరిన హోంగార్డ్ను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్ఐ నరేశ్ కథనం ప్రకారం... చాంద్రాయణగుట్టకు చెందిన అబ్దుల్ హకీం(29) కోఠి ట్రూప్‌బజార్‌లో ఎలక్ట్రానిక్స్ షాపు నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫరాన్(20), మహ్మద్ రియాన్(18) ఇతని వద్ద సేల్స్మన్లుగా పని చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి 11 గంటలకు కానిస్టేబుల్ మాదవయ్య, హోంగార్డ్ ముత్యాలు తెరచి ఉన్న దుకాణాలను మూసి వేయిస్తున్నారు. కోఠి బ్యాంక్‌స్ట్రీట్ వద్ద పార్క్ చేసి ఉన్న పోలీసుల వాహనాన్ని అబ్దుల్ హకీం తన మారుతీ కారుతో ఢీకొట్టాడు. ఆగ్రహానికి గురైన పోలీసులు కారులో ఉన్న ముగ్గురు యువకులను మందలించడంతో వాగ్వాదం జరిగింది. కానిస్టేబుల్ మాదవయ్య కారు తాళాలు లాక్కున్నాడు. దీనికి ప్రతిగా వారు పోలీసుల వాహనం తాళాన్ని లాక్కున్నాడు. దీంతో కానిస్టేబుల్ వారికి కారు తాళాలు ఇచ్చేశాడు. పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పి ముత్యాలును కారులో కూర్చోబెట్టాడు. ఇదే అదనుగా భావించిన ఆ యువకులు కారును ఉస్మానియా మెడికల్ కళాశాల వైపు పోనిచ్చారు. మార్గం మధ్యలో హోంగార్డ్‌పై ముష్టిఘాతాలు కురిపించారు. కారును ఛాదర్ఘట్ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వెనుకే వస్తున్న కానిస్టేబుల్ ఇది గమనించి..వెంటనే సుల్తాన్‌బజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సెట్లో కారు నెంబర్, ఇతర వివరాలు తెలిపి ఛాదర్‌ఘాట్ పోలీసులను అప్రమత్తంచేశారు. ఎస్ఐ శ్రీకాంత్ ట్రాఫిక్‌ను నిలిపి వేసి సదరు కారు కోసం వెతుకుతుండగా అప్పటికే కారు ఛాదర్ ఘాట్ దాటిపోయింది. పోలీసులను చూసి హోంగార్డ్ అరవడంతో ఛేజింగ్ చేసి మలక్‌పేట్ రైల్వే బ్రిడ్జి వద్ద కారును పట్టుకొని హోంగార్డ్ను విడిపించారు. ముగ్గురు నిందితులను సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించగా.. కిడ్నాప్, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.