konasima
-
గోదావరి అందాలు.. ఒక్కసారి చూస్తే మైమరిచిపోవాల్సిందే!
కోనసీమ అందాల సీమ. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని.. సప్త నదీపాయల మధ్య కొలువైన సీమ. పచ్చని తివాచీ పరిచినట్టు ఉండే చేలు, కొబ్బరితోపులు, గోదావరి నదీపాయలు, వంపులు తిరుగుతూ పారే పంట కాలువలు, తెరచాప పడవలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, మడ అడవులు, గోదావరి మధ్య లంక గ్రామాలు, మండువా లోగిళ్లు, రైతుల మకాంలు.. వీటన్నింటికీ మించి ఆత్మీయత, మమకారంతో కలిసిన ఆతిథ్యం ఇలా చెప్పుకుంటూ పోతే కోనసీమ పర్యాటకులకు స్వర్గధామం. రైతులు, కూలీలు, మత్స్యకారులు, మహిళల జీవనం విధానం, కట్టూబొట్టూ, పండగలు, పబ్బాలు, జాతరలు.. ఇలా ఇక్కడ అన్నింటా ఒక ప్రత్యేక ముద్ర. ఇటీవల కాలంలో గోదావరి, సముద్ర తీరంలో వెలుస్తున్న రిసార్ట్స్, రైతుల పొలాల వద్ద ఫామ్ హౌస్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా కోనసీమకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ‘సప్త’వర్ణాల కోనసీమ.. పర్యాటకంగా కూడా ‘సప్త’రకాలుగా ఆకట్టుకుంటోంది. సెప్టెంబరు 27 ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా కథనం. ఆధ్యాత్మికంగా.. ఆధ్యాత్మిక రంగంలో కోనసీమ జిల్లాకు ప్రముఖ స్థానం ఉంది. లెక్కలేనన్ని ఆలయాలు, పురాణ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు కోనసీమ సొంతం. వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రత్యేక విమానాలలో భక్తులు వస్తున్నారు. వీటితోపాటు అంతర్వేది లక్ష్మీ నర్శింహస్వామి, మందపల్లి శనీశ్వర స్వామి, అయినవిల్లి శ్రీ విఘేశ్వరస్వామి, అప్పనపల్లి బాలబాలాజీ, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. బౌద్ధులు.. రాజుల చారిత్రక ఆనవాళ్లు చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యాటకానికి వస్తే రామచంద్రపురంలో 17వ శతాబ్ధం నాటి కోట ఉంది. మామిడికుదురు మండలం ఆదుర్రులో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్ధం నాటి పురాతన బౌద్ధ స్థూపాలున్నాయి. కపిలేశ్వరపురం జమీందార్ల పురాతన భవనాలు, రాజుల కోటలను తలపించే మండువా లోగిళ్ల ఇళ్లు పర్యాటకులకు ముచ్చటగొల్పుతాయి. అగ్రి టూరిజం పర్యాటకంలో ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది అగ్రి టూరిజానికే. దేశంలో కేరళలో మొదలైన ఈ పర్యాటకం విస్తరిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ఐటీ వంటి రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు అగ్రి టూరిజం బాట పడుతున్నారు. ఇటువంటి వారికి కోనసీమ అగ్రి టూరిజం ఒక అద్భుతం. పచ్చని తివాచీ పరచినట్టు ఉండే వరిచేలు, కొబ్బరి, అరటి తోటలు, లంక గ్రామాల్లో పలు రకాల పంటలు, పాడి, ఆక్వా చెరువులు, తోటల్లోని రైతుల మకాం (వ్యవసాయ శాలలు) విశేషంగా ఆకర్షిస్తాయి. గోదావరి హొయలు గోదావరి నదీ అందాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. నది మధ్యలో లంక గ్రామాలు, వాటిలో సాగయ్యే పంటలు, ఇసుక తిన్నెలు, చెంగుచెంగున ఎగిరే కృష్ణ జింకలు, తెరచాప పడవలు, పంటులు, హౌస్బోట్లపై సాగే ప్రయాణం, నదీపాయలపై వంతెనలు.. గోదావరి కాలువలకు లాకులు,ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరి హొయలు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మైమరపించే మడ అడవులు ఐ.పోలవరం మండలం భైరవపాలెం నుంచి అంతర్వేది సముద్ర తీరం వరకు నదీపాయలతోపాటు, మురుగునీటి కాలువలు సముద్రంలో కలిసే ప్రాంతాలలో ఉన్న మడ అడవులలో పర్యాటకం అద్భుతమనే చెప్పాలి. నదీ, కాలువ పాయల మధ్య మడ అడవులు మీదుగా సాగే ప్రయాణం మధురానుభూతిని పంచుతుంది. ఆతిథ్యం అద్భుతం అతిథి మర్యాదంటేనే గోదావరి జిల్లాలు. మరీ ముఖ్యంగా కోనసీమ ఆహారం.. అతిథ్యానికి ఫిదా అవ్వాల్సిందే. పర్యాటకుల జిహ్వ చాపల్యాన్ని తీర్చే రకరకాల స్వీట్లు, హాట్లు, టిఫిన్లు, బిర్యానీలు, మాంసహార కూరలు ఎన్నో.. ఎన్నెన్నో. ఆత్రేయపురం పూతరేకులు.. అవిడి పాలకోవా, మినప రొట్టి, చెరుకుపానకం, పెసరెట్టు ఉప్మా, పనస పొట్టు కూర, ముద్దపప్పు.. గుమ్మడి పులుసు, ఉల్లి గారెలు... నాటు కోడి కూర, చుక్కపీత ఇగురు.. పులసల పులుసు ఇలా ఎన్నో రకాల వంటకాలు పర్యాటకులను లోట్టలు వేయిస్తాయి. -
ఆయిల్ ఫామ్ సాగుతో డబ్బులే డబ్బులు.. పెట్టుబడులు పోగా ఎకరానికి లాభం ఎంతంటే?
సాక్షి అమలాపురం: కోనసీమ అంటేనే వరి.. మొక్కజొన్న.. అపరాలు వంటి వ్యవసాయ పంటలు... కొబ్బరి.. అరటి... కందా వంటి ఉద్యాన పంటలు గుర్తుకు వస్తాయి. ఆయిల్ పామ్ అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతమే గుర్తుకు వస్తుంది. ఈ పంటకు మెట్టలోని ఎర్ర నేలలు అనుకూలమని. నల్లరేగడి నేలల్లో పండదని ఒక నమ్మకం. కానీ జిల్లా ఉద్యాన శాఖ మాత్రం గోదావరి డెల్టా భూముల్లో ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చని, లాభాలు పొందే అవకాశముందని ధీమాగా చెబుతోంది. చదవండి: పల్నాడు రైతుల వినూత్న పంథా.. ‘ఫల’ప్రదం చెప్పడమే కాదు... జిల్లా రైతులతో పెద్ద ఎత్తున సాగు చేయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా సర్వేసాయి ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ అని కంపెనీతో ఉద్యాన శాఖ ఎంవోయూ చేసుకుంది. ఈ సంస్థ కోనసీమ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు పనిచేయనుంది. నర్శరీలు ఏర్పాటు చేయడం, సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి రాయితీలు, సాంకేతిక పరిజ్ఞానం అందజేయడంతోపాటు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా వారే ఆయిల్‌పామ్ గెలలను రైతుల వద్ద నుంచి సేకరించనున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ ఆయిల్ పామ్ సాగు అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రంగంపేట, రాజానగరం, గోకవరం, తుని, ప్రత్తిపాడు, ఏలేశ్వరం వంటి మెట్ట ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఒకానొక సమయంలో ఈ సాగు సైతం తీవ్ర సంక్షోభానికి గురయింది. గెల టన్ను ధర రూ.7 వేల కన్నా తగ్గడం వల్ల రైతులు నష్టాలు పాలవడంతోపాటు తోటలు తొలగించారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది. దీనికితోడు అంతర్జాతీయంగా మారిన సమీకరణల వల్ల మలేషియా వంటి దేశాల నుంచి పామాయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించడంతో స్థానికంగా పండే ఆయిల్ పామ్ గెలలకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ఒకానొక సమయంలో టన్ను ధర ఏకంగా రూ.23 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో టన్నుకు రూ.15,912 వరకు ధర ఉంది. దీనితో పలువురు రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడప్పుడే వంట నూనెల ధరలు తగ్గే అవకాశం లేదని తెలిసి ఈ సాగు మీద ఆసక్తి చూపుతున్నారు. సాగు విస్తరణకు ఉద్యానశాఖ యత్నం కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాలతోపాటు కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలంలో మినహా మిగిలిన ప్రాంతంలో దీర్ఘకాలిక ఉద్యాన పంట అంటే కొబ్బరికే రైతులు పరిమితమయ్యారు. దీంతోపాటు కోకో, పోక వంటి పంటలు సాగు చేస్తారు. ఈ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చాలా తక్కువ. కేవలం 988 ఎకరాలు మాత్రమే ఉందని అంచనా. అది కూడా మండపేట నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. దీనిని జిల్లాలో సాగుకు అనుకూలమైన ప్రాంతాలకు విస్తరించాలని ఉద్యానశాఖ తలపోస్తోంది. గతంలో విఫలమైనా.. గతంలో కోనసీమలో ఆయిల్‌పామ్ సాగు పెంచడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంబాజీపేటకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయినవిల్లి మండలం సిరిపల్లి వద్ద ఆయిల్ తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినా స్థానికుల నుంచి అభ్యంతరాలు రావడంతో నిలిచిపోయింది. పామాయిల్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ సాగును అన్ని ప్రాంతాల్లోనూ ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సర్వేసాయి కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. తొలి దశలో కపిలేశ్వరపురం, రాయవరం, రామచంద్రపురం, కె.గంగవరం, కొత్తపేట, ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెంతో పాటు రెండవ దశలో అమలాపురం డివిజన్ పరిధిలో ఈ సాగును ప్రోత్సహించాలని ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మెరక భూములు, మెరక ప్రాంతాల్లో రబీ నీరు అందని శివారు వరి చేలు, భారీ వరదలు వస్తే కాని ముంపుబారిన పడని లంక గ్రామాల్లోని మెరక ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగుకు అన్ని విధాలా మేలు అని గుర్తించారు. ‘జిల్లాలోని డెల్టా భూములు కూడా సాగుకు అనుకూలమే. అయినవిల్లిలో ఒక రైతు ఎకరాకు 10 టన్నుల సగటు దిగుబడి తెచ్చారు. ఇప్పటి ధరను పరిగణలోకి తీసుకుంటే రూ.1.59 లక్షల ఆదాయం వస్తున్నట్టు. పెట్టుబడులు ఎకరాకు రూ.40 వేలు తీసివేస్తే రైతుకు రూ.1.19 లక్షల వరకు ఆదాయం వస్తోంది’ అని సర్వేసాయి సంస్థ ప్రతినిధి ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. వరి, కొబ్బరి లాభసాటి కాకపోవడం వల్ల అనుకూలమైన ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగు చేసే అవకాశముందని రైతులు చెబుతున్నారు. ఖాళీ మెరక ప్రాంతాలు అనుకూలం గోదావరి డెల్టా ప్రాంతాలు సైతం ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలం. ఖాళీగా ఉన్న మెరక ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు అన్ని విధాలా మేలు. నీటి ఎద్దడి ఉన్న భూములలో డ్రిప్ ద్వారా సాగు చేయవచ్చు. సాగుకు ఆసక్తి చూపే రైతులకు ప్రభుత్వం అన్నిరకాలుగానూ సహకరిస్తోంది. – ఎన్.మల్లికార్జునరావు, ఉద్యానశాఖ జిల్లా అధికారి -
‘ఆ ఘటన వెనుక ఎవరున్నారు?.. వారిద్దరూ ఎందుకు ఖండించలేదు’
సాక్షి, అమరావతి: కోనసీమ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం చారిత్రక నిర్ణయం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సామాజిక న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనన్నారు. అంబేద్కర్ పేరు పెట్టడం దళితులందరికీ ఎంతో గర్వకారణమన్నారు. చదవండి: ఆపసోపాలు.. పడరాని పాట్లు.. నవ్వులపాలైన టీడీపీ కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కోనసీమ అల్లర్ల ఘటనను ఇంతవరకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఖండించలేదని దుయ్యబట్టారు. ఆ అల్లర్ల వెనుక ఎవరున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. రాజ్యాంగ నిర్మాతను కులాలకు అతీతంగా చూడాలి. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తూ ఆయన్ని వ్యతిరేకిస్తారా అని ప్రశ్నించారు. అల్లరిమూకలను దూరంగా పెట్టాలని కోనసీమ ప్రజలకు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. -
మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు
రామచంద్రపురం(కోనసీమ జిల్లా): బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం ఉదయం రామచంద్రపురంలో నడుచుకుంటూ తిరిగారు. ఖుర్ఫాన్ హోటల్ వద్ద ఆగి కష్టం సుఖం మాట్లాడారు. తానే స్వయంగా పెనం మీద దోశ వేశారు. టీ తాగుతూ అక్కడ ఉన్న వారితో కాసేపు మాట్లాడారు. చదవండి👉: నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు! -
కొత్త రెవెన్యూ డివిజన్: కొత్తపేటకు పచ్చజెండా
కొత్తపేట(కోనసీమ జిల్లా): కోనసీమ జిల్లాలోని మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డికు అభినందనలు తెలుపుతున్నారు. కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ఇప్పటికే అమలాపురం, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ గత నెల 30న ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు దీంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యాన అధికార వైఎస్సార్ సీపీతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వివిధ సంస్థల ప్రతినిధులు, స్థానికులు సంబరాలు జరుపుకొన్నారు. కొత్తపేటలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు ఎమ్మెల్యే, అమలాపురం ఆర్డీఓ వసంతరాయుడు కలిసి 31న పలు భవనాలను పరిశీలించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలోని ఎంవీఎస్ సుబ్బరాజు కల్యాణ మంటపం అనువైనదిగా నిర్ణయించారు. వెనువెంటనే ఆ భవనానికి ‘రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయం, కొత్తపేట, కోనసీమ జిల్లా’ పేరుతో బోర్డు కూడా ఏర్పాటు చేశారు. అయితే సాంకేతిక కారణాలతో కొత్తపేట డివిజన్ ప్రస్తావన లేకుండా అమలాపురం, రామచంద్రపురం డివిజన్లతోనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంతవరకూ అమలాపురం డివిజన్లో ఉన్న కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం మండలాలతో పాటు రాజమహేంద్రవరం డివిజన్లో ఉన్న ఆలమూరు మండలాన్ని రామచంద్రపురం డివిజన్లో కలుపుతూ ఈ నెల 3న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. దీంతో సుబ్బరాజు కల్యాణ మంటపానికి ఏర్పాటు చేసిన ‘కొత్తపేట రెవెన్యూ డివిజన్ బోర్డు’ కూడా తొలగించారు. ఇదీ.. రెవెన్యూ డివిజన్ పరిధి కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, పి.గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగ్గిరెడ్డి.. గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన రోజు ఉదయమే ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హుటాహుటిన విజయవాడ వెళ్లారు. డివిజన్ ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని నేరుగా కలిశారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హామీ పొందారు. చివరకు జగ్గిరెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం కొత్తపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజల ఆకాంక్ష నెరవేరింది కొత్తపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ప్రజల ఆకాంక్ష నెరవేరింది. పూర్వపు తాలూకా, పంచాయతీ సమితి కేంద్రంగా ఒక వైభవం, వెలుగు వెలిగిన కొత్తపేటకు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో పునర్వైభవం వస్తుంది. నేను ఎప్పుడూ నియోజకవర్గ అభివృద్ధినే కాంక్షించాను. ఇందుకు అనుగుణంగానే ముందుకు వెళుతున్నాను. కొత్తపేట రెవెన్యూ డివిజన్‌కు క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి, సహకరించిన సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. – చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, కొత్తపేట -
కోనసీమ ప్రభ
-
జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని కనుమా!
మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, పవిత్రమైన ప్రభల తీర్థం. జగ్గన్నతోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు, అంతా కొబ్బరితోటలే. ఏకాదశ రుద్రులు కొలువు తీరడం వలన జగ్గన్నతోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను, చారిత్రాత్మక విశిష్టతను సంతరించుకున్నది. ఏకాదశ రుద్రుల కొలువు లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు (జగ్గన్న) గారు ప్రభల తీర్థానికి విచ్చేసి, ఏకాదశ రుద్రులను దర్శించి, ప్రభల తీర్ధం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషి సల్పినారనీ, నాటి జగ్గన్న పూజల ఫలితంగానే ప్రభల తీర్థం జరిగే ప్రదేశం ‘జగ్గన్న’ తోటగా ప్రసిద్ధికెక్కిందని చారిత్రాత్మక కథనం. ప్రభల తీర్థం రోజున ఏకాదశ రుద్ర గ్రామాలలో కొలువున్న స్వామి వార్లు గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు– చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం–వ్యాఘ్రేశ్వరస్వామి, పెదపూడి– మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక–కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు–చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల–రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి–చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు–అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్లను ప్రభలపై మేళతాళాలతో, భాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో జగ్గన్నతోటకు ఊరేగింపుగా తీసుకొని రావడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రభల తీర్థానికి ఆతిథ్యమిచ్చు మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి అన్ని ప్రభలకన్నా ముందుగా జగ్గన్న తోటకు చేరుకొని, ప్రభలు అన్నింటికీ ఆహ్వానం పలికి తిరిగి వెళ్ళేవరకూ ఉండటం సాంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభల తీర్ధం లోనికి ప్రవేశించినపుడు మిగిలిన రుద్ర ప్రభలను ఒకసారి పైకి లేపడం సంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ప్రత్యేకవిశిష్టతను సంతరించుకున్న గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు–చెన్నమల్లేశ్వరస్వామి వార్ల ప్రభావాహనాలను కౌశికలో నుండి అవతలి ఒడ్డుకు చేర్చడం వంటి రమణీయ దృశ్యాలు చూడటానికి రెండు కన్నులూ చాలవు. ముఖ్యంగా జగ్గన్న తోట ప్రభల తీర్థంలో ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండి, అన్ని ప్రభల కన్నా ఆఖరుగా వచ్చే గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వరస్వామి ప్రభావాహనం తీర్ధంలోనికి వచ్చేవరకూ మిగిలిన ప్రభలు కూడా వేచి ఉండటం విశేషం. నిండు ప్రవాహంలో విశ్వేశ్వరస్వామి వారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కన్నులారా తిలకించే భక్త జన సందోహ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. అలా ఏక కాలంలో ఏకాదశ రుద్రులను ఒకే వేదికపై దర్శించి, తరించే భాగ్యం మరి ఏ ఉత్సవాలలోనూ కలగదు. నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని కనుమా!
మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, పవిత్రమైన ప్రభల తీర్థం. జగ్గన్నతోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు, అంతా కొబ్బరితోటలే. ఏకాదశ రుద్రులు కొలువు తీరడం వలన జగ్గన్నతోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను, చారిత్రాత్మక విశిష్టతను సంతరించుకున్నది. ఏకాదశ రుద్రుల కొలువు లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు (జగ్గన్న) గారు ప్రభల తీర్థానికి విచ్చేసి, ఏకాదశ రుద్రులను దర్శించి, ప్రభల తీర్ధం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషి సల్పినారనీ, నాటి జగ్గన్న పూజల ఫలితంగానే ప్రభల తీర్థం జరిగే ప్రదేశం ‘జగ్గన్న’ తోటగా ప్రసిద్ధికెక్కిందని చారిత్రాత్మక కథనం. ప్రభల తీర్థం రోజున ఏకాదశ రుద్ర గ్రామాలలో కొలువున్న స్వామి వార్లు గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు– చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం–వ్యాఘ్రేశ్వరస్వామి, పెదపూడి– మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక–కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు–చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల–రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి–చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు–అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్లను ప్రభలపై మేళతాళాలతో, భాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో జగ్గన్నతోటకు ఊరేగింపుగా తీసుకొని రావడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రభల తీర్థానికి ఆతిథ్యమిచ్చు మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి అన్ని ప్రభలకన్నా ముందుగా జగ్గన్న తోటకు చేరుకొని, ప్రభలు అన్నింటికీ ఆహ్వానం పలికి తిరిగి వెళ్ళేవరకూ ఉండటం సాంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభల తీర్ధం లోనికి ప్రవేశించినపుడు మిగిలిన రుద్ర ప్రభలను ఒకసారి పైకి లేపడం సంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ప్రత్యేకవిశిష్టతను సంతరించుకున్న గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు–చెన్నమల్లేశ్వరస్వామి వార్ల ప్రభావాహనాలను కౌశికలో నుండి అవతలి ఒడ్డుకు చేర్చడం వంటి రమణీయ దృశ్యాలు చూడటానికి రెండు కన్నులూ చాలవు. ముఖ్యంగా జగ్గన్న తోట ప్రభల తీర్థంలో ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండి, అన్ని ప్రభల కన్నా ఆఖరుగా వచ్చే గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వరస్వామి ప్రభావాహనం తీర్ధంలోనికి వచ్చేవరకూ మిగిలిన ప్రభలు కూడా వేచి ఉండటం విశేషం. నిండు ప్రవాహంలో విశ్వేశ్వరస్వామి వారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కన్నులారా తిలకించే భక్త జన సందోహ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. అలా ఏక కాలంలో ఏకాదశ రుద్రులను ఒకే వేదికపై దర్శించి, తరించే భాగ్యం మరి ఏ ఉత్సవాలలోనూ కలగదు. నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
రాజమహేంద్రవరం : గోదావరి ఉగ్రరూపరం
-
కోనసీమ లంక ప్రాంతాల్లో తగ్గని వరద
సాక్షి, తూర్పుగోదావరిః కోనసీమ లంక ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంక ప్రాంతాల్లో అంతర పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సఖినేటిపల్లి మండలంలోని పెదలంక, అప్పనరాము లంక, సఖినేటిపల్లి లంక గ్రామాలు.. గత మూడు రోజులుగా జల దిగ్భంధంలోనే చిక్కుకున్నాయి. కాజ్‌వేలపై కొనసాగుతున్న వరద ప్రవాహంః పి.గన్నవరం మండలం అయినవిల్లిలంక, కనాకాయిలంక కాజ్ వేలపై వరదప్రవాహం కొనసాగుతోంది. ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠానేలంక, గురజాపులంకలో కాయగూరల పంటలు నీట మనిగాయి అల్లవరం మండలం బోడసకుర్రులో మూడు రోజులుగా పల్లిపాలెం,జల దిగ్భంధనంలోనే ఉన్నాయి. నాటు పడవలపైనే రాకపోకలుః ఐ.పోలవరం మండలం గోగుల్లంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో నాటుపడవలపై స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. సఖినేటిపల్లిలో వరద ఉధృతికి అప్పనరాముని లంక,కొత్తలంక గ్రామాలు నీట మునగడంతో అప్పరాముని లంక హైస్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. -
పెద్దపల్లి టు కోనసీమ
► పెద్ద సంఖ్యలో తరలుతున్న పుంజులు ►పందెం కోళ్లకు అక్కడ మంచి డిమాండ్ ►జిల్లాలో విరివిగా పెంపకం పెద్దపల్లి : కోడి పందేలపై జిల్లా ప్రజలకు పెద్దగా ఆసక్తి లేకపోయినా గ్రామీణ ప్రాంతాల్లో పందెం కోళ్లు మా త్రం విరివిగా పెంచుతున్నారు. వీటిని కోనసీమ జిల్లాలతోపాటు మహారాష్ట్రకు తరలిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంతోపాటు కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు, ధర్మా రం మండలాల్లోని పలు గ్రామాల్లో నాటుకోళ్లు పెంచుతున్నవారు పందెం కోళ్లనూ పెంచుతున్నారు. గతంలో ఇక్కడ పెంచిన పందెం కోళ్లను సంక్రాంతి సందర్భం గా శివపల్లి, బెల్లంపల్లి, చందోలి, శ్రీరాంపూర్లోసాగే పందేలకు తీసుకెళ్లేవారు. రెండేళ్లుగా ఈ ప్రాం తంలో పందేలపై నిషేధం విధించారు. అయినా పందెం కోళ్ల పెంపకం మాత్రం నిరాటంకంగానే కొనసాగుతోంది. నాటుకోళ్లు(పెరటికోళ్లు) పెంచుకునేవారు వాటితోపా టు పందెం కోళ్లను పెంచుతున్నారు. నాటుకోళ్లకు కిలో చొప్పున మామూలు ధర ఉండగా, పందెం కోళ్లకు మం చి డిమాండ్ ఉంటుంది. ఒక్కో కోడిపుంజు పెంపకం కోసం సాధారణంగా వాడే విత్తనాలు కాకుండా బా దాం, ఖాజు లాంటి విలువైన పోషక పదార్థాలు వాడడంతో ఏడాదిలోనే పందెం కోడి నాలుగైదు కిలోలకు చేరుకుంటుంది. ఒక్క పుంజు ఖరీదు రూ.2 వేల నుంచి 5 వేలు పలుకుతోంది. రహస్యంగా వ్యాపారులు ఈ ప్రాంతం నుంచి సేకరించిన పందెం కోళ్లను సంక్రాంతి సీజన్ సమయంలో కోనసీమ ప్రాంతంలో జరిగే పోటీ ల్లో పాల్గొనే పందెంరాయుళ్లకు విక్రయిస్తున్నారు. స్థాని కంగా లభిస్తున్న కోళ్లకు కోనసీమ ప్రాంతంలో రూ.10వేల వరకు ధర పలుకుతుందని చెబుతున్నారు. అలాగే చంద్రాపూర్ ప్రాంతంలోనూ ఇదే ధర ఉంటుం దని అంటున్నారు. దీంతో పందెం కోళ్ల పెంపకంపై శ్రద్ధచూపేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పం దెం కోడి పిల్ల ఖరీదు రూ. 300 నుంచి రూ.500 వరకు ఉంటుంది. దీనిని పెద్ద సనుగు అంటూ విక్రయిస్తుంటారు. ఏడాదిలో పెట్టిన పెట్టుబడి పదింతలవుతుంది. దీంతో నాటుకోళ్లు రెండు గంపలుగా పెంచడం కన్నా నాలుగు పందెం కోళ్లను పెంచితే రెట్టింపు లాభం వస్తుందని పెంపకందారులు అంటున్నారు. -
కూకూ బండి ... కోనసీమకు వస్తోందండీ
⇒ రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్ల కేటారుుంపు ⇒ తొలివిడతగా గౌతమీ నదిపై వంతెనకు టెండర్ల పిలుపు ⇒ దశలవారీగా వైనతేయ, వశిష్టలపై వంతెనల నిర్మాణానికి ⇒ నిధుల విడుదల అనంతరమే మొత్తం లైను నిర్మాణం ⇒ పదేళ్ల నాటికైనా పూర్తవుతుందన్న నమ్మకం ⇒ 2000లో దీని బడ్జెట్ రూ.645 కోట్లు, ఇప్పుడు రూ.2 వేల కోట్లు అమలాపురం టౌన్ : కోనసీమలోని పచ్చని పొలాల మధ్యలోంచి...పంట కాల్వలు..ఏటి గట్లు దాటుకుంటూ...మూడు నదుల వంతెనలపై నుంచి రైలు బండి పరుగెడుతుంటే చూడాలన్న ఈ సీమ ప్రజల ఆశలు ఆలస్యమైనా ఇప్పుడిప్పుడే మళ్లీ చిగురిస్తున్నాయి. ఆ ఆశ నెరవేరాలంటే కనీసం పదేళ్లు వేచి చూడాల్సిందే. ఈ రైలు తొలుత అమలాపురం వరకూ మాత్రమే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వే బడ్జెట్లో రూ.200 కోట్ల కేటాయింపుతో దశాబ్దాల కల నెరవేరనుందన్న నమ్మకం ఈ ప్రాంతవాసుల్లో పెరిగింది. ఈ రైలు పరుగులు తీయూలంటే కోనసీమలో ముందుగా కోటిపల్లి - ముక్తేశ్వరం మధ్య గౌతమీ నదిపై వంతెన నిర్మించాలి. ఇందుకోసం టెండర్లు పిలవటంతో మార్గానికి సుగమమవుతోందని అంటున్నారు. ఆది నుంచీ అడ్డంకులే... గోదావరిపై నిర్మించాల్సిన మూడు వంతెనలే ఆది నుంచీ అడ్డంకిగా నిలిచాయి. లైన్ బడ్జెట్ ఒక ఎత్తయితే వంతెన బడ్జెట్ దానికి మించి భారమవుతోంది. ఈ క్రమంలో తొలుత కోటిపల్లి-ముక్తేశ్వరం మధ్య తొలి వంతెనకు టెండర్లు పిలవటంతో ఇక రైలు కోనసీమలో అడుగుపెట్టేందుకు సానుకూల సంకేతాలకు తెరలేచినట్టరుుంది. 2000 సంవత్సరంలో 54 కిలోమీటర్ల ఈ లైనుకు పునాది రాయి పడినప్పుడు ప్రాజెక్టు అంచనా కేవలం రూ.645 కోట్లు. ఇప్పుడు 16 ఏళ్ల జాప్యంతో ఆ వ్యయం దాదాపు రూ. రెండు వేల కోట్లకు చేరుకుంది. దశల వారీ నిర్మాణమే అనివార్యం... ఇంతటి భారీ వ్యయంతో ఉన్న ఈ లైను నిర్మాణానికి రైల్వే బడ్జెట్లో ఒకేసారి కాకుండా దశలవారీగా నిధులు కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ లైను కోసం అయినవిల్లి మండలం తొత్తరమూడి నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి వరకూ 185 ఎకరాలు ఇది వరకే సేకరించారు. కోటిపల్లి ఏటిగట్టు నుంచి ముక్తేశ్వరం ఏటిగట్టు వరకూ అంటే వంతెన నిర్మించే 3.55 కిలోమీటర్ల పొడవులో దాదాపు 84 ఎకరాల సేకరణ కూడా పూర్తయింది. దీంతో రైలు అమలాపురం వరకూ వచ్చేందుకు మార్గం సుగమం అయినట్లే. కాకినాడ నుంచి రైళ్లు ఎలా నడుపుతున్నారో అలా అమలాపురం నుంచి కూడా కొన్నేళ్లు నడిపేంచే ఏర్పాట్లు చేయాలని ప్రజాప్రతినిధులు యోచిస్తున్నారు. తర్వాత దశల వారీగా వైనతేయ, ఆ తరువాతవశిష్ట నదులపై వంతెన నిర్మించటం ద్వారా కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైనుకు పూర్తి స్వరూపం వస్తుంది. ఇదంతా సవ్యంగా జరిగితే పదేళ్లపైనే పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తం రైల్వే లైను కోనసీమకు సాకారమైనప్పుడే పారిశ్రామిక కారిడార్లు, డ్రెజ్జింగ్ హార్బర్ వంటి అనూహ్య ప్రగతి సాధ్యమవుతుంది. తొలి వంతెన మాదిరిగా మిగతా రెండు వంతెనల నిర్మాణానికి వచ్చే ఏడాది టెండర్లు పిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు.